జనరల్‌సైన్స్‌లో మెరవాలంటే.. | Candidates for General Studies paper | Sakshi
Sakshi News home page

జనరల్‌సైన్స్‌లో మెరవాలంటే..

Published Thu, Jul 16 2015 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM

Candidates for General Studies paper

 జనరల్ సైన్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని గమనించి అభ్యర్థులు ప్రిపరేషన్‌ను సాగించాలి. గత మూడు, నాలుగేళ్లుగా పర్యావరణం అంశంపై ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఏడాది కనీసం 15 - 20 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సీశాట్‌ను కేవలం అర్హత పేపరుగా చేయడంతో అభ్యర్థులు జనరల్ స్టడీస్ పేపరులో అధిక మార్కులు సాధించాల్సిన అవసరం ఉంది. నెగటివ్ మార్కింగ్ ఉన్న నేపథ్యంలో సమాధానం తెలియని ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం ద్వారా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కేవలం వాస్తవాంశాలపై అవగాహనతో ప్రశ్నలకు సమాధానం గుర్తించడం సరికాదు.
 
 ఆవరణ శాస్త్రం
 ఆవరణ శాస్త్రంలో అభ్యర్థులు ప్రాథమిక భావనలపై దృష్టిసారించాలి. ముఖ్యంగా జాతి , జాతి ఉత్పత్తి (speciation), ఆవరణ వ్యవస్థ (ecosystems), వాటి రకాలు, ఆహార శృంఖలాలు, బయో జియో కెమికల్ సైకిల్స్, ఆహార వల (food chain) ఎకోటోన్, జీవుల అనుకూలనలపై అవగాహనను పెంచుకోవాలి. ఇది వరకు ఆవరణ వ్యవస్థ సర్వీసెస్, ఎకలాజికల్ నిషే లాంటి ప్రశ్నలు వచ్చాయి. జీవశాస్త్రంలోని జంతువృక్ష విజ్ఞానాన్ని ఆవరణ శాస్త్రానికి అన్వయించుకొని చదవడం ద్వారా జీవుల అనుకూలనాలపై పట్టు లభిస్తుంది.
 
 జీవవైవిధ్యం
 జీవవైవిధ్యం (Bio diversity).. మరో ముఖ్యమైన అంశం. జీవ వైవిధ్య రకాలు, జీవ వైవిధ్యానికి ఏర్పడుతున్న ప్రమాదాలు, జీవవైవిధ్య పరిరక్షణ పద్ధతులపై సమాచారం అవసరం. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విభిన్న జీవ జాతులు ఎదుర్కొంటున్న ప్రమాదాలపై అవగాహన పెరగాలి. ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్) ప్రకటించిన అంతరించే ప్రమాదమున్న జీవజాతుల జాబితాను (ఖ్ఛఛీ జీట్ట) క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఉదా: బట్ట మేక పక్షి (ఎట్ఛ్చ్ట ఐఛీజ్చీ ఆఠట్ట్చటఛీ). అతి త్వరలో అంతరించే జాతిగా దీన్ని గుర్తించారు. దీని శాస్త్రీయ నామం, ఆవాసాలు, భారత్‌లో జనాభా, వచ్చే ప్రమాదాలు, కార్యక్రమాలు, దీనికి సంబంధించిన ఇతర జాతులపై సమాచారం సేకరించాలి. ఈ విధమైన సమాచారం ద్వారా ఈ పక్షిపై వచ్చే ప్రశ్నలకు సమాధానాన్ని సులభంగా గుర్తించవచ్చు.
 
 బట్టమేక పక్షి - Great Indian Bustard
 శాస్త్రీయ నామం - ఆర్డయోటిస్ నైగ్రిసెప్స్
 (Ardiotes nigriceps)
 దేశంలో రాజస్థాన్‌లో అధికంగా కనిపిస్తాయి. ప్రధాన ప్రమాదాలు - రోడ్ల నిర్మాణం, సౌర, జల విద్యుత్ ప్రాజెక్టులు, అడవుల నరికివేత
 దీని సంబంధిత జాతులు: Lesser florican; Beng-al florican; Houbara bustard (ఇది వలస జాతి)
 
 ఈ విధంగా ఆసియా సింహం, బెంగాల్ పులి, ఒంటి కొమ్ము ఖడ్గమృగం, ఎర్ర చందనం, నక్షత్ర తాబేలు, మానిస్/పంగోలియన్ అనే పిపీలికాహారి, కస్తూరి జింక, ఉడుము మొదలైన ముఖ్య జంతువులపై సమగ్ర సమాచార సేకరణ అవసరం. జీవ వైవిధ్యానికి ముప్పుగా పరిణమిస్తున్న దండెత్తే జాతులపై అవగాహన పెంచుకోవాలి. పార్థీనియం లాంటన కామెరా అనే కలుపు మొక్కలు, అంతర్జాతీయ స్థాయిలో అమెరికన్ కేన్ టోడ్, బంబుల్ బీ వంటి వాటిపై అవగాహన అవసరం.
 
 శీతోష్ణస్థితి మార్పు
 శీతోష్ణస్థితి మార్పు ముఖ్యమైన అంశం. డిసెంబరులో పారిస్‌లో జరగబోయే కాప్-21 సమావేశం ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికీ ఉపయోగపడే అంశం. గతేడాది కూడా దీనిపై ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ వంటి అంశాలపై ప్రశ్నలడిగారు. శీతోష్ణస్థితి మార్పు ప్రమాదాలను ఎదుర్కొనే లక్ష్యంతో భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, శీతోష్ణస్థితి మార్పుపై నేషన్ ఆక్షన్ ప్లాన్(ఎన్‌ఏపీసీసీ), అందులోని 8 జాతీయ మిషన్లు, వాటిలో సాధించిన ప్రగతి, గతేడాది డిసెంబర్‌లో పెరులోని లీమా నగరంలో జరిగిన కాప్-20 సమావేశ ఫలితాలు, నిర్ణయాలు.. ముఖ్యమైన అంశాలు. గతేడాది ఐపీసీసీ (ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమాటిక్ చేంజ్) విడుదల చేసిన అంచనాల నివేదిక ఏఆర్-5 నివేదికలో ఉన్న అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా వివిధ దేశాల ఉద్గారాల నమోదు, తలసరి ఉద్గారాలపై ప్రశ్నలడుగుతారు.
 
 పర్యావరణ కాలుష్యం
 పర్యావరణ కాలుష్యం మరో ముఖ్యాంశం. ఇటీవల అమల్లోకి వచ్చిన ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్(ఏపీఐ), ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ, అంతర్జాతీయ, జాతీయ సూచీలు, ఈ-వేస్ట్, బయోమెడికల్ వేస్ట్ గురించి తెలుసుకోవాలి. వివిధ వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతుల గురించి తెలుసుకోవాలి. వీటితోపాటు పర్యావరణ సంబంధిత జాతీయ స్థాయి చట్టాలు, వాటి అమలు, బోర్డులు - విధులు, కేంద్రాలు - మంత్రిత్వ శాఖల పరిధి మొదలైన అంశాలపై సమాచారం సేకరించాలి. టీఎస్‌ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక, దాని సూచనలపై ప్రత్యేక దృష్టి సారించాలి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం, గాలి(ప్రివెన్షన్ అండ్ కంట్రోల్) చట్టం, నీటి కాలుష్యం, నీటి కాలుష్య సెస్ చట్టాలు, జీవవైవిధ్య చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం, జాతీయ క్రూర మృగాల రక్షణ చట్టం, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఏనుగు, ప్రాజెక్ట్ క్రోకోడైల్, జాతీయ పార్కులు, వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాలు, కమ్యూనిటీ రిజర్వ్‌లు, కన్జర్వేషన్ రిజర్వ్‌లు, బయోస్పియర్ రిజర్వ్‌లు, రాంసార్ వెట్‌ల్యాండ్ సైట్స్ వంటి జాతీయ అంశాలపై సమాచారం ముఖ్యం. వీటితోపాటు అంతర్జాతీయ స్థాయి ఒప్పందాల గురించి తెలుసుకోవాలి. వీటిలో మోన్‌ట్రియల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, బాన్ కన్జర్వేషన్, సీఐటీఈఎస్, స్టాక్‌హోం కన్వెన్షన్, రాంసార్ కన్వెన్షన్, బేసల్ కన్వెన్షన్, నాగోయా ప్రోటోకాల్, కార్టగేనా ప్రోటోకాల్‌తోపాటు యునెస్కో, డబ్ల్యూఎంఓ, యూఎన్‌ఈపీ, ఐయూసీఎన్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్-ఎన్ వంటి అంతర్జాతీయ సంస్థలపై కూడా సమాచారం తెలుసుకోవాలి.
 
 జీవశాస్త్రం
 జీవశాస్త్రంలో మొక్కల, జంతువుల వర్గీకరణతోపాటు వాటి లక్షణాలు, ప్రత్యేకతల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల చిహ్నాల గురించి తెలుసుకోవడం ద్వారా కొన్ని ముఖ్యమైన జంతువులు, మొక్కలపై సమాచార సేకరణ సులభతరమవుతుంది. మానవ శరీర ధర్మశాస్త్రంలో పోషణకు ప్రాధాన్యమివ్వాలి. వివిధ ఆహార పదార్థాల ప్రాధాన్యత - ఉపయోగాలు, వాటిలోని రసాయనాల గురించి తెలుసుకోవాలి. వీటితోపాటు శరీర అవయవ వ్యవస్థలపై సమాచారం సేకరించడం అవసరం. రసాయన భౌతిక శాస్త్రంలో వచ్చిన ప్రశ్నలు గతేడాది చాలా తక్కువ. అయితే వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయకుండా నవీన పునర్వినియోగ శక్తి, వనరులు, కార్బన్ అణువులు, పాలీమర్లపై దృష్టిసారించాలి.
 
 సైన్స్ అండ్ టెక్నాలజీ
 సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రశ్నలు సమకాలీన దృక్పథంతో జాతీయ, అంతర్జాతీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని వస్తున్నాయి. ముఖ్యంగా భారత అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసి ప్రయోగించిన ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు, రక్షణ రంగంలో క్షిపణులు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, బయోటెక్నాలజీలో జన్యుమార్పిడి జీవులు, మూలకణాలు, డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్, సర్రోగసీపై ప్రశ్నలు వచ్చే అవకాశముంది. భారత ఇస్రో ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌పై దృష్టిసారించాలి. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయి ఉపగ్రహ ప్రయోగాలు కీలకమైనవి.
 
 ప్రాథమికాంశాలపై దృష్టి
 గతేడాది మాదిరే ఈసారి కూడా ప్రాథమిక భావనలు, సమాచార ఆధారిత ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానాలు చదివి, వాటిలో సరైన వాటిని గుర్తించగలగాలి. ఆవరణ శాస్త్రంలో ప్రశ్నలు సబ్జెక్టును క్షుణ్నంగా చదివిన వారే సమాధానాన్ని గుర్తించగలిగే విధంగా ఉన్నాయి. ఈ విషయాన్ని విద్యార్థులు గ్రహించా లి. ఇప్పటివరకు చదువుకున్న అంశాలను పునశ్చరణ చేసుకుంటూ ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలి.
 
 Examples
 1.    Consider the following statements
     I.    The tiger census is presently being carried out for every 5 years
     II.    The number of lions in India according to 2015 census is 523.
     Which of the above statement is/are true?
     1) I only        2) II only
     3) Both        4) Neither I nor II
 2.    Identify the right match
     Reactor    Planned location
     I.    Chutka - Madhya Pradesh
     II.    Mahi banswara - Rajasthan
     III.    Chhaya mithi virdi - Gujarat
     Which of the above these is correctly matched?
     1) I, II, III        2) II, III only
     3) I, III only    4) only II
 3.    The database of TB patients developed in India is
     1) Nikshay    2) Nirnay
     3) Ayush        4) Armaan
 4.    Which of the following is a Ramsar wetland site?
     1) Vembanad kol lake
     2) Kolleru lake    3) Sasthamkotta lake
     4) All of the above
 5.    During Photosynthesis
     1) Carbondioxide is oxidised, water is reduced
     2) Carbondioxide is reduced, water is oxidised
     3) Both are oxidised    4) Both are reduced
 6.    Identify the right evolutionary sequence of origin of the three plants
     1) Chlorella - Cycas - Sphagnum
     2) Cycas - Chlorella - Sphagnum
     3) Chlorella - Sphagnum - Cycas
     4) Cycas - Sphagnum - Chlorella
 7.    Consider the following statements
     I.    2014 Nobel medicine is presented to Jhon.O.Keefe, May-Britt Moser and Edvard.I.Moser
     II.    They discovered GPS in brain
     Which of the above statement is/are true.
     1) I only        2) II only
     3) Both        4) Neither I nor II
 8.    Which of the following species are naturally not found in India.
     I.    Two horned Rhinoceros
     II.    Manis        III. Orangutan
     IV.    Salt Water Crocodile
     1) I, II & III    2) I & III
     3) II, III & IV    4) II & III
 9.    Consider the following statements
     I.    Indian Regional Navigational Satellite System(IRNSS) is a constellation of seven satellites
     II.    IRNSS has 4 satellites in Geosynchro-nous and will have 3 satellites in geostationary orbits
     Which of the above statements is/are correct?
     1) I only        2) II only
     3) Both        4) Neither I nor II
 10.    Which of the following plants is a source of both oil seed and fibre
     I. Linseed       II. Cotton       III. Coconut
     1) I, II, III      2) I, II    3) II, III    4) I, III
 11.    The Philae lander which landed on the comet 67p/ churyumov gerasimenko was mission of
     1) NASA    2) European Space Agency
     3) Glavkosmos    4) Virgin Galactic
 12.    The transitional zone between two different ecosystems is
     1) Ecotone        2) Ecad
     3) Ecological Niche    4) None of these
 13.    Identify the right sequence of Ecological succession
     1) Crustose lichen - Foliose Lichen - Herb - Fruticose lichen - Shrub - Tree
     2) Foliose lichen - Fruticose lichen - Foliose lichen - herb - shrub - Tree
     3) Crustose lichen - Foliose lichen - Fruticose lichen - Herb - Shrub - Tree
     4) Fruticose lichen - Foliose Lichen - Crustose lichen - Herb - Shrub - Tree
 
 Answers
 1) 2; 2) 1; 3) 1; 4) 4; 5) 2; 6) 3; 7) 3; 8) 2; 9) 3; 10) 1; 11) 2; 12) 1; 13) 3
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement