జనరల్ సైన్స్ | general studies | Sakshi
Sakshi News home page

జనరల్ సైన్స్

Published Mon, Sep 2 2013 11:17 PM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM

జనరల్ సైన్స్

జనరల్ సైన్స్

వన్య జీవుల పరిరక్షణ
  మనిషి అభివృద్ధి చర్యల కారణంగా వన్యజీవులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అనేక వన్యజీవులు విలుప్తత దశకు చేరాయి. ఆవాసాల క్షీణత, ఆహార సేకరణ కోసం పర్యావరణ విధ్వంసం, కాలుష్యం, సహజ ఆవాసాల్లోకి కొత్త జాతుల ప్రవేశం, శీతోష్ణస్థితుల్లో మార్పుల వల్ల వన్యప్రాణులు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదముంది. 20వ శతాబ్దం ప్రారంభంలో భారత్‌లో 40,000 పులులు ఉండగా, 2010 నాటికి వాటి సంఖ్య 1706కు పడిపోయింది. ఆసియా చీతా వంటివి దేశంలో పూర్తిగా అంతరించిపోయాయి. తమ సహజ ఆవాసాల్లో జీవావరణ సమతుల్యతను కాపాడే ఈ పరభక్షక జంతువులు అంతరిస్తే ఎడారీకరణ సంభవించే ప్రమాదముంది. ఈ పరిణామం మనిషి ఉనికికే ముప్పుగా పరిణమిస్తుంది.  మనిషి అంతరిస్తే ప్రకృతికి ఎలాంటి నష్టం వాటిల్లదు. కానీ వన్యప్రాణులు నశిస్తే ప్రకృతితోపాటు మనిషి మనుగడ కూడా ప్రమాదంలో పడుతుంది.
 
 స్విట్జర్లాండ్‌లోని గ్లాండ్ నగరంలో ఉన్న ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్(ఐయూసీఎన్).. వన్యజీవులు ఎదుర్కొంటున్న ప్రమాద తీవ్రత బట్టి వాటిని అనేక రకాలుగా విభజిస్తుంది.అంతరించిన ప్రాణులు: భూమిపై ఒక జాతికి చెందిన చిట్టచివరి జీవి కూడా చనిపోయిందని నిస్సందేహంగా ఖరారైనప్పుడు ఆ జాతి        అంతరించినట్లు నిర్ధారిస్తారు. ఉదా: ఆసియా చీతా, ఊదారంగు తల బాతు, డోడో పక్షి.
 
 సహజ ఆవాసాల్లో అంతరించిన ప్రాణులు:  ఇవి మనిషి నిర్బంధ సంరక్షణలో తప్ప సహజ ఆవాసాల్లో ఎక్కడా కనిపించని జీవ జాతులు.
 ప్రమాదపుటంచుల్లో ఉన్నవి: ఇవి దాదాపు అంతరించే స్థాయికి చేరిన వన్యప్రాణులు. మనిషి ప్రత్యక్షంగా సంరక్షిస్తే తప్ప వాటి మనుగడ సాధ్యం కాని జీవజాతులు. ఉదా: కృష్ణ జింక, ఇండియన్ రైనో, లయన్ టెయిల్డ్ మకాక్, ఇండియన్ వైల్డ్ ఆస్.
 అంతరించే ప్రమాదమున్నవి: ఇవి ఆవాసాల క్షీణత, పర్యావరణ దుర్వినియోగం, వేట మొదలైన కారణాల వల్ల ప్రమాదంలో పడినవి. ఉదా: ఏసియాటిక్ ఏనుగు, బ్లూ షీప్.
 సమాచారం లేనివి (డేటా డెఫిసియంట్): అధ్యయనంలో ఉన్నప్పటికీ, తగినంత సమాచారం అందుబాటులో లేకపోవడం వల్ల ఇంకా ఏ విభాగంలోకి వర్గీకరించని వన్యప్రాణులను ఈ జాబితాలో చేర్చారు.
 స్థానీయ జాతులు: భౌగోళికంగా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై, మిగతా ప్రాంతాల్లో ఎక్కడా లేనివి స్థానీయ జాతులు. ఇప్పటికిప్పుడు వీటికి ప్రమాదం లేనప్పటికీ, కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కావడం వల్ల అక్కడ ఏ ప్రమాదం సంభవించినా పూర్తిగా అంతరిస్తాయి. ఉదా: గాం జిటెక్ డాల్ఫిన్, ఘరియాల్, అండమాన్ పంది.
 
 వన్య జీవుల పరిరక్షణ చర్యలు:
 అంతర్జాతీయ స్థాయి పరిరక్షణ చర్యలు
 ప్రపంచవ్యాప్తంగా వన్యజీవులు ఎదుర్కొంటున్న ప్రమాదాల తీవ్రతను బట్టి వాటిని వర్గీకరించే విధానాన్ని ఐయూసీఎన్ 1963లో ప్రారంభించింది. అంతరించే ప్రమాదం ఉన్న జీవజాతుల జాబితాను ఈ సంస్థ ఏటా ప్రచురిస్తుంది.
 
 2012 జూన్‌లో ఐయూసీఎన్ తన తొలి జాబితా ‘రెడ్ లిస్ట్’ను విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన 72 జంతుజాతులను క్రిటికల్లీ ఎండేంజర్‌‌డగా గుర్తించారు. వీటిలో 18 ఉభయచర, 14 చేపలు, 10 క్షీరదాల జాతులు ఉన్నాయి. 15 పక్షి జాతులను కూడా ఈ విభాగంలో చేర్చారు. 69 చేపల, 38 క్షీరదాల, 32 ఉభయచర జాతులను ఎండేంజర్‌‌డగా గుర్తించారు.
 
 వన్యజీవుల ఆవాసాలను, అక్కడి తెగల సంప్రదాయాలను, చారిత్రక కట్టడాలను సంరక్షించే లక్ష్యంతో 1970లో యునెస్కో.. మ్యాన్ అండ్ బయోస్ఫియర్(మాబ్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా వివిధ దేశాల్లో ప్రమాదం అంచున ఉన్న వన్యజీవుల ఆవాసాలను బయోస్ఫియర్ రిజర్‌‌వలుగా గుర్తించి పరిరక్షిస్తారు.
 
 వివిధ దేశాల మధ్య వన్యజీవుల, వాటి భాగాల రవాణాను నిరోధించే లక్ష్యంతో 1975 లో కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్‌‌డ స్పెసీస్ ఫ్లోరా అండ్ ఫౌనా (ఇఐఖీఐఉ) అనే అంతర్జాతీయ ఒప్పందం అమల్లోకి వచ్చింది.
 
 ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్య పరిరక్షణకు ఉద్దేశించిన కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ (ఇఆఈ) అనే అంతర్జాతీయ ఒప్పందం 1993 డిసెంబర్ 29న అమల్లోకి వచ్చింది.
 
 ఈ ఒప్పందాలన్నింటిపై భారత్ సంత కాలు చేసి వన్యజీవుల పరిరక్షణకు కృషి చేస్తోంది. ప్రధానమంత్రి అధ్యక్షతన పనిచేసే నేషనల్ బోర్‌‌డ ఫర్ వైల్డ్‌లైఫ్ (ూఆగిఔ) వన్యజీవుల పరిరక్షణ విధానాలను రూపొందించి, అమలు చేస్తుంది. వన్యజీవుల పరిరక్షణ ఒక సరికొత్త కార్యాచరణ ప్రణాళిక, నేషనల్ వైల్డ్‌లైఫ్ యా క్షన్ ప్లాన్ (ూగిఅ్క)ను 2002లో ప్రారంభించారు. ఇది 2016 వరకు అమల్లో ఉంటుంది.
 
 వన్యజీవుల పరిరక్షణకు రక్షిత ప్రాంతాల కార్యక్రమాన్ని భారత్ అమలు చేస్తోంది. దేశ భౌగోళిక ప్రాంతంలో 4.9 శాతం మేరకు భూభాగంలో 668 రక్షిత ప్రాంతాలను ఇప్పటి వరకు ఏర్పాటు చేశారు. వీటిలో 102 జాతీయ పార్కులు, 515 అభయారణ్యాలు, 47 కన్జ ర్వేషన్ రిజర్వ్‌లు, 4 కమ్యూనిటీ రిజర్వ్‌లు ఉన్నాయి.
 వీటికి అదనంగా పులుల సంరక్షణకు 39 టైగర్ రిజర్వులను, ఏనుగు సంరక్షణకు ఎలిఫెంట్ రిజర్వులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
 
 వన్యజీవుల దుర్వినియోగాన్ని నియం త్రించే లక్ష్యంతో వన్యజీవుల సంరక్షణ చట్టం 1972 నుంచి అమల్లో ఉంది. దీనిలో ఎప్పటికప్పుడు సవరణలు కూడా చేశారు. వన్యజీవుల సంరక్షణకు రూపొందించి అమల్లోకి తీసుకువచ్చిన ఇతర చట్టాలు... అటవీ సంరక్షణ చట్టం-1980 (1988లో సవరణ), పర్యావరణ పరిరక్షణ చట్టం-1986, జీవ వైవిధ్య చట్టం-2002, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్‌‌స(ఖ్ఛఛిౌజజ్టీజీౌ ౌజ ఊౌట్ఛట్ట ఖజీజజ్టిట) చట్టం-2006. వన్యజీవులపై నేరాలను అరికట్టడానికి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో... కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తుంది.
 
 అంతర్జాతీయ స్థాయిలో వన్యజీవుల పరిరక్షణకు అవసరమైన నిధుల సేకరణకు వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (గిగిఊూ) కృషి చేస్తోంది.
 
 జాతీయ పార్కు:  ఎలాంటి మానవ చర్యలను అనుమతించని, కేవలం వన్యజీవుల పరిరక్షణకు మాత్రమే ఉద్దేశించిన రక్షిత ప్రాంతాన్ని జాతీయ పార్కు అంటారు. వ్యవసాయం, పశువులను మేపడం, ఇళ్ల నిర్మాణం,  కలప సేకరణ వంటి చర్యలను జాతీయపార్కులో అనుమతించరు.
 
 అభయారణ్యం: వన్యజీవుల పరిరక్షణకు, ముఖ్యంగా ఒక ప్రత్యేక జాతి పరిరక్షణకు ఉద్దేశించిన రక్షిత ప్రాంతమే అభయారణ్యం.  ఇక్కడ వన్యజీవుల మనుగడకు భంగం వాటిల్లని స్థాయిలో కలప సేకరణ, ఇతర అటవీ ఉత్పత్తుల సేకరణను అనుమతిస్తారు.
 
 బయోస్ఫియర్ రిజర్‌‌వ: ఒక భౌగోళిక ప్రాంతంలోని వన్యజీవుల పరిరక్షణతో పాటు అక్కడి సహజ ఆవాసాలు, స్థానిక తెగల సంప్రదాయాలు, చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి ఏర్పాటయ్యే రక్షిత ప్రాంతమే బయోస్ఫియర్ రిజర్‌‌వ. సాధారణంగా బయోస్ఫియర్ రిజర్వ్‌ను వివిధ భాగాలుగా విభజించి వన్యజీవుల సంరక్షణ చర్యలను నిర్వహిస్తారు.
 
 కన్జర్వేషన్ రిజర్‌‌వ: సాధారణంగా జాతీయ పార్కులు, అభయారణ్యాలకు దగ్గరగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో రాష్ర్ట ప్రభుత్వాలు ఏర్పాటు చేసే రక్షిత ప్రాంతమే కన్జర్వేషన్ రిజర్‌‌వ. సాధారణ ప్రజలతో చర్చించిన తర్వాత మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ స్థానిక ప్రజల హక్కులకు భంగం వాటిల్లదు.
 కమ్యూనిటీ రిజర్‌‌వ: స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు వారికి చెందిన ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు దాన్ని కమ్యూనిటీ రిజర్‌‌వ అంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement