Vikram Sarabhai Space Centre
-
Vikram Sarabhai: భారత అంతరిక్ష పరిశోధనలకు ఆద్యునిగా..
విక్రమ్ సారాభాయ్ పేరు విన్నంతనే మనకు ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్’ రూపంలో స్ఫురణకు వస్తారు. ఈరోజు (డిసెంబరు 30) విక్రమ్ సారాభాయ్ వర్థంతి. భౌతిక శాస్త్రవేత్తగా, ఖగోళ శాస్త్రవేత్తగా దేశానికి ఎంతో సేవ చేసిన ఆయన 1971, డిసెంబరు 30న కన్నుమూశారు. శాస్త్రవేత్తగా ఆయన అందించిన సహకారం మరువలేనిది. విక్రమ్ సారాభాయ్ పలు విషయాలపై పరిశోధన పత్రాలు రాయడమే కాకుండా ఎన్నో సంస్థలను కూడా స్థాపించారు. భారతదేశ అంతరిక్ష పరిశోధనలకు, దేశ అణుశక్తి అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది.కేంబ్రిడ్జ్ నుండి పట్టా పొంది..1919, ఆగస్టు 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించిన విక్రమ్ సారాభాయ్.. అంబాలాల్ సారాభాయ్, సరళా సారాభాయ్‌ల కుమారుడు. ఆయన 1937లో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ నుండి ట్రిపోస్ డిగ్రీని అందుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో భారతదేశానికి తిరిగి వచ్చిన విక్రమ్ సారాభాయ్(Vikram Sarabhai) మరో శాస్త్రవేత్త శివరామన్ పర్యవేక్షణలో పరిశోధనలు సాగించడం మొదలుపెట్టారు.86 శాస్త్రీయ పరిశోధనా పత్రాలువిక్రమ్ సారాభాయ్ తన జీవితంలో మొత్తం 86 శాస్త్రీయ పరిశోధనా పత్రాలను రాశారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, సంస్కృతికి సంబంధించిన 40 సంస్థలను స్థాపించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఆయన చేసిన కృషికిగాను మరణానంతరం ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ ప్రకటించింది. విక్రమ్ సారాభాయ్ పేరు మీద పలు సంస్థలు తెరుచుకున్నాయి. చంద్రయాన్ మిషన్(Chandrayaan Mission)కు చెందిన ల్యాండర్‌ను కూడా విక్రమ్ ల్యాండర్ అని పిలుస్తారు.పరిశోధనలు సాగాయిలా..విక్రమ్ సారాభాయ్ తన మొదటి పరిశోధనా కథనాన్ని టైమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాస్మిక్ రేంజ్ పేరుతో ప్రచురించారు. 1940-45 మధ్య కాలంలో సీవీ రామన్ సారధ్యంలో కాస్మిక్ రేంజ్‌పై పరిశోధనలు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కేంబ్రిడ్జ్‌కి తిరిగి వెళ్లిన విక్రమ్ సారాభాయ్ ఉష్ణమండల అక్షాంశాలలో కాస్మిక్ కిరణాలపై తన పరిశోధనను పూర్తి చేసి డాక్టరేట్ పొందారు.అనంతరం భారత్‌కు తిరిగివచ్చి, కాస్మిక్ రేడియేషన్, రేడియో ఫిజిక్స్(Radio Physics)లపై పలు పరిశోధనలు సాగించారు.అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తిగా..ఇంటర్‌ప్లానెటరీ స్పేస్, సౌర ఈక్వటోరియల్ రిలేషన్స్, జియోమాగ్నెటిజంపై కూడా ఆయన పరిశోధనలు చేశారు. విక్రమ్ సారాభాయ్ పరిశోధనలను సైద్ధాంతిక భౌతిక శాస్త్రం, రేడియో భౌతిక శాస్త్రం పరిధిలోకి తీసుకువచ్చారు. ఆయన తన పరిశోధనలకు ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ నుండి ఆర్థికసాయం అందుకున్నారు. భారతదేశపు మొట్టమొదటి మార్కెట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆపరేషన్ రీసెర్చ్ గ్రూప్ స్థాపనలో కూడా ప్రధాన పాత్ర పోషించారు. అతనితో పనిచేసిన చాలా మంది శాస్త్రవేత్తలు ఆయనను కృషీవలునిగా పేర్కొంటారు. తాను కన్న కలలను నిజం చేసుకున్న అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తిగా విక్రమ్ సారాభాయ్ని గుర్తిస్తారు.ఆర్థికాభివృద్దిలో అంతరిక్షశాస్త్ర భాగస్వామ్యంప్రముఖ శాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభాను భారత అణువిద్యుత్ ప్లాంట్‌లో పనిచేయడానికి ప్రేరేపించినది.. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని ఒప్పించింది విక్రమ్ సారాభాయ్నే. ఆయన కృషి, చొరవలతోనే ఇస్రో స్థాపితమయ్యింది. డాక్టర్ హోమీ జహంగీర్ భాభా తర్వాత, విక్రమ్ సారాభాయ్ ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ అయ్యారు. డాక్టర్ సారాభాయ్ కేవలం విజ్ఞాన శాస్త్రానికే కాకుండా సమాజం, ఆర్థికాభివృద్ధిలో దాని భాగస్వామ్యానికి రూపకల్పన చేశారు. అంతరిక్ష శాస్త్రం సాయంలో కమ్యూనికేషన్, వాతావరణ శాస్త్రం, సహజ వనరుల అన్వేషణ సాగించవచ్చని తెలిపారు. భారతదేశంలో శాటిలైట్ టెలివిజన్ ప్రసారాల అభివృద్ధి విక్రమ్ సారాభాయ్ ప్రోత్సహించిన రాకెట్ టెక్నాలజీ కారణంగానే సాధ్యమయ్యింది.ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎన్నటికీ మరువలేని రెండు దుర్ఘటనలు -
తుది‘దశ’లో ఆదిత్య ఎల్1
తిరువనంతపురం: సూర్యుడి సంబంధ అంశాలపై మరింత లోతైన అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్–1 వ్యోమనౌక త్వరలోనే దాని ఎల్–1 పాయింట్లోకి చేరుకోనుందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. తొలి సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(వీఎస్ఎస్సీ)లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సోమనాథ్ మాట్లాడారు. ‘ ఆదిత్య తన దిశలో దూసుకుపోతోంది. ఇది దాదాపు తన తుదిదశకు చేరుకుంది. ఎల్–1 పాయింట్లోకి దానిని చేర్చేందుకు సన్నాహక కార్యక్రమాలు చేపడుతున్నాం. వచ్చే ఏడాది జనవరి ఏడో తేదీకల్లా ఎల్–1లోకి ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధంచేశాం’’ అని చెప్పారు. -
Integrated Main Parachute Airdrop Test: ‘గగన్‌యాన్’లో ముందడుగు...
న్యూఢిల్లీ: ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మానవసహిత అంతరిక్ష కార్యక్రమం ’గగన్‌యాన్’కు ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి. మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే మన ఆస్ట్రొనాట్లను సురక్షితంగా భూమ్మీదికి తిరిగి తీసుకొచ్చేందుకు వాడబోయే పారాచూట్లను విజయవంతంగా పరీక్షించారు. ఇంటిగ్రేటెడ్ మెయిన్పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (ఐఎంఏటీ)గా పిలిచే ఈ పరీక్షను ఉత్తరప్రదేశ్‌లో ఝాన్సీ జిల్లాలోని బబీనా ఫీల్డ్ ఫైర్ రేంజ్ (బీఎఫ్ఎఫ్ఆర్) నుంచి విక్రం సారాబాయి స్పేస్ సెంటర్ పర్యవేక్షణలో శనివారం నిర్వహించారు. పరీక్షలో భాగంగా ఐదు వేల కిలోలున్న డమ్మీ పేలోడ్‌ను 2.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్–76 విమానం ద్వారా జారవిడిచారు. తర్వాత ప్రధాన పారాచూట్లను తెరిచారు. ‘‘పేలోడ్ వేగాన్ని అవి సురక్షిత వేగానికి తగ్గించాయి. మూడు నిమిషాల్లోపే దాన్ని భూమిపై సురక్షితంగా లాండ్ చేశాయి. నిజానికి ప్రధాన పారాచూట్లలో ఒకటి సకాలంలో తెరుచుకోలేదు. ఇది కూడా మంచి ఫలితమేనని చెప్పాలి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే అంతిమంగా పూర్తిగా లోపరహితమైన పారాచూట్లను గగన్‌యాన్ కోసం సిద్ధం చేయగలుగుతాం’’ అని సారాబాయ్ సెంటర్ పేర్కొంది. ‘‘గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలో మొత్తం 10 పారాచూట్లుంటాయి. ముందుగా అపెక్స్ కవర్ సపరేషన్ పారాచూట్లు రంగంలోకి దిగుతాయి. తర్వాత రాకెట్ వేగాన్ని బాగా తగ్గించడంతో పాటు దాని దిశను స్థిరీకరించే డ్రాగ్ పారాచూట్లు విచ్చుకుంటాయి. నిజానికి ఆస్ట్రొనాట్లు సురక్షితంగా దిగేందుకు రెండు ప్రధాన పారాచూట్లు చాలు. ముందు జాగ్రత్తగా మూడోదాన్ని కూడా సిద్ధంగా ఉంచనున్నాం’’ అని ఇస్రో వివరించింది. డీఆర్డీఓతో కలిసి ఈ పారాచూట్లను రూపొందించారు. -
మహారాష్ట్ర నుంచి కేరళకు ఏడాది పట్టింది!
తిరువనంతపురం: ఓ ట్రక్కు మహారాష్ట్ర నుంచి కేరళకు చేరడానికి ఏకంగా ఏడాది పట్టింది. వినడానికి వింతగా ఉన్న ఇది మాత్రం వాస్తవం. ఈ ట్రక్కు విక్రం సారాభాయి స్పేస్ సెంటర్(వీఎస్ఎస్సీ)కు అవసరమైన భారీ, అత్యాధునిక యంత్రాలను తీసుకుని ఆదివారం తిరువనంతపురం చేరుకుంది. ఈ సందర్భంగా ట్రక్కు డ్రైవర్ మాట్లాడుతూ.. ‘గత ఏడాది జూలై 8న మా ప్రయాణం ప్రారంభమయ్యింది. సంవత్సరం పాటు ప్రయాణించి.. నాలుగు రాష్ట్రాలు దాటి ఈ రోజు తిరువనంతపురం చేరాము. ఈ రోజే యంత్రాలను అక్కడికి చేరుస్తాం’ అన్నారు. ఈ ట్రక్కులో తేలికపాటి పదార్థాలను తయారు చేయడానికి వాడే ఏరోస్సేస్ హారిజాంటల్ ఆటోక్లేవ్‌ని తీసుకొచ్చారు. గత ఏడాది మహారాష్ట్రలో ప్రారంభమైన ఈ ట్రక్కు రోజుకు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేసేది. దీనితో పాటు 32 మంది వర్కర్లు ఉన్నారు. (‘అనంత’ సంపద ఎన్నడు తెలిసేను?) ఈ మెషన్ బరువు సుమారు 70 టన్నులు ఉండగా.. ఎత్తు 7.5 మీటర్లు, వెడల్పు 2.65 మీటర్లుగా ఉంది. ఈ మెషన్ని నాసిక్‌లో తయారు చేశారు. అతి త్వరలోనే ఇది భారతీయ స్పేస్ రిసర్చ్ ప్రాజెక్ట్‌ల్లో పాలు పంచుకోనుంది. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘సరుకు బరువును మోయడానికి మేము తాళ్లను ఉపయోగించాము. ఈ ట్రక్కును లాగడానికి ముందు, వెనక రెండు ఇరుసులు ఉన్నాయి. రెండింటికి ఒక్కొక్కదానికి 32 చక్రాలు, పుల్లర్‌కు 10 చక్రాలు ఉన్నాయి. పుల్లర్ వీటన్నింటిని లాగుతుంది.. డ్రాప్ డెక్ 10 టన్నుల బరువు, సరుకు 78 టన్నుల బరువు ఉంటుంది. బరువు రెండు ఇరుసులపై పంపిణీ అవుతుంది’ అని ఓ అధికారి తెలిపారు. -
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో 109 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌లు
ఇస్రో అనుబంధ సంస్థ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ) 2016-17 శిక్షణా సంవత్సరానికి గ్రాడ్యుయేట్ అప్రెంటీస్లను ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూ నిర్వహించనుంది. ఇందులో భాగంగా పది విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనుంది.ఆయా వివరాలు.. ఇంజనీరింగ్ విభాగాల వారీగా ఖాళీలు 1.ఏరోనాటికల్/ఏరోస్పేస్-6 2.కెమికల్-5 3. సివిల్-4 4.కంప్యూటర్ సైన్స్-12 5.ఎలక్ట్రికల్-4 6. ఎలక్ట్రానిక్స్-30 7.మెకానికల్-29 8. మెటలర్జీ-4 9.ప్రొడక్షన్-5 10.లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్-10 (ఈ విభాగం ఇంజనీరింగ్ కిందికి రాదు) విద్యార్హత ఇంజనీరింగ్ పోస్టులకు ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ (నాలుగేళ్ల/మూడేళ్ల కోర్సు) ఉత్తీర్ణత. ఇందులో కనీసం 65 శాతం మార్కులు/6.84 సీజీపీఏ ఉండాలి. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ పోస్టులకు డిగ్రీతోపాటు ఫస్ట్ క్లాస్ బీఎల్ఐఎస్సీ ఉత్తీర్ణత. బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కోర్సులో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. గమనిక: పైన పేర్కొన్న కోర్సుల్లో 2014 ఏప్రిల్ తర్వాత ఉత్తీర్ణులైనవారే దరఖాస్తు చేసేందుకు అర్హులు. (అప్రెంటీస్‌షిప్ చట్టం ప్రకారం.. 2014లో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు 2017 జూలై వరకు మాత్రమే అప్రెంటీస్‌షిప్ శిక్షణ తీసుకునేందుకు అర్హులు). ప్రభుత్వ/పబ్లిక్/ప్రైవేట్ రంగాల్లో సంబంధిత విభాగంలో ఏడాది కంటే ఎక్కువ పని అనుభవం గల వారు శిక్షణకు అనర్హులు. గరిష్ట వయోపరిమితి 2016, నవంబర్ 5 నాటికి జనరల్ అభ్యర్థులకు 30 ఏళ్లు; ఓబీసీలకు 33 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 35 ఏళ్లు; పీడబ్ల్యూడీలకు 40 ఏళ్లు. శిక్షణ కాలం: ఏడాది స్టైపెండ్: నెలకు రూ.5000. ఎంపిక విధానం బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ (బీవోఏటీ-బోట్)-చెన్నై నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. బీఈ/బీటెక్/బీఎల్ఐఎస్సీలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఇంటర్వ్యూ తేదీలు 1.అక్టోబర్ 22 (శనివారం) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మెకానికల్, సివిల్, కెమికల్, ఏరోనాటికల్/ఏరోస్పేస్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ విభాగాల వారికి ఇంటర్వ్యూ జరుగుతుంది. 2.నవంబర్ 5 (శనివారం) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్, మెటలర్జీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగాల వారికి ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ వేదిక యూనస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పల్లిముక్కు, వడక్కేవిల పోస్టాఫీసు, కొల్లం జిల్లా, కేరళ. దరఖాస్తు విధానం ఇంటర్య్యూకి హాజరు కావాలనుకునే అభ్యర్థులు తమ పేర్లను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తుకు సెల్ఫ్ అటెస్ట్ చేసిన విద్యార్హతల, అనుభవ ధ్రువీకరణ పత్రాల నకళ్లను జత చేసి, ఇంటర్వ్యూ కేంద్రంలో సమర్పించాలి. వెబ్సైట్: www.sdcentre.org -
నేడు ఆర్ఎల్వీ-టీడీ ప్రయోగం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి సోమవారం ఉదయం 7 గంటలకు రీ యూజబుల్ లాంచింగ్ వెహికల్-టెక్నికల్ డిమాన్స్ట్రేటర్(ఆర్ఎల్వీ-టీడీ) ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించి 6 గంటల ముందు సోమవారం వేకువజామున ఒంటి గంటకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. సుమారు 12 టన్నుల బరువు కలిగిన ఆర్ఎల్వీ-టీడీని భూమికి 70 కిలోమీటర్లు ఎత్తుకు పంపించి రాకెట్‌కు అమర్చిన స్క్రామ్‌జెట్ విమానాన్ని తిరిగి అండమాన్ నికోబార్ దీవులకు 200 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలోకి దించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహిస్తే భవిష్యత్తులో వ్యోమగాములను రోదసీలోకి పంపించి తిరిగి క్షేమంగా తీసుకురావడానికి దోహదపడుతుంది. కాగా, ఈ ప్రయోగానికి సంబంధించి మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మరోవైపు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డెరైక్టర్, ఆర్ఎల్వీ-టీడీ రూపకర్త డాక్టర్ శివన్ ఆదివారం చెంగాళమ్మను దర్శించుకున్నారు. -
ఉపగ్రహాలకు ఎలక్ట్రిక్ చోదక వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: భారత్ ప్రయోగించే ఉపగ్రహాలను మరింత సమర్థంగా ఉపయోగించుకునేందుకు వీలుగా వాటికి ఎలక్ట్రిక్ చోదక వ్యవస్థను జోడించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎఎస్‌సీ) డెరైక్టర్ డాక్టర్ కె.శివన్ తెలిపారు. దీనివల్ల ఇంధన ట్యాంకుల సైజు తగ్గడం ద్వారా మరింత ఎక్కువ బరువున్న పరికరాలను మోసుకెళ్లడం వీలువుతుందని ఆయన చెప్పారు. జీఎస్ఎల్వీ మార్క్-3ని ఈ ఏడాది డిసెంబరులో ప్రయోగిస్తామని, క్రయోజెనిక్ ఇంజిన్ తాలూకూ పరీక్షలను దశలవారీగా పూర్తి చేస్తున్నట్లు వివరించారు. చంద్రుడిపై ఒక రోవర్ ల్యాండై అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించే లక్ష్యంతో చంద్రయాన్-2 సిద్దమవుతోందని చెప్పారు. మానవసహిత అంతరిక్ష ప్రయోగాల సన్నాహకాల్లో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో వ్యోమగాములను రక్షించేందుకు ఉద్దేశించిన అబార్ట్ మిషన్‌ను ఈ ఏడాది చివరిలో చేపడతామని వివరించారు.