కెరీర్ కౌన్సెలింగ్ | Career counseling | Sakshi
Sakshi News home page

కెరీర్ కౌన్సెలింగ్

Published Thu, May 5 2016 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM

కెరీర్ కౌన్సెలింగ్

కెరీర్ కౌన్సెలింగ్

ప్రిపరేషన్
ప్రిపరేషన్‌కు ప్రతి సబ్జెక్టుకు సంబంధించి సినాప్సిస్‌తో నోట్స్ రూపొందించుకోవాలి. ఇది చివరి దశలో క్విక్ రివిజన్‌కు ఉపయోగపడుతుంది.
క్లిష్టమైన అంశాలను చదివేటప్పుడు గ్రూప్ స్టడీ వల్ల ప్రయోజనం ఉంటుంది.మోడల్ టెస్ట్‌లు రాయాలి. దీనివల్ల పరీక్ష       సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.తెలిసిన అంశాల నుంచి కూడా ఊహించని విధంగా పరోక్షంగా ప్రశ్నలు ఎదురుకావొచ్చు. అందువల్ల ఇంపార్టెంట్ అనే దృక్పథాన్ని విడిచిపెట్టి, ప్రతి అంశాన్ని వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి.పరీక్షకు ముందు కొంత సమయాన్ని రివిజన్‌కు కేటాయించాలి. ఆ సమయంలో కొత్త విషయాలను నేర్చుకునేందుకు ప్రయత్నించకూడదు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - కాన్పూర్
ప్రవేశం: జేఈఈ-అడ్వాన్స్‌డ్ ఆధారంగా.
వివరాలకు: www.iitk.ac.in
యూనివర్సిటీ ఆఫ్ ఎనర్జీ అండ్ పెట్రోలియం స్టడీస్ (యూపీఈఎస్)- డెహ్రాడూన్.
అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (ఎంపీసీ) తోపాటు 10వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లలో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
వివరాలకు: www.upes.ac.in

బీటెక్ (మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?ఙఞ్చట- రవి, విజయనగరం.

బయోటెక్నాలజీలో ఒక స్పెషలైజేషన్‌గా జెనెటిక్ ఇంజనీరింగ్‌ను బోధిస్తున్నారు. మెడిసిన్, డ్రగ్ డెవలప్‌మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ వంటి వివిధ రంగాల్లో ఈ సబ్జెక్టు అప్లికేషన్స్ ఉన్నాయి. జెనెటిక్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్‌తో బీటెక్‌ను అందించే సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయి.
 తమిళనాడులోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం.. జెనెటిక్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ను అందిస్తోంది.

అర్హత: ఇంటర్మీడియెట్ బైపీసీ ఉత్తీర్ణత.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్:  www.srmuniv.ac.in
బీటెక్ బయోటెక్నాలజీ అందించే ఇన్‌స్టిట్యూట్‌లు:  
విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. బయోటెక్నాలజీలో బీటెక్‌ను అందిస్తోంది.
అర్హత: ఇంటర్మీడియెట్/+2.
ప్రవేశం: ఎంసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

జెనెటిక్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?    
- చంద్ర, గుంటూరు.


వివిధ అంశాలకు సంబంధించిన బేసిక్స్‌పై ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు ప్రాక్టికల్ పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో రైతులకు ఉపయోగపడే స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. కొత్త వంగడాలు, అధిక దిగుబడుల సాధనకు మార్గాలు, ఏ పంటకు ఏ ఎరువు వేయాలి? వేయకూడదు? విత్తన చట్టం.. తదితర ప్రాథమిక అంశాలను విస్మరించకూడదు. డిప్లొమా స్థాయిలో అంశాలను కచ్చితత్వంతో చదివితే మంచి ఫలితం ఉంటుంది.
డా. డి.విష్ణువర్ధన్‌రెడ్డి,
అసోసియేట్ డీన్,
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement