general science
-
జనరల్సైన్స్లో మెరవాలంటే..
జనరల్ సైన్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని గమనించి అభ్యర్థులు ప్రిపరేషన్‌ను సాగించాలి. గత మూడు, నాలుగేళ్లుగా పర్యావరణం అంశంపై ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఏడాది కనీసం 15 - 20 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సీశాట్‌ను కేవలం అర్హత పేపరుగా చేయడంతో అభ్యర్థులు జనరల్ స్టడీస్ పేపరులో అధిక మార్కులు సాధించాల్సిన అవసరం ఉంది. నెగటివ్ మార్కింగ్ ఉన్న నేపథ్యంలో సమాధానం తెలియని ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం ద్వారా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కేవలం వాస్తవాంశాలపై అవగాహనతో ప్రశ్నలకు సమాధానం గుర్తించడం సరికాదు. ఆవరణ శాస్త్రం ఆవరణ శాస్త్రంలో అభ్యర్థులు ప్రాథమిక భావనలపై దృష్టిసారించాలి. ముఖ్యంగా జాతి , జాతి ఉత్పత్తి (speciation), ఆవరణ వ్యవస్థ (ecosystems), వాటి రకాలు, ఆహార శృంఖలాలు, బయో జియో కెమికల్ సైకిల్స్, ఆహార వల (food chain) ఎకోటోన్, జీవుల అనుకూలనలపై అవగాహనను పెంచుకోవాలి. ఇది వరకు ఆవరణ వ్యవస్థ సర్వీసెస్, ఎకలాజికల్ నిషే లాంటి ప్రశ్నలు వచ్చాయి. జీవశాస్త్రంలోని జంతువృక్ష విజ్ఞానాన్ని ఆవరణ శాస్త్రానికి అన్వయించుకొని చదవడం ద్వారా జీవుల అనుకూలనాలపై పట్టు లభిస్తుంది. జీవవైవిధ్యం జీవవైవిధ్యం (Bio diversity).. మరో ముఖ్యమైన అంశం. జీవ వైవిధ్య రకాలు, జీవ వైవిధ్యానికి ఏర్పడుతున్న ప్రమాదాలు, జీవవైవిధ్య పరిరక్షణ పద్ధతులపై సమాచారం అవసరం. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విభిన్న జీవ జాతులు ఎదుర్కొంటున్న ప్రమాదాలపై అవగాహన పెరగాలి. ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్) ప్రకటించిన అంతరించే ప్రమాదమున్న జీవజాతుల జాబితాను (ఖ్ఛఛీ జీట్ట) క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఉదా: బట్ట మేక పక్షి (ఎట్ఛ్చ్ట ఐఛీజ్చీ ఆఠట్ట్చటఛీ). అతి త్వరలో అంతరించే జాతిగా దీన్ని గుర్తించారు. దీని శాస్త్రీయ నామం, ఆవాసాలు, భారత్‌లో జనాభా, వచ్చే ప్రమాదాలు, కార్యక్రమాలు, దీనికి సంబంధించిన ఇతర జాతులపై సమాచారం సేకరించాలి. ఈ విధమైన సమాచారం ద్వారా ఈ పక్షిపై వచ్చే ప్రశ్నలకు సమాధానాన్ని సులభంగా గుర్తించవచ్చు. బట్టమేక పక్షి - Great Indian Bustard శాస్త్రీయ నామం - ఆర్డయోటిస్ నైగ్రిసెప్స్ (Ardiotes nigriceps) దేశంలో రాజస్థాన్‌లో అధికంగా కనిపిస్తాయి. ప్రధాన ప్రమాదాలు - రోడ్ల నిర్మాణం, సౌర, జల విద్యుత్ ప్రాజెక్టులు, అడవుల నరికివేత దీని సంబంధిత జాతులు: Lesser florican; Beng-al florican; Houbara bustard (ఇది వలస జాతి) ఈ విధంగా ఆసియా సింహం, బెంగాల్ పులి, ఒంటి కొమ్ము ఖడ్గమృగం, ఎర్ర చందనం, నక్షత్ర తాబేలు, మానిస్/పంగోలియన్ అనే పిపీలికాహారి, కస్తూరి జింక, ఉడుము మొదలైన ముఖ్య జంతువులపై సమగ్ర సమాచార సేకరణ అవసరం. జీవ వైవిధ్యానికి ముప్పుగా పరిణమిస్తున్న దండెత్తే జాతులపై అవగాహన పెంచుకోవాలి. పార్థీనియం లాంటన కామెరా అనే కలుపు మొక్కలు, అంతర్జాతీయ స్థాయిలో అమెరికన్ కేన్ టోడ్, బంబుల్ బీ వంటి వాటిపై అవగాహన అవసరం. శీతోష్ణస్థితి మార్పు శీతోష్ణస్థితి మార్పు ముఖ్యమైన అంశం. డిసెంబరులో పారిస్‌లో జరగబోయే కాప్-21 సమావేశం ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికీ ఉపయోగపడే అంశం. గతేడాది కూడా దీనిపై ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ వంటి అంశాలపై ప్రశ్నలడిగారు. శీతోష్ణస్థితి మార్పు ప్రమాదాలను ఎదుర్కొనే లక్ష్యంతో భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, శీతోష్ణస్థితి మార్పుపై నేషన్ ఆక్షన్ ప్లాన్(ఎన్ఏపీసీసీ), అందులోని 8 జాతీయ మిషన్లు, వాటిలో సాధించిన ప్రగతి, గతేడాది డిసెంబర్లో పెరులోని లీమా నగరంలో జరిగిన కాప్-20 సమావేశ ఫలితాలు, నిర్ణయాలు.. ముఖ్యమైన అంశాలు. గతేడాది ఐపీసీసీ (ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమాటిక్ చేంజ్) విడుదల చేసిన అంచనాల నివేదిక ఏఆర్-5 నివేదికలో ఉన్న అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా వివిధ దేశాల ఉద్గారాల నమోదు, తలసరి ఉద్గారాలపై ప్రశ్నలడుగుతారు. పర్యావరణ కాలుష్యం పర్యావరణ కాలుష్యం మరో ముఖ్యాంశం. ఇటీవల అమల్లోకి వచ్చిన ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్(ఏపీఐ), ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ, అంతర్జాతీయ, జాతీయ సూచీలు, ఈ-వేస్ట్, బయోమెడికల్ వేస్ట్ గురించి తెలుసుకోవాలి. వివిధ వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతుల గురించి తెలుసుకోవాలి. వీటితోపాటు పర్యావరణ సంబంధిత జాతీయ స్థాయి చట్టాలు, వాటి అమలు, బోర్డులు - విధులు, కేంద్రాలు - మంత్రిత్వ శాఖల పరిధి మొదలైన అంశాలపై సమాచారం సేకరించాలి. టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక, దాని సూచనలపై ప్రత్యేక దృష్టి సారించాలి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం, గాలి(ప్రివెన్షన్ అండ్ కంట్రోల్) చట్టం, నీటి కాలుష్యం, నీటి కాలుష్య సెస్ చట్టాలు, జీవవైవిధ్య చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం, జాతీయ క్రూర మృగాల రక్షణ చట్టం, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఏనుగు, ప్రాజెక్ట్ క్రోకోడైల్, జాతీయ పార్కులు, వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాలు, కమ్యూనిటీ రిజర్వ్‌లు, కన్జర్వేషన్ రిజర్వ్‌లు, బయోస్పియర్ రిజర్వ్‌లు, రాంసార్ వెట్‌ల్యాండ్ సైట్స్ వంటి జాతీయ అంశాలపై సమాచారం ముఖ్యం. వీటితోపాటు అంతర్జాతీయ స్థాయి ఒప్పందాల గురించి తెలుసుకోవాలి. వీటిలో మోన్‌ట్రియల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, బాన్ కన్జర్వేషన్, సీఐటీఈఎస్, స్టాక్‌హోం కన్వెన్షన్, రాంసార్ కన్వెన్షన్, బేసల్ కన్వెన్షన్, నాగోయా ప్రోటోకాల్, కార్టగేనా ప్రోటోకాల్‌తోపాటు యునెస్కో, డబ్ల్యూఎంఓ, యూఎన్ఈపీ, ఐయూసీఎన్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్-ఎన్ వంటి అంతర్జాతీయ సంస్థలపై కూడా సమాచారం తెలుసుకోవాలి. జీవశాస్త్రం జీవశాస్త్రంలో మొక్కల, జంతువుల వర్గీకరణతోపాటు వాటి లక్షణాలు, ప్రత్యేకతల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల చిహ్నాల గురించి తెలుసుకోవడం ద్వారా కొన్ని ముఖ్యమైన జంతువులు, మొక్కలపై సమాచార సేకరణ సులభతరమవుతుంది. మానవ శరీర ధర్మశాస్త్రంలో పోషణకు ప్రాధాన్యమివ్వాలి. వివిధ ఆహార పదార్థాల ప్రాధాన్యత - ఉపయోగాలు, వాటిలోని రసాయనాల గురించి తెలుసుకోవాలి. వీటితోపాటు శరీర అవయవ వ్యవస్థలపై సమాచారం సేకరించడం అవసరం. రసాయన భౌతిక శాస్త్రంలో వచ్చిన ప్రశ్నలు గతేడాది చాలా తక్కువ. అయితే వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయకుండా నవీన పునర్వినియోగ శక్తి, వనరులు, కార్బన్ అణువులు, పాలీమర్లపై దృష్టిసారించాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రశ్నలు సమకాలీన దృక్పథంతో జాతీయ, అంతర్జాతీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని వస్తున్నాయి. ముఖ్యంగా భారత అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసి ప్రయోగించిన ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు, రక్షణ రంగంలో క్షిపణులు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, బయోటెక్నాలజీలో జన్యుమార్పిడి జీవులు, మూలకణాలు, డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్, సర్రోగసీపై ప్రశ్నలు వచ్చే అవకాశముంది. భారత ఇస్రో ప్రయోగించిన ఐఆర్ఎన్ఎస్ఎస్పై దృష్టిసారించాలి. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయి ఉపగ్రహ ప్రయోగాలు కీలకమైనవి. ప్రాథమికాంశాలపై దృష్టి గతేడాది మాదిరే ఈసారి కూడా ప్రాథమిక భావనలు, సమాచార ఆధారిత ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానాలు చదివి, వాటిలో సరైన వాటిని గుర్తించగలగాలి. ఆవరణ శాస్త్రంలో ప్రశ్నలు సబ్జెక్టును క్షుణ్నంగా చదివిన వారే సమాధానాన్ని గుర్తించగలిగే విధంగా ఉన్నాయి. ఈ విషయాన్ని విద్యార్థులు గ్రహించా లి. ఇప్పటివరకు చదువుకున్న అంశాలను పునశ్చరణ చేసుకుంటూ ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలి. Examples 1. Consider the following statements I. The tiger census is presently being carried out for every 5 years II. The number of lions in India according to 2015 census is 523. Which of the above statement is/are true? 1) I only 2) II only 3) Both 4) Neither I nor II 2. Identify the right match Reactor Planned location I. Chutka - Madhya Pradesh II. Mahi banswara - Rajasthan III. Chhaya mithi virdi - Gujarat Which of the above these is correctly matched? 1) I, II, III 2) II, III only 3) I, III only 4) only II 3. The database of TB patients developed in India is 1) Nikshay 2) Nirnay 3) Ayush 4) Armaan 4. Which of the following is a Ramsar wetland site? 1) Vembanad kol lake 2) Kolleru lake 3) Sasthamkotta lake 4) All of the above 5. During Photosynthesis 1) Carbondioxide is oxidised, water is reduced 2) Carbondioxide is reduced, water is oxidised 3) Both are oxidised 4) Both are reduced 6. Identify the right evolutionary sequence of origin of the three plants 1) Chlorella - Cycas - Sphagnum 2) Cycas - Chlorella - Sphagnum 3) Chlorella - Sphagnum - Cycas 4) Cycas - Sphagnum - Chlorella 7. Consider the following statements I. 2014 Nobel medicine is presented to Jhon.O.Keefe, May-Britt Moser and Edvard.I.Moser II. They discovered GPS in brain Which of the above statement is/are true. 1) I only 2) II only 3) Both 4) Neither I nor II 8. Which of the following species are naturally not found in India. I. Two horned Rhinoceros II. Manis III. Orangutan IV. Salt Water Crocodile 1) I, II & III 2) I & III 3) II, III & IV 4) II & III 9. Consider the following statements I. Indian Regional Navigational Satellite System(IRNSS) is a constellation of seven satellites II. IRNSS has 4 satellites in Geosynchro-nous and will have 3 satellites in geostationary orbits Which of the above statements is/are correct? 1) I only 2) II only 3) Both 4) Neither I nor II 10. Which of the following plants is a source of both oil seed and fibre I. Linseed II. Cotton III. Coconut 1) I, II, III 2) I, II 3) II, III 4) I, III 11. The Philae lander which landed on the comet 67p/ churyumov gerasimenko was mission of 1) NASA 2) European Space Agency 3) Glavkosmos 4) Virgin Galactic 12. The transitional zone between two different ecosystems is 1) Ecotone 2) Ecad 3) Ecological Niche 4) None of these 13. Identify the right sequence of Ecological succession 1) Crustose lichen - Foliose Lichen - Herb - Fruticose lichen - Shrub - Tree 2) Foliose lichen - Fruticose lichen - Foliose lichen - herb - shrub - Tree 3) Crustose lichen - Foliose lichen - Fruticose lichen - Herb - Shrub - Tree 4) Fruticose lichen - Foliose Lichen - Crustose lichen - Herb - Shrub - Tree Answers 1) 2; 2) 1; 3) 1; 4) 4; 5) 2; 6) 3; 7) 3; 8) 2; 9) 3; 10) 1; 11) 2; 12) 1; 13) 3 -
నిరంతర పునశ్చరణ.. అన్వయ సామర్థ్యమే కీలకం
గ్రూప్-1, 2 జనరల్ స్టడీస్‌లో కీలకమైన విభాగం జనరల్ సైన్స్. ఇందులో రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం నుంచి ప్రశ్నలు ఉంటాయి. మన శరీరంతో మొదలుకుని, చుట్టూ ఉన్న ప్రతీ వస్తువు రసాయన అనువర్తనాలతో తయారైనప్పటికీ వాటిని అవగాహన చేసుకోవడం అంత సులభం కాదు. దీనికి ప్రధాన కారణం రసాయన నామాలు, రసాయన ఫార్ములాలు. అయితే ఒక క్రమ పద్ధతిలో తార్కికత జోడించి ప్రిపరేషన్ సాగిస్తే రసాయన శాస్త్రంలో కూడా మెరుగైన మార్కులు సాధించవచ్చు. - డాక్టర్ బి. రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. గ్రూప్-1, 2 జనరల్ స్టడీస్‌లో రసాయన శాస్త్రం నుంచి సగటున 10-15 ప్రశ్నలు వస్తున్నాయి. అయితే గత కొంత కాలంగా ఈ విభాగం నుంచి అడుగుతున్న ప్రశ్నల సంఖ్య కూడా పెరుగుతోంది. 2012 గ్రూప్-1లో 17 ప్రశ్నలు, గ్రూప్-2లో 21 ప్రశ్నలు ఇచ్చారు. ఈ ప్రశ్నలన్నీ విస్తృతంగా కాకుండా.. మనచుట్టూ, నిత్య జీవితంలో ఎదురయ్యే విషయాలకు, ఉపయోగించే పదార్థాలకు సంబంధించిన అనువర్తనాలపై ఉండటాన్ని గమనించవచ్చు. విభజించి చదువుకోవాలి: రసాయన శాస్త్రాన్ని ప్రధానంగా మూలక రసాయన శాస్త్రం, కర్బన రసాయన శాస్త్రం, భౌతిక రసాయన శాస్త్రం, సాధారణ రసాయన శాస్త్రంగా విభజించి చదువుకోవాలి. ప్రధానంగా దృష్టిసారించాల్సిన అంశాలు: పరమాణు నిర్మా ణం, ఆవర్తన పట్టిక, రసాయన బంధం, రేడియోధార్మికత, కేంద్రక రసాయనశాస్త్రం, వివిధ కుటుంబాలకు చెం దిన మూలకాలు-ఆవర్తనాలు, లోహశాస్త్రం, జీవాణువులు, పాలీమర్లు, ఇంధనాలు, హైడ్రోకార్బన్లు, కొల్లాయిడ్లు, ఆమ్లాలు-క్షారాలు, వాయు నియమాలు, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, ఎరువులు, క్రిమి సంహారిణులు, ఔషధాలు, వివిధ ఆవిష్కరణలు-ఆవిష్కర్తలు, నోబెల్ బహుమతులు, పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగించే రసాయనాలు, గాజు, సిమెంట్, వివిధ పదార్థాల రసాయన నామాలు. రెండు రకాలు ప్రశ్నలు: రసాయన శాస్త్రంలో సాధారణంగా రెండు రకాలు ప్రశ్నలు అడుగుతున్నారు. అవి.. కంటెంట్ ప్రశ్నలు. అనువర్తనాల ఆధారంగా అడిగే ప్రశ్నలు (అప్లికేషన్ టైప్). కంటెంట్ ప్రశ్నలు: ఇటువంటి ప్రశ్నలు జ్ఞాపకశక్తిని పరీక్షిస్తాయి. సాధారణంగా వివిధ రసాయన నామాలపై ఈ తరహా ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. వీటిని గుర్తు పెట్టుకోవాలంటే నిరంతర పునశ్చరణ (Repeated Revision)అవసరం. అంతేకాకుండా కెమిస్ట్రీని Chemistry is a volatile subject అని కూడా అంటారు. కాబట్టి ప్రిపరేషన్లో పునశ్చరణకు అధిక ప్రాధాన్యత నివ్వాలి. ఉదా: కఠిన జలంలో ఉండే అయాన్లు? (గ్రూప్ -1, 2012) 1) కాల్షియం, మెగ్నీషియం 2) సోడియం, పొటాషియం 3) కాల్షియం, బేరియం 4) సోడియం, జింక్ సమాధానం: 1 వివరణ: నీటి కాఠిన్యత రెండు రకాలు. అవి.. తాత్కాలిక కాఠిన్యత, శాశ్వత కాఠిన్యత. కాల్షియం, మెగ్నీషియం బై కార్బోనేట్ తాత్కాలిక కాఠిన్యతను, కాల్షియం, మెగ్నీషియం క్లోరైడ్లు, సల్ఫేట్లు శాశ్వత కాఠిన్యతను కలిగిస్తాయి. ఈ ప్రశ్న లవణాలలోని కేటయాన్లు కాల్షియం, మెగ్నీషియంలపై ఆధారపడి ఉంది. అంటే సబ్జెక్ట్‌పై పూర్తి పట్టు ఉంటే తప్ప ఇటువంటి ప్రశ్నకు సమాధానం గుర్తించడం కష్టం. కాబట్టి ప్రిపరేషన్ సమయంలో ఆయా అంశాలకు సంబంధించి సినాప్సిస్ రాసుకోవడంతోపాటు వీలైనన్నిసార్లు పునశ్చరణ చేసుకోవాలి. అనువర్తనాల ఆధారంగా అడిగే ప్రశ్నలు: ఇటువంటి ప్రశ్నలు అన్వయ సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. అంటే సబ్జెక్ట్‌ను చదవడం ద్వారా వచ్చిన అవగాహనను వివిధ అంశాలకు అన్వయించే ప్రయత్నం చేయాలి. ఈ అనువర్తనాలన్నీ దాదాపుగా నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో ముడిపడి ఉంటాయి. ఉదా: నిప్పును ఆర్పివేసే ప్రయత్నంలో ఉపయోగించే వాయువు? (గ్రూప్-2, 2012) 1) హైడ్రోజన్ 2) కార్బన్ డై ఆక్సైడ్ 3) సల్ఫర్ డై ఆక్సైడ్ 4) హైడ్రోజన్ సల్ఫైడ్ సమాధానం: 2 వివరణ: ఈ ప్రశ్న కార్బన్ డై ఆక్సైడ్ ధర్మంపై ఆధారపడిన అనువర్తనానికి సంబంధించింది. కార్బన్‌కు ప్రధానంగా రెండు వాయువులు ఉంటాయి. అవి.. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ దహనశీలి, విషపూరితమైంది. కార్బన్ డై ఆక్సైడ్ మంటలనార్పుతుంది. గ్రీన్‌హౌజ్ వాయువు. కిరణజన్య సంయోగక్రియలో పాల్గొని మొక్కల్లో కార్బోహైడ్రేట్ల తయారీకి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఒక సమ్మేళనం గురించి చదివేటప్పుడు దానికి సంబంధించిన అన్ని అనువర్తనాలపై కూడా అవగాహన పెంచుకోవాలి. రసాయన శాస్త్రంలో అన్ని అంశాలను కాకుండా కొన్ని ముఖ్యమైన వాటిని పరీక్ష క్లిష్టత మేరకు ప్రిపేర్ కావడం ప్రయోజనకరం. ఈ క్రమంలో అంశాల వారీగా దృష్టిసారించాల్సినవి. మూలాధారం: రసాయన శాస్త్రానికి మూలాధారంగా భావించే పరమాణు నిర్మాణం, ఆవర్తన పట్టిక-ఆవర్తన ధర్మాలు, రసాయన బంధం వంటి అంశాల్లోంచి కచ్చితంగా ఒకటి-రెండు ప్రశ్నలు రావచ్చు. పరమాణు నిర్మాణంలో భాగంగా పరమాణు నమూనాలు, విద్యుదయస్కాంత వర్ణపటంలోని వికిరణాలు (కాస్మిక్, గామా, ఎక్స్-కిరణాలు, అతినీలలోహిత, పరారుణ), కాంతి విద్యుత్ ఫలితం దాని అనువర్తనాల గురించి క్షుణ్నంగా చదవాలి. ఆవర్తన పట్టికలోని వివిధ కుటుంబాలు అంటే క్షార లోహాలు, క్షార మృత్తిక లోహాలు, కార్బన్ కుటుంబం, నైట్రోజన్ కుటుంబం, చాల్కోజన్లు, హాలోజన్లు, జడవాయువులపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి. వివిధ కుటుంబాలలోని మూలకాలను గుర్తించే నైపుణ్యం సాధించాలి. వాటిలో రేడియోధార్మికత కలిగిన వాటి పట్ల ప్రత్యేకంగా దృష్టిసారించాలి. ఆవర్తన పట్టికపై పట్టు పెంచుకోవాలంటే..ఆవర్తన పట్టికను మనం నిత్యం చూసే ప్రాంతం (రీడింగ్ టేబుల్ లేదా డ్రెస్సింగ్ టేబుల్, స్విచ్చ్ బోర్డు తదితర)లో స్టిక్ చేసి పరిశీలిస్తూండాలి. ఆవర్తన ధర్మాలైన పరమాణు సైజు, అయనీకరణ శక్మం, రుణ విద్యుదాత్మకత, రసాయన ధర్మం వంటి అంశాలకు కూడా ప్రిపరేషన్లో తగినంత ప్రాధాన్యతనివ్వాలి. రసాయన బంధంలో అయానిక, సమయోజనీయ పదార్థాలను గుర్తించే సామర్థ్యం పెంచుకోవాలి. ద్విబంధం, త్రిబంధం ఏ అణువులో ఉంటాయో గుర్తు పెట్టుకోవాలి. హైడ్రోజన్ బంధం అనువర్తనాలు, పదార్థాల ద్రావణీయత, అణువుల ఆకృతి, బంధ కోణం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రేడియోధార్మికత, కేంద్రక రసాయన శాస్త్రం: సహజ, కృత్రిమ రేడియోధార్మికత, ఆల్ఫా, బీటా, గామా వికిరణాలు-ధర్మాలు, కేంద్రక విచ్ఛితి, కేంద్రక సంలీనం -అనువర్తనాలు, అణు రియాక్టర్లకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించాలి. అంతేకాకుండా దేశంలోని అణు విద్యుత్ కేంద్రాలు, భారజల ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోవడం ప్రయోజనకరం. రసాయన పదార్థాలు: వివిధ మూలకాల ధర్మాలతోపాటు ఆయా మూలకాలు ఏర్పరిచే ముఖ్యమైన సమ్మేళనాలపై తరచుగా ప్రశ్నలు అడుగుతుంటారు. ఈ క్రమంలో పదార్థాల రసాయన నామాలు, వాటి ఉపయోగాలపై ప్రశ్నలు ఇస్తుంటారు. హైడ్రోజన్, సోడియం, పోటాషియం, మెగ్నీషియం, కాల్షియం, అల్యూమినియం, కార్బన్, సిలికాన్, టిన్, లెడ్, నైట్రోజన్, ఫాస్పరస్, ఆక్సిజన్, సల్ఫర్, వివిధ హాలోజన్లు, జడవాయువులు, మాంగనీస్, ఐరన్, కాపర్, జింక్ మొదలైన మూలకాలు, వాటి సమ్మేళనాల గురించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇంధనాలు: ఘన, ద్రవ, వాయు ఇంధనాల శ్రేష్టత, వివిధ ఇంధనాలలోని అనుఘటక రసాయన పదార్థాలపై ప్రశ్నలడిగే అవకాశం ఎక్కువ. ఇందులో సీఎన్జీ, ఎల్పీజీ, బయోగ్యాస్, గోబర్ గ్యాస్, వాటర్ గ్యాస్, ప్రొడ్యూసర్ గ్యాస్ ప్రధానమైనవి. అదే సమయంలో పెట్రోలియం గురించి కూడా నేర్చుకోవాలి. ఉదాహరణ-ఎల్పీజీలో ఉండే ప్రధాన వాయువు? (గ్రూప్-1, 2012). సమాధానం: బ్యూటేన్ లోహశాస్త్రం: రసాయన శాస్త్రంలో మరో ముఖ్యమైన విభాగం లోహశాస్త్రం. మానవుడు ఉపయోగించిన మొదటి లోహం రాగి మొదలు కంచు, ఇత్తడి, స్టీల్ వంటి మిశ్రమ లోహాలు వాటి అనువర్తనాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. వివిధ లోహాల ఖనిజాలు (ఉదాహరణ- అల్యూమినియం ఖనిజం-బాక్సైట్), లోహ నిష్కర్షణ ప్రక్రియలోని వివిధ సూత్రాల గురించి కూడా అవగాహన పెంచుకోవాలి. ఉదాహరణ-భర్జనం, భస్మీకరణం. జీవాణువులు, పాలీమర్లు, ఔషధాలు: జీవవ్యవస్థ నిర్మాణం, పని చేయడంలోనూ వివిధ పదార్థాలు పాల్గొంటాయి. వాటిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, లిపిడ్లు, హార్మోన్లు, విటమిన్లు ముఖ్యమైనవి. వీటిపై ప్రత్యేక దృష్టిసారించాలి. అవసరమైతే జీవశాస్త్రంతో అన్వయం చేసుకుంటూ ప్రిపేర్ కావడం ప్రయోజనకరం. రబ్బర్, సెల్యూలోజ్ ఉత్పన్నాలు, పీవీసీ, టెఫ్లాన్, బేకలైట్ వంటి పాలీమర్లు అనువర్తనాలను వివరంగా చదవాలి. యాంటీపెరైటిక్స్, అనాల్జెసిక్లు, యాంటీబయాటిక్స్, సెడెటివ్స్, యాంటాసిడ్స్ వంటి సాధారణ ఔషధాల గురించి తెలుసుకోవాలి. టీ, సిగరెట్, గంజాయి, శీతలపానీయాల్లో ఉండే పదార్థాల గురించి కూడా అవగాహన పెంచుకోవాలి. ఆమ్లాలు-క్షారాలు: మన ఉదరంలో బలమైన హైక్రోక్లోరికామ్లం ఉంటుంది. తినే సోడా, తమలపాకుకు పూసే సున్నపు తేట క్షార ధర్మం కలిగి ఉంటుంది. వెనిగర్, నిమ్మ ఉప్పు, చీమల కాటు ద్వారా వచ్చే స్రవం అన్నీ ఆమ్లాలే. ఆమ్లాలు-క్షారాలు కలిసి తటస్థీకరణం జరిగితే ఏర్పడేది లవణం. ఇలా వివిధ ఆమ్లాలు- క్షారాలు, లవణాలపై సమాచారాన్ని సేకరించాలి. ముఖ్యంగా నిత్య జీవితంలో ఆయా అంశాలు ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయి అనే అంశాలను పరిశీలిస్తూ చదవడం ప్రయోజనకరం. వివిధ ప్రక్రియలు: బీర్, వైన్ తయారీ, సముద్రపు నీటి నుంచి స్వాదు జలం తయారీ, మొక్కలు నీటిని పీల్చుకోవడం వంటి వివిధ ప్రక్రియలకు సంబంధించిన కిణ్వప్రక్రియ, ద్రవాభిసరణం, తిరోగామి ద్రవాభిసరణం వంటి ప్రక్రియల గురించి ప్రశ్నలు అడగొచ్చు. ద్రావణాలు: ద్రావణం అంటే ద్రవం అని అందరూ భావిస్తుంటారు. కానీ గాలి వంటి వివిధ వాయువుల సజాతీయ మిశ్రమం కూడా ద్రావణమే. అసంతృప్త, సంతృప్త, అతి సంతృప్త ద్రావణాలు, నిజ ద్రావణం, అవలంబనం, కొల్లాయిడ్ల అనువర్తనాలపై ప్రశ్నలు రావచ్చు. మిశ్రమాలు, సమ్మేళనాలు: పదార్థ స్థితిగతుల ఆధారంగా మిశ్రమాలను వేరు చేసే పద్ధతులు, మిశ్రమాలు-సంయోగ పదార్థాల మధ్య భేదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. వీటిపై అడిగే ప్రశ్నలు ప్రాథమిక భావనలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ముందుగా మిశ్రమం అంటే ఏమిటి? సంయోగ పదార్థం అంటే ఏమిటి? వంటి అంశాల పట్ల పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. కాలుష్యం: పెరుగుతున్న కాలుష్యం కారణంగా పోటీ పరీక్షల్లో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. హరిత గృహ ప్రభావం లేదా భౌగోళిక తాపం, ఓజోన్ పొరకు చిల్లులు, ఆమ్ల వర్షాలు, ఫ్లోరోసిస్, వాహనాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, ఫార్మా పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు, అగ్ని పర్వతాలు, గాలి-నీటిలోకి విడుదలయ్యే కలుషితాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించాలి. సూచనలు: - బాయిల్, చార్లెస్ వంటి వాయు నియమాల అనువర్తనాలను పరిశీలించాలి. - రసాయన శాస్త్ర గతిని మార్చిన ఆవిష్కరణలు, సంబంధిత శాస్త్రవేత్తలు, నోబెల్ గ్రహీతలపై కూడా దృష్టి సారించాలి. - నీటి కాఠిన్యతకు కారణమైన లవణాలు, కాఠిన్యతను పోగొట్టే పద్ధతులను తెలుసుకోవాలి. - ఎరువులు, పురుగు మందులు, గాజు, సిమెంట్, అగ్గి పెట్టెలు, టపాకాయల వంటి పరిశ్రమల్లో ఉపయోగించే పదార్థాలపై అవగాహన పెంచుకోవాలి. చదవాల్సినవి: 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫిజికల్ సైన్స్ పుస్తకాలు (పాతవి) ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం రసాయన శాస్త్రం పుస్తకాలు ఆయా అంశాలను చదివేటప్పుడు లోతుగా వెళ్లకుండా ధర్మాలు, ఉపయోగాలు వరకు పరిమితమైతే సరిపోతుంది. చదివేటప్పుడు ప్రతి వాక్యాన్ని విశ్లేషణాత్మకంగా అవగాహన చేసుకుంటూ చదవాలి. ప్రతి అంశాన్ని ప్రశ్న కోణంలో ఊహించుకుంటూ ప్రిపేర్ కావడం మంచిది. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ ప్రిలిమ్స్‌లో జనరల్ సైన్స్ నుంచి ఏయే అంశాలపై ప్రశ్నలు వస్తాయి? ఎలా సిద్ధం కావాలి? - శ్రావణి, గాంధీనగర్ సివిల్స్ ప్రిలిమ్స్‌లో మొదటి పేపర్లో దాదాపు 26 నుంచి 30 ప్రశ్నల వరకు జనరల్ సైన్స్, పర్యావరణం విభాగాల నుంచి వస్తున్నాయి. జనరల్ సైన్స్ విభాగంలోని జీవ శాస్త్రంపై పట్టు ఉంటేనే.. ఆవరణ శాస్త్రంలోని అంశాలపై సమగ్ర అవగాహన పొందడం సాధ్యమవుతుంది. ప్రిలిమ్స్‌లో నెగెటివ్ మార్కులు ఉండటంతో అభ్యర్థులు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు విసృ్తతంగా చదవాల్సి ఉంటుంది. జనరల్ సైన్స్‌లో జీవ శాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రాలు ఉంటాయి. వీటితోపాటు టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలు కూడా ఇస్తారు. అయితే వీటిని సమకాలీన దృక్పథంతో అడుగుతారని గుర్తించాలి. జీవావరణ శాస్త్రంలో స్థూలంగా ఆవరణ శాస్త్ర భావనలు, పర్యావరణ కాలుష్యం, శీతోష్ణస్థితి మార్పు, గ్లోబల్ వార్మింగ్, జీవవైవిధ్యం తదితర అంశాలు ఉంటాయి. జీవ శాస్త్రంలో అభ్యర్థులు వృక్ష, జంతు వర్గీకరణ, వాటి లక్షణాలు, ప్రత్యేకతలపై దష్టి సారించాలి. అదేవిధంగా మానవ శరీర ధర్మ శాస్త్రం, వ్యాధులు వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. శరీర అవయవాల పనితీరు, వాటికి సంక్రమించే వ్యాధులపై ప్రశ్నలు అడుగుతారు. ముఖ్యంగా ఇటీవల ప్రబలుతున్న ఫ్లూ, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, అధికమవుతున్న కాలేయ, జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్లు, వాటి చికిత్స, వాడాల్సిన ఔషధాలు, టీకాలు, నోబెల్ పురస్కార గ్రహీతలు - వారి పరిశోధనలు వంటివి చాలా ముఖ్యమైనవి. భౌతిక శాస్త్రంలో వివిధ సూత్రాల ఆధారంగా పనిచేస్తున్న యంత్రాలపై ప్రశ్నలు వస్తాయి. మైక్రోవేవ్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండీషనింగ్, విద్యుత్ ఉత్పాదన ప్రమాణాలు మొదలైన అంశాలను క్షుణ్నంగా చదువుకోవాలి. దైనందిన జీవితంలో మానవుడు ఉపయోగించే వివిధ రసాయనాలు (కాస్మొటిక్స్, టాయ్‌లెట్రీస్, ఫార్మాస్యూటికల్స్), అదేవిధంగా ప్లాస్టిక్స్, పాలిమర్స్‌కు సంబంధించిన అంశాలను కూడా అధ్యయనం చేయాలి. జీవ వైవిధ్యం, శీతోష్ణస్థితి మార్పు, పర్యావరణ కాలుష్యం, జీవజాతులు వంటి అంశాలపై కూడా క్రమం తప్పకుండా ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి జీవ వైవిధ్యానికి కారణాలు, ఏర్పడుతున్న ప్రమాదాలు, జీవవైవిధ్య హాట్‌స్పాట్స్, వివిధ దేశాల మధ్య పర్యావరణ ఒప్పందాలు మొదలైనవాటిని బాగా చదవాలి. చదవాల్సిన పుస్తకాలు: ఎన్సీఈఆర్టీ బుక్స్ - సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్; రిఫరెన్స్ కోసం: సైన్స్ రిపోర్టర్; ఎన్విరాన్మెంటల్ సర్వే; హిందూ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్; దినపత్రికల సైన్స్ కాలమ్స్ ఇన్పుట్స్: సి.హరికృష్ణ, సీనియర్ ఫ్యాకల్టీ, సివిల్స్ నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ని. బ్యాంక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాను. నాకు బ్యాంకింగ్ అవేర్నెస్ సబ్జెక్టు పూర్తిగా పరిచయం లేదు. ఈ విభాగం నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది? ఏయే అంశాలపై దృష్టి సారించి ప్రిపేరవ్వాలో తెలియజేయండి? - ఎం.సందీప్, రాంనగర్ బ్యాంకు పరీక్షలు రాసే చాలామంది అభ్యర్థులకు బ్యాంకింగ్ అవేర్నెస్ టాపిక్ కొత్తదే. ఈ విభాగాన్ని ఏవిధంగా ప్రిపేరవ్వాలి? ఎక్కడ మొదలు పెట్టాలి? ఏయే అంశాలను చదవాలి? అనే విషయాలకు సంబంధించి చాలామందికి స్పష్టత ఉండదు. రోజూ బ్యాంకుల్లో జరిగే లావాదేవీలకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానంపై పట్టు సాధిస్తే ఈ విభాగం నుంచి చాలా ప్రశ్నలకు జవాబులు గుర్తించవచ్చు. అంటే ఒక బ్యాంకులో ఒక రోజు జరిగే పనులపై అవగాహన ఉండాలన్నమాట. ఏదైనా బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్న ఒక సాధారణ వ్యక్తి గరిష్ట ప్రశ్నలకు సమాధానాలు చెప్పే రీతిలో ఈ విభాగం నుంచి ప్రశ్నల కూర్పు ఉంటుంది. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? డబ్బు డిపాజిట్ చేయడానికి ఉపయోగించే స్లిప్‌ను ఏమంటారు? అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? అకౌంట్ ఓపెన్ చేయడానికి కనీస వయసు ఎంత ఉండాలి?ఎన్ని రకాల అకౌంట్లు ఉంటాయి? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలిసి ఉండాలి. వీటితో పాటు బ్యాంకులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉండే వివిధ సంస్థల (రెగ్యులేటరీ బాడీస్) గురించి తెలుసుకోవాలి. ఆయా సంస్థలకు సంబంధించిన వెబ్సైట్లను పరిశీలించడం, బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్ లాంటి మేగజైన్లను క్రమం తప్పకుండా చదవడం ద్వారా కావాల్సిన వివరాలను సేకరించవచ్చు. ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏ సంస్థలు, వాటి నిబంధనల గురించి చదవాలి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, సూక్ష్మ రుణ సంస్థలు లాంటి అనుబంధ అంశాలపై కూడా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. నమూనా ప్రశ్నలను సాధించడం, ఠీఠీఠీ.ట్చజుటజిజ్ఛీఛీఠఛ్చ్టిజీౌ.ఛిౌఝ లాంటి వెబ్సైట్లలో ఆన్లైన్ టెస్టులను సాధన చేయడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోవచ్చు. ఇన్పుట్స్: కె.వి.జ్ఞానకుమార్, డెరైక్టర్, డీబీఎస్, దిల్సుఖ్నగర్ -
జీవశాస్త్రంలో మెరుగైన మార్కులకు..
పదో తరగతి జనరల్ సైన్స్‌లో రెండో పేపర్ జీవ శాస్త్రం. పబ్లిక్ పరీక్షల్లో ఈ పేపర్‌కు 50 మార్కులు ఉంటాయి. ఒక పద్ధతి ప్రకారం సిద్ధమైతే 50కి 50 మార్కులు సాధించొచ్చు. ఇందులో పొందే మార్కులతోనే సైన్స సబ్జెక్టులో సులువుగా ఉత్తీర్ణులు కావచ్చు. ఈ నేపథ్యంలో జీవశాస్త్రంలో అత్యధిక మార్కుల సాధనకు సబ్జెక్ట్ నిపుణులు అందిస్తున్న టిప్స్.. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు మరో నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉంది. అందుబాటులో ఉన్న ఈ సమయంలో సిలబస్ మొత్తాన్ని ప్రణాళికాబద్ధంగా విభజించుకుని క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తే బయాలజీలో మంచి మార్కులు పొందొచ్చు. జీవశాస్త్రంలో మొత్తం ఆరు అధ్యాయాలు ఉన్నాయి. అవి.. జీవన విధానాలు నియంత్రణ, సమన్వయం ప్రత్యుత్పత్తి హెచ్ఐవీ-ఎయిడ్స్ పోషణ పర్యావరణ విద్య ముఖ్యమైన ప్రశ్నలు చాప్టర్-1 (జీవన విధానాలు): దీని నుంచి పబ్లిక్ పరీక్షల్లో 23 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఈ చాప్టర్ నుంచి కచ్చితంగా రెండు, నాలుగు మార్కుల ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా ఈ చాప్టర్లోని నాలుగు ప్రయోగాలలో ఏదో ఒకదాన్ని ప్రతి ఏటా ఇస్తున్నారు. అదేవిధంగా భేదాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా తప్పనిసరిగా వస్తాయి. ఐదు మార్కులకు అడిగే పటం కూడా ఈ చాప్టర్ నుంచి ఇస్తారు. జీవన విధానాలు - ముఖ్యమైన ప్రశ్నలు: కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డై ఆక్సైడ్ అవసరమని నిరూపించండి? కిరణజన్య సంయోగక్రియలో ఆమ్లజని విడుదలవుతుందని నిరూపించండి? కిరణజన్య సంయోగక్రియకు కాంతి లేదా వెలుతురు అవసరమని ఎలా నిరూపిస్తావు? శ్వాసక్రియలో వేడిమి విడుదలవుతుందని నిరూపించండి? కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియల మధ్య భేదాలు? కుడి, ఎడమ కర్ణికల మధ్య భేదాలు రాయండి? కుడి, ఎడమ జఠరికల మధ్య భేదాలను తెలపండి? అధిక రక్తపీడనానికి కారణాలు తెలిపి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఎర్ర రక్త కణాలు - తెల్ల రక్త కణాల మధ్య భేదాలు రాయండి? మానవుడిలో వివిధ రక్తవర్గాలు - రకాలు? చాప్టర్-2 (నియంత్రణ - సమన్వయం): నియంత్రణ - సమన్వయం నుంచి 14.5 మార్కులకు ప్రశ్నలడుగుతారు. దీనిలో మొక్కలలో నియంత్రణ సమన్వయం నుంచి ఒక నాలుగు మార్కుల ప్రశ్న, జంతువులలో నియంత్రణ సమన్వయం నుంచి ఒక నాలుగు మార్కుల ప్రశ్న ఇస్తారు. ఈ చాప్టర్లో ముఖ్యమైన ప్రశ్నలు: మొక్కలలో సైటోకైనిన్ల ప్రభావం ఏమిటి? ఆక్సిన్లు మొక్కల పెరుగుదలను ఎలా ప్రభావితం చేస్తాయి? మొక్కల పెరుగుదల, అభివృద్ధిలో జిబ్బరెల్లిన్‌ల పాత్ర ఏమిటి? పీయూష గ్రంథి ప్రాముఖ్యం, ఈ గ్రంథి విడుదల చేసే హార్మోన్లు, వాటి చర్యలను పేర్కొనండి? అధివృక్క గ్రంథులను వివరించండి? మస్తిష్క నిర్మాణాన్ని రాయండి? నాడీకణ నిర్మాణాన్ని తెలపండి? చాప్టర్-3 (ప్రత్యుత్పత్తి): జీవశాస్త్రంలో మరో ముఖ్యమైన అధ్యాయం ప్రత్యుత్పత్తి. దీనిపై 18 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. కచ్చితంగా 5 మార్కుల ప్రశ్న (పటం) ఈ చాప్టర్ నుంచి ఇస్తున్నారు. ప్రత్యుత్పత్తిలో ముఖ్యమైన 4 మార్కుల ప్రశ్నలు: లైంగిక, అలైంగిక ప్రత్యుత్పత్తి మధ్య భేదాలను రాయండి? పుష్పంలోని ప్రధాన భాగాలను వివరించండి? మొక్కల కణజాల వర్ధనం ద్వారా కలిగే ప్రయోజనాలేమిటి? శాఖీయోత్పత్తి అంటే ఏమిటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలను తెలపండి? అంటుకట్టడం వల్ల కలిగే ఉపయోగాలను రాయండి? శుక్రకణానికి, అండానికి మధ్య ఉన్న భేదాలు? మానవులలో రుతుచక్రాన్ని వర్ణించండి? చాప్టర్-4 (హెచ్ఐవీ-ఎయిడ్స): ఎయిడ్స్ నుంచి కచ్చితంగా ఒక నాలుగు మార్కుల ప్రశ్న అడుగుతారు. ఈ చాప్టర్లో ప్రశ్నలు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. కాబట్టి అధ్యయనం చేయడం చాలా సులువు. హెచ్ఐవీ-ఎయిడ్స్లో ముఖ్య ప్రశ్నలు: హెచ్ఐవీ- ఎయిడ్సలో దశలను వివరించండి? హెచ్ఐవీ - ఎయిడ్స వంటి సమస్యాత్మక పరిస్థితులను ఎదుర్కోవడానికి కావాల్సిన జీవన నైపుణ్యాలు ఏమిటి? హెచ్ఐవీ ఏయే మార్గాల్లో వ్యాప్తి చెందుతుంది? హెచ్ఐవీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? హెచ్ఐవీ-ఎయిడ్స్ మధ్య భేదాలు రాయండి? చాప్టర్-5 (పోషణ): ఈ చాప్టర్ నుంచి 14.5 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఈ చాప్టర్లో ముఖ్యమైన నాలుగు మార్కుల ప్రశ్నలు: కాల్షియం గురించి రాయండి? పిల్లల మీద క్యాషియోర్కర్ వ్యాధి ప్రభావం ఎలా ఉంటుంది? విటమిన్ ‘ఎ’ లోపం వల్ల కలిగే వ్యాధులేవి? ఎముకల విరుపు లక్షణాలను వివరించండి? ఎముకల విరుపునకు నీవు చేసే ప్రథమ చికిత్స ఏమిటి? మలేరియా పరాన్నజీవి దోమ శరీరంలో ఏయే మార్పులు చెందుతుంది? ప్రాథమిక ఆరోగ్య కేంద్రం - విధులను తెలపండి? చాప్టర్-6 (పర్యావరణ విద్య): దీని నుంచి మొత్తం ఐదు మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. అవి.. ఒక మార్కు ప్రశ్న, రెండు మార్కుల ప్రశ్న, నాలుగు బిట్లు. పటాలు - ప్రయోగాలు 5 మార్కుల ప్రశ్న (పటం) ఒకటి మొక్కల నుంచి, ఒకటి జంతువుల నుంచి ఇస్తారు. మొక్కల్లో ముఖ్య పటాలు: ఆకు అడ్డుకోత - భాగాలు మైటోకాండ్రియా నిర్మాణం - భాగాలు ఉమ్మెత్త పువ్వు - నిలువుకోత, భాగాలు అండం నిర్మాణం - భాగాలు మొక్కలలో ఫలదీకరణాన్ని చూపే పటం, భాగాలు మానవులు/జంతువులు: మానవుడి ఊపిరితిత్తుల నిర్మాణం- భాగాలు మానవుని హృదయం అంతర్నిర్మాణం-కవాటాల స్థానం కప్ప-పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం - భాగాలు కప్ప- స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం - భాగాలు ప్రిపరేషన్ ఇలా.. ఇప్పటికే సిలబస్ దాదాపు పూర్తైఉంటుంది. రాబోయే నాలుగు నెలల్లో ఈ కింది విధంగా సిద్ధమవ్వాలి. డిసెంబర్లో యూనిట్-1 జీవన విధానాలు, యూనిట్-4 హెచ్ఐవీ- ఎయిడ్స్ జనవరిలో యూనిట్-2 నియంత్రణ, సమన్వయం, యూనిట్-5 పోషణ ఫిబ్రవరిలో యూనిట్-3 ప్రత్యుత్పత్తి, యూనిట్-6 పర్యావరణ విద్యలను పూర్తి స్థాయిలో చదవాలి. మార్చి మొదటి మూడు వారాల్లో సిలబస్ మొత్తం పునశ్చరణ (రివిజన్) చేయాలి. ముందు జీవ శాస్త్రం పాఠ్యపుస్తకంలోని ప్రతి పాఠం చివర ఉన్న ఒక మార్కు, రెండు మార్కులు, నాలుగు మార్కుల ప్రశ్నలను బాగా చదవాలి. ఐదు మార్కులకు ఇచ్చే పటాలను కూడా వీలైనన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలి. ఖాళీలు, బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు, జతపరచండి రూపంలో ఇచ్చిన బిట్స్‌ను కూడా చదవాలి. భేదాలుగా ఇచ్చే ప్రశ్నలన్నింటిని ఒకచోట పట్టిక రూపంలో రాసుకొని అధ్యయనం చేయాలి. ఉదాహరణకు విటమిన్లు -ఏయే పదార్థాలలో లభిస్తాయి?-లోపిస్తే వచ్చే వ్యాధులేమిటి? వంటి వాటిని టేబుల్‌గా రూపొందించుకుని చదవాలి. జీవ శాస్త్రవేత్తలు-దేశం-పరిశోధనలు- బహుమతులు వంటి ప్రశ్నలకు కూడా ఇలాగే సిద్ధమవ్వాలి. పబ్లిక్ పరీక్షల దృష్ట్యా ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ జీవన విధానాలు. కాబట్టి పాఠ్యపుస్తకంలో ప్రతి సబ్టాపిక్ను అధ్యయనం చేయాలి. పాఠం చివర ఉన్న ముఖ్యమైన పాయింట్లను చదవడంతోపాటు సారాంశాన్ని ఒక పుస్తకంలో రాసుకోవాలి. ముఖ్యంగా ప్రయోగాలు అటు నాలుగు మార్కులకు, ఇటు ఐదు మార్కులకు అడగడానికి అవకాశమున్న ప్రశ్నలు. కాబట్టి ప్రయోగాలను బాగా చదివి, పటాలను జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రతి చాప్టర్లో ముఖ్యమైన ప్రశ్నలేవో గుర్తించాలి. అందులోనూ 1 మార్కు, 2 మార్కులు, 4 మార్కులు, 5 మార్కులు ఇలా విభజించుకుని ముఖ్యమైన ప్రశ్నలేవో గమనించాలి. ఇలా కనీసం ఐదేళ్ల పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. తర్వాత ముఖ్యమైన ప్రశ్నలను బాగా చదవాలి. నిర్దేశించుకున్న టైమ్‌లోగా వాటికి సమాధానాలు రాయడం ప్రాక్టీస్ చేయాలి. పటాలు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ కింది పద్ధతులు అవలంబించి సాధన చేయాలి. మొదటిస్టెప్లో పటాన్ని 15 లేదా 20 నిమిషాలు క్షుణ్నంగా పరిశీలించాలి. రెండో స్టెప్‌లో పటాన్ని చూసి వేయాలి. మూడో స్టెప్‌లో పటాన్ని చూడకుండా వేయాలి. నాలుగో స్టెప్‌లో చూసివేసిన పటాన్ని, చూడకుండా వేసిన పటాన్ని సరిపోల్చుకొని తప్పులేమన్నా ఉంటే గుర్తించాలి. ఐదో స్టెప్‌లో మళ్లీ చూడకుండా వేయాలి. ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే పటం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రజంటేషన్ స్కిల్స్ ఒక మార్కు ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు జవాబులు సూటిగా, స్పష్టంగా అవసరమైన సమాచారం మాత్రమే రాయాలి. ఉదా: శ్వాసక్రియాధారాలు అంటే ఏమిటి? రెండు ఉదాహరణలివ్వండి? సమాధానం: శరీర శ్వాసక్రియలో ఆక్సీకరణ చెంది శక్తి విడుదల చేసే పదార్థాలను శ్వాసక్రియాధారాలు అంటారు. ఉదా: కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు. రెండు మార్కుల ప్రశ్నలకు రెండు పాయింట్లు రాయాలి. ప్రశ్నను అడిగే తీరును బట్టి ఒక్కోసారి నాలుగు పాయింట్లు కూడా రాయాల్సి వస్తుంది. ఉదా: జీవక్రియ అంటే ఏమిటి? కొన్ని జీవ క్రియల పేర్లు రాయండి? సమాధానం: జీవక్రియ: జీవి మనుగడకు, దాని వంశాభివృద్ధికి అవసరమైన క్రియలను జీవ క్రియలు అంటారు. ఉదా: పోషణ, శ్వాసక్రియ, రవాణా, విసర్జన, ప్రత్యుత్పత్తి. నాలుగు మార్కుల ప్రశ్నకు సమాధానాలు రాసేటప్పుడు కనీసం 8 పాయింట్లు రాయాలి. హెడ్డింగ్‌స, సైడ్ హెడ్డింగ్‌స రాసి ముఖ్యమైన పాయింట్లు అండర్లైన్ చేయాలి. భేదాలను పట్టిక రూపంలో రాయాలి. ప్రయోగానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు ఈ కిందివిధంగా సైడ్ హెడ్డింగ్‌స రాయాలి. 1) ఉద్దేశం 2) కావాల్సిన పరికరాలు 3) ప్రయోగ విధానం 4) పరిశీలన 5) నిర్ధారణ 6) పటం ఐదు మార్కుల ప్రశ్న-పటం చక్కగా గీసి, భాగాలు స్పష్టంగా గుర్తుపెట్టాలి. పటానికి మూడు మార్కులు, భాగాలకు రెండు మార్కులు ఉంటాయి. పటం పెన్సిల్‌తో మాత్రమే గీయాలి. ప్రతి ప్రశ్నకు సమాధానాలు బ్లూ లేక బ్లాక్ పెన్నుతో మాత్రమే రాయాలి. రెడ్పెన్ను, స్కెచ్ పెన్నులు వాడరాదు. బిట్ పేపర్లో సమాధానాలు స్పష్టంగా రాయాలి. దిద్దిన, చెరిపేసి రాసిన వాటికి మార్కులు వేయరు. ప్రతి విద్యార్థి సబ్జెక్టుపై పట్టు సాధిస్తే మార్కులు సాధించడం చాలా సులువు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన జీవశాస్త్రం పాఠ్యపుస్తకంలో ప్రతిపాఠం వెనుక చివర్లో ప్రశ్నలు, ఖాళీలు, సరైన సమాధానాలకు సంబంధించిన బిట్లు బాగా చదివితే విజయం మీదే. నిరంతర పరిశ్రమ, ఉన్నతమైన లక్ష్యం, పటిష్ట ప్రణాళిక, సానుకూల ఆలోచన ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు. ఉన్నత శిఖరాలు మీవే!! సూర సత్యనారాయణ, సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్, హైదరాబాద్. -
జనరల్ సైన్స్
జంతువులు-ప్రయోజనాలు మనిషి పరిణామం, నాగరికత అభివృద్ధిలో జంతువుల పాత్ర చాలా కీలకమైంది. ప్రారంభంలో మనిషికి కేవలం ఆహార వనరులుగానే జంతువులు ఉపయో గపడ్డాయి. అయితే, వాటి ఇతర అవసరాలను గుర్తించిన మనిషి జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రారంభించాడు. వ్యవసాయ ఆవిర్భావానికి ముందు మనిషి ఆహా రం కోసం.. వేట, సేకరణపైనే ఆధారపడేవాడు. జంతువులను మచ్చిక చేసుకోవడంతో వ్యవసాయం సాధ్యమైంది. ఆహార, శ్రామిక వనరులుగా జంతువుల వినియోగం పెరిగింది. క్రమంగా తోలు, ఉన్ని, పట్టు, ఔషధాలు వంటి ఉత్పత్తుల ప్రాధాన్యత పెరిగేకొద్ది వాటిని అందించే జంతువుల పెంపకం వృద్ధి చెందింది. ఆధునిక కాలంలో ఆర్థికాభివృద్ధికి కూడా జంతువులు దోహదపడ్డాయి. పౌల్ట్రీ, పిగ్గరీ, పిసికల్చర్, సెరికల్చర్, ఎపికల్చర్, డెయిరీ, ప్రాన్కల్చర్ వంటి రంగాల ప్రాముఖ్యత పెరిగింది. ఆహార వనరులుగా: జంతువుల నుంచి మాంసం, పాలు, గుడ్ల రూపంలో ఆహారం లభిస్తుంది. జంతు మాంసంలో ప్రొటీన్లు ఎక్కువగా లభిస్తాయి. మొక్కల ఆహారంతో పోలిస్తే జంతు ఆహార ప్రొటీన్లలో ఆవశ్యక అమైనో ఆమ్లాలు అధిక మోతాదులో ఉంటాయి. జంతు ఆహారంలోని కొవ్వు పదార్థాలు పరిమిత మోతాదులో మనిషి శరీరానికి ఎంతో అవసరం. విటమిన్ బి-12 కేవలం జంతు ఆహారంలో మాత్రమే లభిస్తుంది. చేపల మాంసంలో గుండె పనితీరును మెరుగుపర్చే అనేక అసంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికంగా లభిస్తాయి. కోళ్లు, మేకలు, గొర్రెలు, పశువులు, చేపలు, రొయ్యలు, లాబ్‌స్టర్, ష్రింప్లు, బాతులు.. ఇంకా అనేక రకాల పక్షులు, కొన్ని రకాల కీటకాలు మనిషికి ఆహార వనరులుగా ఉపయోగపడుతున్నాయి. ఎలుకలు, కుక్కలు, వన్య జంతువులు, తిమింగలాలు, డాల్ఫిన్లు, ఒంటె, గాడిదలను కూడా మనిషి ఆహార వనరులుగా ఉపయోగిస్తున్నాడు. పశువులు, మేకలు, ఒంటె వంటి జంతువుల నుంచి పాలు లభిస్తాయి. పిల్లల పెరుగుదలకు పాలు చాలా అవసరం. ఇందులో కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. పాల నుంచి నెయ్యి, వెన్న, పెరుగు ఇతర ద్వితీయ ఉత్పత్తులు తయారవుతాయి. గుడ్లలో కూడా ప్రొటీన్లు, కొవ్వు సమతుల్యతలో లభిస్తాయి. కోళ్లు, బాతులు, ఆస్ట్రిచ్, ఇతర పక్షుల నుంచి గుడ్లు లభిస్తాయి. శ్రామిక అవసరాలకు.. : అనేక జంతువులను బరువు లాగడానికి, బరువు మోయడానికి మనిషి వినియోగిస్తున్నాడు. వీటిలో ముఖ్యమైనవి ఎద్దులు, గుర్రాలు, గాడిదలు, ఏనుగులు, ఒంటెలు, కుక్కలు. ఎద్దులను ప్రధానంగా వ్యవసాయంలో భూమి దున్నేందుకు, బండ్లు లాగడానికి ఉపయోగిస్తున్నారు. గుర్రాలు, ఏనుగులు ఒకప్పుడు యుద్ధాల్లో ఉపయోగపడేవి. ఇప్పటికీ గుర్రాలు సైనికులకు సాయపడుతూనే ఉన్నాయి. గుర్రాలను క్రీడల్లో కూడా ఉపయోగిస్తున్నారు. తోలు వనరులుగా.. : జంతువుల చర్మంలోని అంతశ్చరం నుంచి తోలు లభిస్తుంది. దేశంలో దాదాపు 87 శాతం తోలు మృత పశువుల నుంచి, మిగతా 13 శాతం వధించిన జంతువుల నుంచి లభిస్తోంది. ఆవుల నుంచి లభించే తోలును కిప్స్ అని, గేదెల నుంచి లభించే తోలును బఫ్స్ అని అంటారు. బెల్టులు, పర్సులు, బ్యాగులు, జాకెట్లు, బూట్ల తయారీలో తోలును విరివిగా ఉపయోగిస్తారు. అదనంగా సర్పాలు, మొసళ్ల నుంచి కూడా తోలు లభ్యమవుతోంది. ఉన్ని వనరులుగా: గొర్రెల చర్మంపై దట్టంగా ఉండే మృదువైన, గరుకైన రోమాలను ఉన్ని అంటారు. జూరియ, బికనేరీ, కాశ్మీరీ, రాజ్పుఠానా వంటివి ఉన్ని రకాలు. పష్మిన అనే మేక నుంచి కూడా ప్రత్యేకంగా ఉన్ని లభిస్తుంది. దీన్ని పష్మిన శాలువల తయారీలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. పట్టు: పట్టు కోసం పట్టు పురుగులను పెంచడాన్ని సెరికల్చర్ అంటారు. క్రీస్తు పూర్వం 2679 నాటికే చైనాలో పట్టు ఉత్పత్తి ప్రారంభమైంది. క్రీ.శ. 555 వరకూ బయటి ప్రపంచానికి పట్టు తయారీ విధానం తెలియకుండా చైనీయులు జాగ్రత్త వహించి, పట్టు ఉత్పాదనలో తమ ఆధిక్యతను చాటుకున్నారు. పట్టు పురుగుల జీవిత చక్రంలోని కకూన్ దశ నుంచి పట్టు లభిస్తుంది. పట్టులో సెరిసిన్, ఫైబ్రోయిన్ అనే రెండు ప్రొటీన్లు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అధిక పెంపకంలో ఉన్న పట్టు పురుగు - చైనీస్ పట్టు పురుగు లేదా మల్బరీ పట్టు పురుగు. లక్క: లక్కపురుగు భారీ చెట్ల కొమ్మలపై గుడ్లు పెడుతుంది. ఈ గుడ్ల నుంచి వచ్చే పిల్లలు తమ చుట్టూ రక్షణ కోసం రెజిన్ అనే పదార్థాన్ని స్రవిస్తాయి. పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత అక్కడ నుంచి ఎగిరిపోతాయి. ఆ తర్వాత కొమ్మలపై ఉన్న రెజిన్‌ను సేకరించి శుద్ధి చేసినపుడు లక్క లభిస్తుంది. దీన్ని బొమ్మలు, కాస్మెటిక్స్, పెయింట్స్, వార్నిష్‌ల తయారీలో, తపాలా, ప్రభుత్వ కార్యాలయాల్లో సీలు వేయడానికి ఉపయోగిస్తారు. ఔషధ వనరులుగా జంతువులు: అనేక జంతువులు ఔషధాల తయారీలో ఉపయోగపడతాయి. సర్పం విషంలోని ప్రొటీన్లు... మంచి నొప్పి నివారిణులుగా పనిచేస్తాయి. నాగుపాము విషం కోబ్రడిన్ను.. క్షయ, పక్షవాతం, కీళ్లవాపు చికిత్సలో తక్కువ మోతాదులో వినియోగిస్తారు. కోబ్రడిన్ నుంచి తయారయ్యే కోబ్రాక్సిన్ అనే ద్రావణాన్ని క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు. సర్పాల విషాన్ని.. విరుగుడు (యాంటీవీనమ్) తయారీలో ఉపయోగిస్తారు. తేళ్ల విషాన్ని ప్రత్యేకంగా కీళ్ల వాపు చికిత్సలో వాడతారు. నెమలి పైత్యరసాన్ని, తేనెను రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగిస్తారు. జలగ లాలాజలం నుంచి లభించే హిరుడిన్ అనే రక్తస్కంధన నివారిణిని శస్త్ర చికిత్సలో ఉపయోగిస్తారు. శంఖాల నుంచి సంగ్రహించే పదార్థాన్ని అజీర్తి, మొలల చికిత్సలో ఉపయోగిస్తారు. దీని భస్మాన్ని గుండె పనితీరు పెంచే కార్డియాయిక్ స్టిమ్యులెంట్గా ఉపయోగిస్తారు. సెపియ(కటిల్ ఫిష్) అస్థికలను, అది విడుదల చేసే విషాన్ని కూడా హోమియోపతి వైద్యంలో ఉపయోగిస్తారు. దాదాపు అన్ని ఆయుర్వేద ఔషధాల్లో తేనెను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. పరిశోధనలో నమూనాలుగా: ప్రాథమిక జీవశాస్త్ర అధ్యయనంలో, వైద్య రంగంలో ప్రతి అవయవం పనితీరును అర్థం చేసుకోవడంలో, మందులను పరీక్షించడంలో, శస్త్ర చికిత్సలను అభివృద్ధి చేయడంలో అనేక రకాల జంతువులను విరివిగా వినియోగిస్తున్నారు. ఉదా: ఎలుకలు, కుందేలు, చింపాంజీలు, కోతులు. -
జనరల్ సైన్స్
వన్య జీవుల పరిరక్షణ మనిషి అభివృద్ధి చర్యల కారణంగా వన్యజీవులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అనేక వన్యజీవులు విలుప్తత దశకు చేరాయి. ఆవాసాల క్షీణత, ఆహార సేకరణ కోసం పర్యావరణ విధ్వంసం, కాలుష్యం, సహజ ఆవాసాల్లోకి కొత్త జాతుల ప్రవేశం, శీతోష్ణస్థితుల్లో మార్పుల వల్ల వన్యప్రాణులు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదముంది. 20వ శతాబ్దం ప్రారంభంలో భారత్‌లో 40,000 పులులు ఉండగా, 2010 నాటికి వాటి సంఖ్య 1706కు పడిపోయింది. ఆసియా చీతా వంటివి దేశంలో పూర్తిగా అంతరించిపోయాయి. తమ సహజ ఆవాసాల్లో జీవావరణ సమతుల్యతను కాపాడే ఈ పరభక్షక జంతువులు అంతరిస్తే ఎడారీకరణ సంభవించే ప్రమాదముంది. ఈ పరిణామం మనిషి ఉనికికే ముప్పుగా పరిణమిస్తుంది. మనిషి అంతరిస్తే ప్రకృతికి ఎలాంటి నష్టం వాటిల్లదు. కానీ వన్యప్రాణులు నశిస్తే ప్రకృతితోపాటు మనిషి మనుగడ కూడా ప్రమాదంలో పడుతుంది. స్విట్జర్లాండ్‌లోని గ్లాండ్ నగరంలో ఉన్న ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్(ఐయూసీఎన్).. వన్యజీవులు ఎదుర్కొంటున్న ప్రమాద తీవ్రత బట్టి వాటిని అనేక రకాలుగా విభజిస్తుంది.అంతరించిన ప్రాణులు: భూమిపై ఒక జాతికి చెందిన చిట్టచివరి జీవి కూడా చనిపోయిందని నిస్సందేహంగా ఖరారైనప్పుడు ఆ జాతి అంతరించినట్లు నిర్ధారిస్తారు. ఉదా: ఆసియా చీతా, ఊదారంగు తల బాతు, డోడో పక్షి. సహజ ఆవాసాల్లో అంతరించిన ప్రాణులు: ఇవి మనిషి నిర్బంధ సంరక్షణలో తప్ప సహజ ఆవాసాల్లో ఎక్కడా కనిపించని జీవ జాతులు. ప్రమాదపుటంచుల్లో ఉన్నవి: ఇవి దాదాపు అంతరించే స్థాయికి చేరిన వన్యప్రాణులు. మనిషి ప్రత్యక్షంగా సంరక్షిస్తే తప్ప వాటి మనుగడ సాధ్యం కాని జీవజాతులు. ఉదా: కృష్ణ జింక, ఇండియన్ రైనో, లయన్ టెయిల్డ్ మకాక్, ఇండియన్ వైల్డ్ ఆస్. అంతరించే ప్రమాదమున్నవి: ఇవి ఆవాసాల క్షీణత, పర్యావరణ దుర్వినియోగం, వేట మొదలైన కారణాల వల్ల ప్రమాదంలో పడినవి. ఉదా: ఏసియాటిక్ ఏనుగు, బ్లూ షీప్. సమాచారం లేనివి (డేటా డెఫిసియంట్): అధ్యయనంలో ఉన్నప్పటికీ, తగినంత సమాచారం అందుబాటులో లేకపోవడం వల్ల ఇంకా ఏ విభాగంలోకి వర్గీకరించని వన్యప్రాణులను ఈ జాబితాలో చేర్చారు. స్థానీయ జాతులు: భౌగోళికంగా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై, మిగతా ప్రాంతాల్లో ఎక్కడా లేనివి స్థానీయ జాతులు. ఇప్పటికిప్పుడు వీటికి ప్రమాదం లేనప్పటికీ, కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కావడం వల్ల అక్కడ ఏ ప్రమాదం సంభవించినా పూర్తిగా అంతరిస్తాయి. ఉదా: గాం జిటెక్ డాల్ఫిన్, ఘరియాల్, అండమాన్ పంది. వన్య జీవుల పరిరక్షణ చర్యలు: అంతర్జాతీయ స్థాయి పరిరక్షణ చర్యలు ప్రపంచవ్యాప్తంగా వన్యజీవులు ఎదుర్కొంటున్న ప్రమాదాల తీవ్రతను బట్టి వాటిని వర్గీకరించే విధానాన్ని ఐయూసీఎన్ 1963లో ప్రారంభించింది. అంతరించే ప్రమాదం ఉన్న జీవజాతుల జాబితాను ఈ సంస్థ ఏటా ప్రచురిస్తుంది. 2012 జూన్‌లో ఐయూసీఎన్ తన తొలి జాబితా ‘రెడ్ లిస్ట్’ను విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన 72 జంతుజాతులను క్రిటికల్లీ ఎండేంజర్డగా గుర్తించారు. వీటిలో 18 ఉభయచర, 14 చేపలు, 10 క్షీరదాల జాతులు ఉన్నాయి. 15 పక్షి జాతులను కూడా ఈ విభాగంలో చేర్చారు. 69 చేపల, 38 క్షీరదాల, 32 ఉభయచర జాతులను ఎండేంజర్డగా గుర్తించారు. వన్యజీవుల ఆవాసాలను, అక్కడి తెగల సంప్రదాయాలను, చారిత్రక కట్టడాలను సంరక్షించే లక్ష్యంతో 1970లో యునెస్కో.. మ్యాన్ అండ్ బయోస్ఫియర్(మాబ్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా వివిధ దేశాల్లో ప్రమాదం అంచున ఉన్న వన్యజీవుల ఆవాసాలను బయోస్ఫియర్ రిజర్వలుగా గుర్తించి పరిరక్షిస్తారు. వివిధ దేశాల మధ్య వన్యజీవుల, వాటి భాగాల రవాణాను నిరోధించే లక్ష్యంతో 1975 లో కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్‌డ స్పెసీస్ ఫ్లోరా అండ్ ఫౌనా (ఇఐఖీఐఉ) అనే అంతర్జాతీయ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్య పరిరక్షణకు ఉద్దేశించిన కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ (ఇఆఈ) అనే అంతర్జాతీయ ఒప్పందం 1993 డిసెంబర్ 29న అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందాలన్నింటిపై భారత్ సంత కాలు చేసి వన్యజీవుల పరిరక్షణకు కృషి చేస్తోంది. ప్రధానమంత్రి అధ్యక్షతన పనిచేసే నేషనల్ బోర్డ ఫర్ వైల్డ్‌లైఫ్ (ూఆగిఔ) వన్యజీవుల పరిరక్షణ విధానాలను రూపొందించి, అమలు చేస్తుంది. వన్యజీవుల పరిరక్షణ ఒక సరికొత్త కార్యాచరణ ప్రణాళిక, నేషనల్ వైల్డ్‌లైఫ్ యా క్షన్ ప్లాన్ (ూగిఅ్క)ను 2002లో ప్రారంభించారు. ఇది 2016 వరకు అమల్లో ఉంటుంది. వన్యజీవుల పరిరక్షణకు రక్షిత ప్రాంతాల కార్యక్రమాన్ని భారత్ అమలు చేస్తోంది. దేశ భౌగోళిక ప్రాంతంలో 4.9 శాతం మేరకు భూభాగంలో 668 రక్షిత ప్రాంతాలను ఇప్పటి వరకు ఏర్పాటు చేశారు. వీటిలో 102 జాతీయ పార్కులు, 515 అభయారణ్యాలు, 47 కన్జ ర్వేషన్ రిజర్వ్‌లు, 4 కమ్యూనిటీ రిజర్వ్‌లు ఉన్నాయి. వీటికి అదనంగా పులుల సంరక్షణకు 39 టైగర్ రిజర్వులను, ఏనుగు సంరక్షణకు ఎలిఫెంట్ రిజర్వులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వన్యజీవుల దుర్వినియోగాన్ని నియం త్రించే లక్ష్యంతో వన్యజీవుల సంరక్షణ చట్టం 1972 నుంచి అమల్లో ఉంది. దీనిలో ఎప్పటికప్పుడు సవరణలు కూడా చేశారు. వన్యజీవుల సంరక్షణకు రూపొందించి అమల్లోకి తీసుకువచ్చిన ఇతర చట్టాలు... అటవీ సంరక్షణ చట్టం-1980 (1988లో సవరణ), పర్యావరణ పరిరక్షణ చట్టం-1986, జీవ వైవిధ్య చట్టం-2002, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స(ఖ్ఛఛిౌజజ్టీజీౌ ౌజ ఊౌట్ఛట్ట ఖజీజజ్టిట) చట్టం-2006. వన్యజీవులపై నేరాలను అరికట్టడానికి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో... కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో వన్యజీవుల పరిరక్షణకు అవసరమైన నిధుల సేకరణకు వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (గిగిఊూ) కృషి చేస్తోంది. జాతీయ పార్కు: ఎలాంటి మానవ చర్యలను అనుమతించని, కేవలం వన్యజీవుల పరిరక్షణకు మాత్రమే ఉద్దేశించిన రక్షిత ప్రాంతాన్ని జాతీయ పార్కు అంటారు. వ్యవసాయం, పశువులను మేపడం, ఇళ్ల నిర్మాణం, కలప సేకరణ వంటి చర్యలను జాతీయపార్కులో అనుమతించరు. అభయారణ్యం: వన్యజీవుల పరిరక్షణకు, ముఖ్యంగా ఒక ప్రత్యేక జాతి పరిరక్షణకు ఉద్దేశించిన రక్షిత ప్రాంతమే అభయారణ్యం. ఇక్కడ వన్యజీవుల మనుగడకు భంగం వాటిల్లని స్థాయిలో కలప సేకరణ, ఇతర అటవీ ఉత్పత్తుల సేకరణను అనుమతిస్తారు. బయోస్ఫియర్ రిజర్వ: ఒక భౌగోళిక ప్రాంతంలోని వన్యజీవుల పరిరక్షణతో పాటు అక్కడి సహజ ఆవాసాలు, స్థానిక తెగల సంప్రదాయాలు, చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి ఏర్పాటయ్యే రక్షిత ప్రాంతమే బయోస్ఫియర్ రిజర్వ. సాధారణంగా బయోస్ఫియర్ రిజర్వ్‌ను వివిధ భాగాలుగా విభజించి వన్యజీవుల సంరక్షణ చర్యలను నిర్వహిస్తారు. కన్జర్వేషన్ రిజర్వ: సాధారణంగా జాతీయ పార్కులు, అభయారణ్యాలకు దగ్గరగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో రాష్ర్ట ప్రభుత్వాలు ఏర్పాటు చేసే రక్షిత ప్రాంతమే కన్జర్వేషన్ రిజర్వ. సాధారణ ప్రజలతో చర్చించిన తర్వాత మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ స్థానిక ప్రజల హక్కులకు భంగం వాటిల్లదు. కమ్యూనిటీ రిజర్వ: స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు వారికి చెందిన ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు దాన్ని కమ్యూనిటీ రిజర్వ అంటారు. -
ఆల్కహాల్ శాతం ఎందులో ఎక్కువ?
జనరల్ సైన్స్ మొక్కలు-ఉపయోగాలు మానవ పరిణామం, నాగరికత ఆవిర్భా వంలో మొక్కల ప్రాధాన్యత ఎనలేనిది. తొలి నాళ్లలో మొక్కలు కేవలం ఆహార వనరులుగానే ఉప యోగపడ్డాయి. అయితే, మానవుడు క్రమంగా వాటిని ఇతర అవసరాలకు వినియోగించడం ప్రారంభించాడు. వ్యవసాయ ఆవిర్భావం, విస్త రణ ద్వారా మొక్కలు మనిషి జీవన విధా నంలో భాగమయ్యాయి. ఆహారం, నారపీచు, కలప, ఔషధాలు, మత్తు పదార్థాలు, పానీ యాలు, మసాలా దినుసులు, పశుగ్రాసం, పేపరు, రబ్బరు.. మొదలైనవి మొక్కల నుంచి లభిస్తాయి. ఆహార వనరులుగా మొక్కలు అనేక రకాల మొక్కల భాగాలు మనిషికి ఆహార వనరులుగా ఉపయోగపడుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయలు, ఫలాలు. ప్రధాన పిండి పదార్థ వనరులు ఆహారధాన్యాలు. ఇవి ప్రధానంగా రెండు రకాలు.. సిరీల్స్, మిల్లెట్స్. సిరీల్స్ అనేవి ప్రధాన ధాన్యాలు. ఇవి ప్రపంచ వ్యాప్తంగా అధికంగా వినియోగంలో ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఆరు రకాలు. అవి.. వరి, గోధుమ, మొక్కజొన్న, బార్లీ, ఓట్స్, రై. తక్కువ వినియోగంలో ఉన్నవి మిల్లెట్స్. ఇవి జొన్న, సజ్జ, రాగి, కొర్రలు. పప్పుధాన్యాల ద్వారా ప్రొటీన్లు ఎక్కువగా లభిస్తాయి. శాకాహారులకు ఇవే ప్రధాన ప్రొటీన్ వనరులు. కంది, శనగ, మినుములు, పెసలు, బఠాణి, బీన్స, సోయాబీన్, వేరుశనగ ముఖ్యమైన పప్పు దినుసులు. నూనె గింజల్లో ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు అధికంగా లభిస్తాయి. వేరుశనగ, పొద్దు తిరుగుడు, కుసుమలు, ఆవాలు, నువ్వులు, పామాయిల్, కొబ్బరి మొదలైనవి ముఖ్య నూనె వనరులు. అవిసె నూనెను ఆహారంలో అరుదుగా ఉపయోగిస్తారు. అయితే దీనికి అనేక పారిశ్రామిక అనువర్తనాలు ఉన్నాయి. మొక్కల్లో ఆహారం నిల్వ ఉన్న భాగాలను కూరగాయలని పిలుస్తారు. పిండి పదార్థంతో పాటు నీరు, ఖనిజాలు, విటమిన్లు, కొద్దిగా పీచు వీటిలో లభిస్తాయి. మొక్కలోని వివిధ శరీర భాగాలు కూరగాయలుగా ఉప యోగపడతాయి.ఫలాలు అనేవి విత్తనం ఉన్న మొక్క భాగా లు. కొన్ని ఫలాల్లో విత్తనాలు ఉండవు. ఫలాల్లో తక్షణశక్తికి ఉపయోగపడే ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. అదనంగా ఖనిజాలు, విటమిన్లు, నీరు, పీచు లభిస్తాయి. ఫలాలు ప్రధానంగా రెండు రకాలు. 1. సమశీతోష్ణ మండల ఫలాలు. ఉదా॥ఆపిల్, పియర్, స్ట్రాబెర్రీ, చెర్రీ మొదలైనవి. 2. ఉష్ణమండల ఫలాలు. ఉదా॥మామిడి, దానిమ్మ, బొప్పాయి, నారింజ, బత్తాయి మొ॥ నారపీచు వనరులు : ఆహారం తర్వాత అంతటి ఉపయోగకరమైన మొక్క ఉత్పత్తులు నార పీచు. వివిధ మొక్క భాగాల నుంచి ఇవి లభిస్తాయి. విత్తన కవచ రోమాల నుంచి పత్తి లభిస్తుంది. హరప్పా కాలంనుంచి దేశంలో పత్తి సాగులో ఉంది. కాండంలోని పోషక కణజాలం నుంచి లభించే నారను ‘బాస్ఫైబర్’ అంటారు. జనపనార, అవిసెనార ఈ కోవకు చెందినది. మధ్య ఫల కవచం నుంచి కొబ్బరి పీచు లభిస్తుంది. కలప : మొక్క కాండం, కొమ్మల నుంచి కలప లభిస్తుంది. సాల, టేకు, వేప, తుమ్మ, రోజ్ వుడ్, దేవదారు, ఫైన్, కేన్ మొదలైనవి ముఖ్యమైన కలప వనరులు. వెదురు నుంచి 80 శాతం పేపరు తయారవుతుంది. మిగతా పేపరు.. గడ్డి, కలప, బగాిసీ నుంచి లభిస్తుంది. ఔషధ వనరులు : మనిషి అనాదిగా మొక్కల్లోని అనేక భాగాల ఔషధ విలువలను తెలుసుకొని వినియోగిస్తున్నాడు. చరకసంహితలో కొన్ని వేల మొక్కల ఔషధ వనరుల వర్ణన ఉంది. ఆయుర్వేదంలో వివరించిన మొక్కల సమా చారం, చరక సంహిత నుంచి సంగ్రహించిందే. బెల్లడోనా, సర్పగంథ, అశ్వగంథ, ఇంగువ వేర్లలో ఔషధ విలువలు ఉన్నాయి. పసుపు, అల్లం, వెల్లుల్లి అనేవి కాండాలు. పసుపులోని కుర్కుమిన్లో అనేక ఔషధ విలువలు ఉన్నట్లు గుర్తించారు. సింకోనా మొక్క బెరడు నుంచి క్వినైన్ అనే మలేరియా నివారక మందు లభిస్తుంది. తులసి పత్రాలు, అలోవెరా (కలబంద) పత్రాలు, తమలపాకుల్లో ఔషధ రసాయనాలు లభిస్తాయి. నల్లమందులో నొప్పి నివారిణి రసాయనాలు ఉన్నాయి. వేప, జిన్సెంగ్ వంటి మొక్క శరీరమంతటా ఔషధ రసాయనాలు పుష్కలంగా లభిస్తాయి. మత్తు పదార్థాలు: కొన్ని మొక్కల భాగాలనుంచి సంగ్రహించే పదార్థాలను తీసుకొన్నపుడు మత్తు కలుగు తుంది. వీటిని అధికంగా వినియోగించి నప్పుడు శరీరం మొత్తం ప్రభావితమవుతుంది. క్రమంగా ఇది వ్యసనానికి దారి తీస్తుంది. వీటిలో పొగ పీల్చేవి.. ప్యుమటరీస్, నమిలేవి.. మ్యాస్టికేటరిస్. వివిధ రకాల తమలపాకులు, వక్క... ప్రధాన మ్యాస్టికేటరీస్. పొగాకు, నల్ల మందు, గంజాయి, కొకైన్... ఫ్యుమటరీస్, మ్యాస్టికేటరీస్గానూ ఉపయోగపడతాయి. పానీయాలు(బేవరేజెస్): మొక్కల భాగాల నుంచి బేవరేజెస్ కూడా తయారవుతాయి. ఇవి రెండు రకాలు.. నాన్ ఆల్కహాలిక్, ఆల్కహాలిక్. కాఫీ, టీ, కొకోవా.. ముఖ్యమైన నాన్ ఆల్క హాలిక్ పానీయాలు. మత్తు (ఆల్కహాలిక్) పానీ యాలు రెండు రకాలు.. కిణ్వన పానీ యాలు, స్వేదన పానీయాలు. బీర్, వైన్ వంటివి కిణ్వన పానీయాలు. విస్కీ, బ్రాందీ, వోడ్కా వంటివి స్వేదన పానీయాలు. రబ్బరు: ప్రపంచవ్యాప్తంగా 98 శాతానికిపైగా రబ్బరు హెవియ బ్రెజేలియన్సిస్ అనే మొక్క నుంచి కారే ల్యాటెక్స్ ద్రవంతో తయార వుతుంది. సపోటా మొక్క ల్యాటెక్స్ నుంచి కూడా కొద్దిగా రబ్బరు తయారవుతుంది. రంగులు (డైస్): వస్త్రాలకు పూర్తిగా అతుక్కుపోయే రసాయ నాలు రంగులు. ఇవి కాంతి లేదా నీటి వల్ల తొందరగా నశించవు. మొక్కల వివిధ భాగా లు, వేర్లు, పత్రాలు, బెరడు, ఫలాలు, కలప నుంచి రంగులు లభిస్తాయి. ఇండిగో, గోరింటాకు, దేవదారు, టేకు, కుంకుమ పువ్వు, కుసుమ పువ్వు నుంచి ఎక్కువగా రంగులను తయారు చేస్తారు. శక్తి వనరులు: అనేక మొక్కలు మనిషికి వంట చెరుకుగా ఉపయోగపడుతున్నాయి. అంతే కాక, జట్రోపా కర్కస్ (నేపాళం), పొంగా మియా పిన్నాట (కానుగ) వంటి మొక్కల గింజల నుంచి సంగ్రహించిన నూనెను రసాయన మార్పునకు గురిచేసినప్పుడు బయో డీజిల్ వంటి జీవ ఇంధనం లభిస్తుంది. దీన్ని డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా లేదా డీజిల్‌తో కలిపి నియోగించడానికి వీలవుతుంది. మసాలా దినుసులు: ఆహారం రంగును, రుచిని పెంచే మొక్క ఉత్పత్తులు మసాలా దినుసులు. వీటిలో పెద్దగా పోషక విలువలు ఉండవు అయితే ఔషధ గుణాలు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి పసుపు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కుంకుమపువ్వు, ఆవాలు, యాలకులు మొ॥ సుగంధ ద్రవ్యాలు: కొన్ని మొక్కల పత్రాలు, పుష్పాల నుంచి సుగంధ ద్రవ్యాలు లభిస్తాయి. వీటిని పెర్ఫ్యూమ్స్లో ఉపయోగిస్తారు. వేరు కూరగాయలు క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. కాండం కూరగాయలు ఉల్లి,కంద, చామగడ్డ మొగ్గ కూరగాయలు క్యాబేజి ఫల కూరగాయలు వంకాయ, టమోటా సొరకాయ, పొట్ల, బీరకాయ, కాకర ఆకు కూరలు కూడా కూరగాయలే.