బులెటిన్ బోర్డ్ | Bulletin Board | Sakshi
Sakshi News home page

బులెటిన్ బోర్డ్

Published Thu, Aug 18 2016 4:16 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

బులెటిన్ బోర్డ్

బులెటిన్ బోర్డ్


 బెల్ - మచిలీపట్నం యూనిట్‌లో 35 పోస్టులు
 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్).. మచిలీపట్నం యూనిట్‌లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
 మొత్తం ఖాళీలు: 35. అవి పోస్టుల వారీగా..
 1. ట్రైనీ ఇంజనీరింగ్ అసిస్టెంట్-6 (ఎలక్ట్రానిక్స్-2, మెకానికల్-4)
 2. టెక్నీషియన్-22 (ఎలక్ట్రానిక్స్-4, మెషినిస్ట్/టర్నర్-3, ఫిట్టర్-15)
 3. క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ‘సీ’-5
 4. జూనియర్ సెక్యూరిటీ సూపర్‌వైజర్-2.
 వేతనం: ఇంజనీరింగ్ అసిస్టెంట్‌కు రూ.10,050-25,450+అలవెన్సులు. టెక్నీషియన్, క్లర్క్ పోస్టులకు రూ.8740-22,150+అలవెన్సులు. సూపర్‌వైజర్‌కు రూ.10,050- రూ.25,450+అలవెన్సులు.
 విద్యార్హత: ఇంజనీరింగ్ అసిస్టెంట్, క్లర్క్ పోస్టులకు డిప్లొమా; టెక్నీషియన్‌కు పదో తరగతితోపాటు ఐటీఐ, అప్రెంటీస్; సూపర్‌వైజర్‌కు పదో తరగతితోపాటు సాయుధ బలగాల్లో 15 ఏళ్ల అనుభవం, రిటైరయ్యే నాటికి జేసీఓ/తత్సమాన హోదా ఉండాలి.
 ఎంపిక విధానం: మొదటి మూడు రకాల పోస్టులకు రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా; సెక్యూరిటీ పోస్టుకు ఫిజికల్ ఎడ్యూరన్స్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
 దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో దరఖాస్తును పూర్తిచేసి, ధ్రువీకరణ పత్రాల నకళ్లు, అప్లికేషన్ ఫీజు చలానా జత చేసి కింది చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలి.
 దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.300 చలానా తీయాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు ఇచ్చారు.
 చివరి తేదీ: 2016 సెప్టెంబర్ 8.
 చిరునామా: డిప్యూటీ మేనేజర్ (హెచ్‌ఆర్), బెల్, పోస్ట్ బాక్స్ నంబర్-26, రవీంద్రనాథ్ ఠాగూర్ రోడ్, మచిలీపట్నం, 521001, ఆంధ్రప్రదేశ్.
 వెబ్‌సైట్: www.bel-india.com
 పశ్చిమ గోదావరి జిల్లాలో 6 ‘మల్టీపర్పస్’ పోస్టులు
 ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో 6 మల్టీపర్పస్ ఎక్స్‌టెన్షన్ అసిస్టెంట్స్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రకటన వెలువడింది. అభ్యర్థులు డ్రైవింగ్ లెసైన్స్‌తోపాటు సొంత వాహనాన్ని కలిగి ఉండాలి.
 వేతనం: రూ.8,000, విద్యార్హత: 2016 జూలై 1 నాటికి కింది విద్యార్హతలను కలిగి ఉండాలి.
 కేటగిరి-1: బీఎఫ్‌ఎస్సీ, కేటగిరి-2: ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా
 కేటగిరి-3: బీఎస్సీ (ఫిషరీస్)/బీఎస్సీ (ఆక్వాకల్చర్)/బీఎస్సీ (జువాలజీ)
 వయసు: 2016 జూలై 1 నాటికి కనీసం 18 ఏళ్లు, గరిష్టం 40 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు ఉంది.
 ఎంపిక: విద్యార్హతల మార్కులకు 80 శాతం; ఇంటర్వ్యూకి 20 శాతం వెయిటేజీ ఇస్తారు.
 దరఖాస్తు: నిర్దేశిత నమూనాలో పూర్తి చేసిన దరఖాస్తులను ‘ఉప సంచాలకులు, మత్స్య శాఖ, శ్రీనివాస నగర్, పోస్టల్ కాలనీ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా’ చిరునామాకు స్వయంగా/పోస్ట్ ద్వారా పంపొచ్చు.
 చివరి తేదీ: ఆగస్టు 26, వెబ్‌సైట్: westgodavari.org   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement