ఆల్కహాల్ శాతం ఎందులో ఎక్కువ? | Either a higher percentage of alcohol? | Sakshi
Sakshi News home page

ఆల్కహాల్ శాతం ఎందులో ఎక్కువ?

Published Sat, Aug 24 2013 1:40 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఆల్కహాల్ శాతం ఎందులో ఎక్కువ? - Sakshi

ఆల్కహాల్ శాతం ఎందులో ఎక్కువ?

 జనరల్ సైన్స్
 మొక్కలు-ఉపయోగాలు
  మానవ పరిణామం, నాగరికత ఆవిర్భా వంలో మొక్కల ప్రాధాన్యత ఎనలేనిది. తొలి నాళ్లలో మొక్కలు కేవలం ఆహార వనరులుగానే ఉప యోగపడ్డాయి. అయితే,  మానవుడు క్రమంగా వాటిని ఇతర అవసరాలకు వినియోగించడం ప్రారంభించాడు. వ్యవసాయ ఆవిర్భావం, విస్త రణ ద్వారా మొక్కలు మనిషి జీవన విధా నంలో భాగమయ్యాయి. ఆహారం, నారపీచు, కలప, ఔషధాలు, మత్తు పదార్థాలు, పానీ యాలు, మసాలా దినుసులు, పశుగ్రాసం, పేపరు, రబ్బరు.. మొదలైనవి మొక్కల నుంచి లభిస్తాయి.
 
 ఆహార వనరులుగా మొక్కలు
 అనేక రకాల మొక్కల భాగాలు మనిషికి ఆహార వనరులుగా ఉపయోగపడుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయలు, ఫలాలు. ప్రధాన పిండి పదార్థ వనరులు ఆహారధాన్యాలు. ఇవి ప్రధానంగా రెండు రకాలు.. సిరీల్స్, మిల్లెట్స్. సిరీల్స్ అనేవి ప్రధాన ధాన్యాలు. ఇవి ప్రపంచ వ్యాప్తంగా అధికంగా వినియోగంలో ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఆరు రకాలు. అవి.. వరి, గోధుమ, మొక్కజొన్న, బార్లీ, ఓట్స్, రై. తక్కువ వినియోగంలో ఉన్నవి మిల్లెట్స్. ఇవి జొన్న, సజ్జ, రాగి, కొర్రలు. పప్పుధాన్యాల ద్వారా ప్రొటీన్లు ఎక్కువగా లభిస్తాయి. శాకాహారులకు ఇవే ప్రధాన ప్రొటీన్ వనరులు. కంది, శనగ, మినుములు, పెసలు, బఠాణి, బీన్‌‌స, సోయాబీన్, వేరుశనగ ముఖ్యమైన పప్పు దినుసులు. నూనె గింజల్లో ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు అధికంగా లభిస్తాయి. వేరుశనగ, పొద్దు తిరుగుడు, కుసుమలు, ఆవాలు, నువ్వులు, పామాయిల్, కొబ్బరి మొదలైనవి ముఖ్య నూనె వనరులు. అవిసె నూనెను  ఆహారంలో అరుదుగా ఉపయోగిస్తారు.
 
 అయితే దీనికి అనేక పారిశ్రామిక అనువర్తనాలు ఉన్నాయి. మొక్కల్లో ఆహారం నిల్వ ఉన్న భాగాలను కూరగాయలని  పిలుస్తారు. పిండి పదార్థంతో పాటు నీరు, ఖనిజాలు, విటమిన్లు, కొద్దిగా పీచు వీటిలో లభిస్తాయి. మొక్కలోని వివిధ శరీర భాగాలు కూరగాయలుగా ఉప యోగపడతాయి.ఫలాలు అనేవి విత్తనం ఉన్న మొక్క భాగా లు. కొన్ని ఫలాల్లో విత్తనాలు ఉండవు. ఫలాల్లో తక్షణశక్తికి ఉపయోగపడే ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. అదనంగా ఖనిజాలు, విటమిన్లు, నీరు, పీచు లభిస్తాయి.
 
 ఫలాలు ప్రధానంగా రెండు రకాలు.
 1. సమశీతోష్ణ మండల ఫలాలు. ఉదా॥ఆపిల్, పియర్, స్ట్రాబెర్రీ, చెర్రీ మొదలైనవి.
 2. ఉష్ణమండల ఫలాలు. ఉదా॥మామిడి, దానిమ్మ, బొప్పాయి, నారింజ, బత్తాయి మొ॥
 నారపీచు వనరులు : ఆహారం తర్వాత అంతటి  ఉపయోగకరమైన మొక్క ఉత్పత్తులు నార పీచు. వివిధ మొక్క భాగాల నుంచి ఇవి లభిస్తాయి. విత్తన కవచ రోమాల నుంచి పత్తి లభిస్తుంది. హరప్పా కాలంనుంచి దేశంలో పత్తి సాగులో ఉంది. కాండంలోని పోషక కణజాలం నుంచి లభించే నారను ‘బాస్‌ఫైబర్’ అంటారు. జనపనార, అవిసెనార ఈ కోవకు చెందినది. మధ్య ఫల కవచం నుంచి కొబ్బరి పీచు లభిస్తుంది.
 
 కలప : మొక్క కాండం, కొమ్మల నుంచి కలప లభిస్తుంది. సాల, టేకు, వేప, తుమ్మ, రోజ్ వుడ్, దేవదారు, ఫైన్, కేన్ మొదలైనవి ముఖ్యమైన కలప వనరులు. వెదురు నుంచి 80 శాతం పేపరు తయారవుతుంది. మిగతా పేపరు.. గడ్డి, కలప, బగాిసీ నుంచి లభిస్తుంది.
 
 ఔషధ వనరులు : మనిషి అనాదిగా మొక్కల్లోని అనేక భాగాల ఔషధ విలువలను తెలుసుకొని వినియోగిస్తున్నాడు. చరకసంహితలో కొన్ని వేల మొక్కల ఔషధ వనరుల వర్ణన ఉంది. ఆయుర్వేదంలో వివరించిన మొక్కల సమా చారం, చరక సంహిత నుంచి  సంగ్రహించిందే. బెల్లడోనా, సర్పగంథ, అశ్వగంథ, ఇంగువ వేర్లలో ఔషధ విలువలు ఉన్నాయి. పసుపు, అల్లం, వెల్లుల్లి అనేవి కాండాలు. పసుపులోని కుర్కుమిన్‌లో అనేక ఔషధ విలువలు ఉన్నట్లు గుర్తించారు. సింకోనా మొక్క బెరడు నుంచి క్వినైన్ అనే మలేరియా నివారక మందు లభిస్తుంది. తులసి పత్రాలు, అలోవెరా (కలబంద) పత్రాలు, తమలపాకుల్లో ఔషధ రసాయనాలు లభిస్తాయి. నల్లమందులో నొప్పి నివారిణి రసాయనాలు ఉన్నాయి. వేప, జిన్సెంగ్ వంటి మొక్క శరీరమంతటా ఔషధ రసాయనాలు పుష్కలంగా లభిస్తాయి.
 
 మత్తు పదార్థాలు:
  కొన్ని మొక్కల భాగాలనుంచి సంగ్రహించే పదార్థాలను తీసుకొన్నపుడు మత్తు కలుగు తుంది. వీటిని అధికంగా వినియోగించి నప్పుడు శరీరం మొత్తం ప్రభావితమవుతుంది. క్రమంగా ఇది వ్యసనానికి దారి తీస్తుంది. వీటిలో పొగ పీల్చేవి.. ప్యుమటరీస్, నమిలేవి.. మ్యాస్టికేటరిస్. వివిధ రకాల తమలపాకులు, వక్క... ప్రధాన  మ్యాస్టికేటరీస్. పొగాకు, నల్ల మందు, గంజాయి, కొకైన్... ఫ్యుమటరీస్, మ్యాస్టికేటరీస్‌గానూ ఉపయోగపడతాయి.
 
 పానీయాలు(బేవరేజెస్): మొక్కల భాగాల నుంచి బేవరేజెస్ కూడా తయారవుతాయి. ఇవి రెండు రకాలు.. నాన్ ఆల్కహాలిక్, ఆల్కహాలిక్. కాఫీ, టీ, కొకోవా.. ముఖ్యమైన నాన్ ఆల్క హాలిక్ పానీయాలు. మత్తు (ఆల్కహాలిక్) పానీ యాలు రెండు రకాలు.. కిణ్వన పానీ యాలు, స్వేదన పానీయాలు. బీర్, వైన్ వంటివి కిణ్వన పానీయాలు. విస్కీ, బ్రాందీ, వోడ్కా వంటివి స్వేదన పానీయాలు.
 
 రబ్బరు: ప్రపంచవ్యాప్తంగా 98 శాతానికిపైగా రబ్బరు హెవియ బ్రెజేలియన్సిస్ అనే మొక్క నుంచి కారే ల్యాటెక్స్ ద్రవంతో తయార వుతుంది. సపోటా మొక్క ల్యాటెక్స్ నుంచి కూడా కొద్దిగా రబ్బరు తయారవుతుంది.
 
 రంగులు (డైస్):
 వస్త్రాలకు పూర్తిగా అతుక్కుపోయే రసాయ నాలు రంగులు. ఇవి కాంతి లేదా నీటి వల్ల తొందరగా నశించవు. మొక్కల వివిధ భాగా లు, వేర్లు, పత్రాలు, బెరడు, ఫలాలు, కలప నుంచి రంగులు లభిస్తాయి. ఇండిగో, గోరింటాకు, దేవదారు, టేకు, కుంకుమ పువ్వు, కుసుమ పువ్వు నుంచి ఎక్కువగా రంగులను తయారు చేస్తారు.
 
 శక్తి వనరులు: అనేక  మొక్కలు మనిషికి వంట చెరుకుగా ఉపయోగపడుతున్నాయి.  అంతే కాక, జట్రోపా కర్కస్ (నేపాళం), పొంగా మియా పిన్నాట (కానుగ) వంటి మొక్కల గింజల నుంచి సంగ్రహించిన నూనెను రసాయన మార్పునకు గురిచేసినప్పుడు బయో డీజిల్ వంటి జీవ ఇంధనం లభిస్తుంది. దీన్ని డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా లేదా డీజిల్‌తో కలిపి నియోగించడానికి వీలవుతుంది.
 
 మసాలా దినుసులు: ఆహారం రంగును, రుచిని పెంచే మొక్క ఉత్పత్తులు మసాలా దినుసులు. వీటిలో పెద్దగా పోషక విలువలు ఉండవు అయితే ఔషధ గుణాలు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి పసుపు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కుంకుమపువ్వు, ఆవాలు, యాలకులు మొ॥
 సుగంధ ద్రవ్యాలు: కొన్ని మొక్కల పత్రాలు, పుష్పాల నుంచి సుగంధ ద్రవ్యాలు లభిస్తాయి. వీటిని పెర్‌ఫ్యూమ్స్‌లో ఉపయోగిస్తారు.
 
  వేరు కూరగాయలు     క్యారెట్, బీట్‌రూట్,     ముల్లంగి.
  కాండం కూరగాయలు     ఉల్లి,కంద, చామగడ్డ
  మొగ్గ కూరగాయలు     క్యాబేజి
  ఫల కూరగాయలు     వంకాయ, టమోటా      సొరకాయ, పొట్ల, బీరకాయ, కాకర
 ఆకు కూరలు కూడా కూరగాయలే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement