తేనెసోకనోరు తీయనగురీతిలో...! | DSC exam special | Sakshi
Sakshi News home page

తేనెసోకనోరు తీయనగురీతిలో...!

Published Fri, Sep 12 2014 8:25 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

DSC exam special

కవులూ - కావ్యాలు

ఈ అధ్యాయంలో కవులూ - రచయితలూ - కావ్యాలూ - రచనలు - పాత్రలు - నేపథ్యం - పూర్వాపరాలు- ఇతివృత్తాలు- సందర్భ వాక్యాలూ, విశేషాంశాలు వంటి అంశాలు చాలా ముఖ్యమైనవి. గత డీఎస్సీలో పై అంశాల నుంచి 11 ప్రశ్నలు అడిగారు. శివకవి యుగం ఎంతో ముఖ్యమైంది. ‘పాల్కూరికి సోమన’పై నాలుగు ప్రశ్నలు అడిగారు.
 
1.    కన్నడంలో జైన పురాణ శిల్ప ప్రభావంతో వెలసిన తెలుగు దేశీయ పురాణం?
     1) మత్స్యపురాణం
     2) మార్కండేయ పురాణం
     3) బసవ పురాణం    4) వరాహ పురాణం
     సమాధానం: 3
2.    సంస్కృతం, తెలుగులో ఉదాహరణ కావ్యాన్ని రచించిన మొదటి తెలుగు కవి?
     1) పాల్కూరికి సోమన
     2) పింగళి సూరన    3) పిడపర్తి సోమన
     4) నాచన సోమన
     సమాధానం: 1
 3.    మకుటాన్నీ, సంఖ్యా నియమాన్ని పాటించిన మొదటి తెలుగు శతకం?
     1) కాళహస్తీశ్వర శతకం
     2) భాస్కర శతకం    3) శివతత్త్వసారం
     4) వృషాధిపశతకం
     సమాధానం: 4
 4.    ‘అంగిట ముల్లొత్తు’ అనే ప్రయోగ సందర్భం?
     1) పరమేశుని స్నానం చేయించే సందర్భం
     2) పరమేశుని ఆటలాడించే సందర్భం
     3) పరమేశుని నిద్ర పుచ్చే సందర్భం
     4) దేవుడికి అన్నం తినిపించే సందర్భం
     సమాధానం: 1
     వివరణ: ఈ సందర్భం బసవపురాణంలో బెజ్జమహాదేవి కథలోనిది.
 
 కవిత్రయం కవులకు సంబంధించి ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడగవచ్చు. గత డీఎస్సీలో తిక్కన గురించి రెండు ప్రశ్నలు ఇచ్చారు.
 5.    రసాభ్యుచిత బంధానికి ఏ కవి పెట్టింది పేరు?
     1) ఎర్రన    2) పోతన
     3) నన్నయ    4) తిక్కన
     సమాధానం: 4
     కవిత్రయం కవితాగుణాలపై సమగ్ర అవగాహన ఉండాలి.
 6.    తిక్కన భారతంలో ‘చివరి పర్వం’?
     1) మహాప్రస్థాన పర్వం
     2) మౌసల పర్వం
     3) స్వర్గారోహణ పర్వం
     4) అశ్వమేథ పర్వం
     సమాధానం: 3
     భారతంలో పర్వాలు, రామాయణంలో కాండలు, భాగవతంలో స్కంధాలను వరస క్రమంలో గుర్తుంచుకోవాలి.
 
 శ్రీనాథుడిపై ప్రశ్న అడిగే అవకాశం ఉంది. గత డీఎస్సీలో అడిగిన ప్రశ్న:
 7.    ‘కాళీనందనకంఠేకాలుర శిరములకు విరులు కల్పించునొకో?’ ఇది ఎవరు ఎవరితో అన్నారు?
     1) అగస్త్యుడు వ్యాసునితో
     2) వ్యాసుడు అగస్త్యునితో
     3) అగస్త్యుడు లోపాముద్రతో
     4) వ్యాసుడు భీమేశ్వరునితో
     సమాధానం: 1
     }నాథుడి కావ్యాల్లో పాత్రలు, సన్నివేశాలపై అవగాహన ఉండాలి.
     {పబంధ యుగం నుంచి ఒకటి లేదా రెండు ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది. గత డీఎస్సీలో 3 ప్రశ్నలు ఇచ్చారు. వాటిలో అల్లసాని పెద్దనకు సంబంధించి రెండు ప్రశ్నలున్నాయి.
 8.    ‘శిరీష కుసుమ పేశల సుధామయోక్తులతో’ కవిత చెప్పినవారు?
     1) తెనాలి రామకృష్ణుడు
     2) మాదయగారి మల్లన
     3) అల్లసాని పెద్దన    4) నంది తిమ్మన
     సమాధానం: 3
     {పబంధ కవుల కవితా శైలి, రీతులపై అవగాహన ఉండాలి
 9.    {పవరుని పాత్ర ద్వారా తెలిసే అంశం?
     1) ప్రవరుడు స్త్రీ ద్వేషి
     2) ప్రవరుడు ఉత్తమ సంభాషణాశీలి
     3) ప్రవరుడు ఉత్తమ గృహస్థుడు
     4) ప్రవరుడు ఉత్తమ తైర్థికుడు
     సమాధానం: 3
     {పబంధ కవుల పాత్రలపై సమగ్రమైన అవగాహన అవసరం
 10.    ‘చోళలింగపురం’ - స్థల పురాణాన్ని వర్ణించే కావ్యం?
     1) ఘటికాచల మహాత్మ్యం
     2) పల్నాటి వీరచరిత్ర
     3) పాండురంగ మహాత్మ్యం
     4) ఉద్భటారాధ్య చరిత్ర
     సమాధానం: 1
     {పబంధాల్లో కావ్యాల్లో ఇతివృత్తాలను తెలుసుకోవటం అవసరం. పదకవులపై కూడా ప్రశ్నలు వస్తాయి.
 11.    ‘కన్నడ దాస పదావళి’ వంటివి తెలుగులో?
     1) ఉదాహరణ    2) దండకం
     3) అన్నమయ్య పదకవితలు
     4) వేంకటేశ్వర వచనములు
     సమాధానం: 3
     దక్షిణాంధ్ర యుగంలో రఘునాథ నాయకుడు, విజయ రాఘవ నాయకుడు, చేమకూర వెంకటకవి, రంగాజమ్మ, ముద్దు పళని వంటి వారిపై ప్రశ్నలు రావచ్చు.
 
 మాదిరి ప్రశ్నలు
 1.    నన్నయను భారతాంధ్రీకరణకు ప్రేరేపిం చిన రాజు?
     1) మనుమసిద్ది    2) రాజరాజ నరేంద్రుడు
     3) ప్రోలయ వేమారెడ్డి
     4) పెదకోమటి వేమారెడ్డి
 2.    నన్నయ ఆంధ్ర మహాభారత రచనా కాలం?
     1) క్రీ.శ. 1022-30    2) క్రీ.శ. 1050-60
     3) క్రీ.శ. 1054-61    4) క్రీ.శ. 1040-50
 3.    నన్నయకు భారతాంధ్రీకరణలో సహకరిం చిన లేఖకుడు?
     1) నారాయణ భట్టు    2) బేతన భట్టు
     3) గణపతి    4) గురునాథుడు
 4.    నన్నయ భారతావతారక ఏ పురుషలో ఉంది?
     1) ఉత్తమ    2) ప్రథమ
     3) మధ్యమ    4) అన్య
 5.    నన్నయను వాగానుశాసనుడిగా ప్రశంసించిన కవి?
     1) మారన    2) తిక్కన
     3) ఎర్రన    4) రామరాజ భూషణుడు
 6.    {Oతెలోక్యమల్ల దేవర రాయబారాన్ని నిర్వహించిన కవి ఎవరు?
     1) వేములవాడ భీమన    2) నన్నయ
 
     3) తిక్కన    4) ఎర్రన
 7.    ‘సూనృత వాక్యము మేలు సూడగన్’ - ఏ ఉపాఖ్యానంలోనిది?
     1) ఉదంక    2) నల
     3) శకుంతల    4) సౌపర్ణ
 8.    మందపాలుని భార్య?
     1) జరిత    2) కద్రువ
     3) వినత    4) సావిత్రి
 9.    గరుత్మంతుని తల్లి?
     1) కద్రువ    2) వినత
     3) కుంతీ    4) గాంధారి
 10.    ‘అవ్విభునకు గట్టెద పట్టమ ప్రతిభ కావ్య కవిత్వ మహావిభూతికిన్’ - అనే తిక్కన వాక్యంలో ‘అవ్విభుండు’?
     1) హరిహరనాథుడు
     2) కొమ్మన దండనాథుడు
     3) మనుమసిద్ధి
     4) మంత్రి భాస్కరుడు
 11.    తిక్కనకు ‘ఉభయకవి మిత్రుడు అనే బిరుదు ప్రకటించిన కవి?
     1) మారన    2) మంచన
     3) బయ్యన    4) కేతన
 12.    కింది వాటిలో తిక్కన కవితా గుణాలు?
     1) వర్ణనాశిల్పం - పాత్ర చిత్రణ
     2) నాటకీయత - వ్యంగ్య వైభవం
     3) అక్షర రమ్యత - ప్రసన్న కథనం
     4) సూక్తి వైచిత్రి - అలంకారిక ప్రీతి
 13.    సరసిజనాభ! యిన్నిట ప్రశస్తికి నెక్కిన దాన నెంతయున్ - అని పలికిన పాత్ర?
     1) ద్రౌపది    2) సుభద్ర
     3) సత్యభామ    4) కుంతీ
 14.    ఆంధ్ర మహా భారతంలో ‘గీతోపదేశం’ ఉన్న పర్వం?
     1) ద్రోణ పర్వం    2) భీష్మ పర్వం
     3) కర్ణ పర్వం    4) అరణ్య పర్వం
 15.    {పథమాంధ్ర పురాణం?
     1) విష్ణు పురాణం    2) బసవ పురాణం
     3) మార్కండేయ పురాణం
     4) గరుడ పురాణం
 16.    మార్కండేయ పురాణ కృతిపతి?
     1) తిక్కన    2) కేతన
     3) మంచన    4) నాగయగన్న మంత్రి
 17.    కేయూర బాహు చరిత్రకు మూలం?
     1) విద్ధసాలభంజిక
     2) నిర్వచనోత్తర రామాయణం
     3) దశకుమార చరిత్ర
     4) భోజ రాజీయం
 18.    ‘మృగాంకావళి’ ఏ కావ్యంలో నాయిక?
     1) దశకుమార చరిత్ర    2) మనుచరిత్ర
     3) కేయూర బాహు చరిత్ర
     4) శృంగార నైషధం
 19.    తెలుగులో ‘వస్తుకవిత’ పదాన్ని తొలిసా రిగా ప్రయోగించిన కవి?
     1) నన్నయ    2) నన్నెచోడుడు
     3) పాల్కూరికి సోమనాథుడు    4) తిక్కన
 20.    తెలుగులో తొలి ఉదాహరణ కావ్యం?
     1) గోపాలోదాహరణం
     2) నాగేశ్వరోదాహరణం
     3) బసవోదాహరణం
     4) పరమేశ్వరోదాహరణం
 21.    కన్నడ జైన పురాణ శిల్ప ప్రభావంతో తెలుగులో వచ్చిన దేశీయ పురాణం?
     1) మార్కండేయ పురాణం
     2) బసవ పురాణం
     3) వరాహ పురాణం    4) మత్స్యపురాణం
 22.    ‘సంవిధాన చక్రవర్తి’ బిరుదున్న కవి?
     1) పాల్కూరికి సోమన
     2) శ్రీనాథుడు    3) నాచన సోమన
     4) అల్లసాని పెద్దన
 23.    తెలుగులో తొలి క్షేత్ర మాహాత్మ్య గ్రంథం?
     1) కాశీఖండం    2) నృసింహపురాణం
     3) భీమేశ్వర పురాణం
     4) ఘటికాచల మహాత్మ్యం
 24.    కాశీక్షేత్ర మహిమను తెలిపే తెనాలి రామకృష్ణుని గ్రంథం?
     1) ఉద్భటారాధ్య చరిత్ర
     2) పాండురంగ మహాత్మ్యం
     3) హరిలీలావిలాసం
     4) ఘటికాచల మహాత్మ్యం
 25.    శృంగార నైషధ కృతిపతి?
     1) బెండపూడి అన్నయ మంత్రి
     2) మామిడి సింగన
     3) అవచితిప్పయ్య శెట్టి
     4) సింగభూపాలుడు
 26.    కింది వాటిలో హంస దౌత్యం ఉన్న కావ్యం?
     1) హర విలాసం    2) వసు చరిత్ర
     3) శృంగార నైషధం    4) కళాపూర్ణోదయం
 27.    కింది వాటిలో వీరగాథా కావ్యం?
     1) బాలనాగమ్మ కథ
     2) పండితారాధ్య చరిత్ర
     3) పలనాటి వీర చరిత్ర
     4) క్రీడాభిరామం
 28.    ‘పరమేశ! గంగ విడువుము పార్వతి చాలున్’ అని పలికిన చాటు కవి?
     1) పోతన    2) శ్రీనాథుడు
     3) పెద్దన    4) తెనాలి రామకృష్ణుడు
 29.    డిండిమభట్టు అసలు పేరు?
     1) భీమకవి    2) ఉద్ధండకవి
     3) వజ్రనాభకవి    4) అరుణగిరినాథుడు
 30.    ‘తేనెసోకనోరు తీయనగురీతి’లో పద్యరచన ఉండాలన్న కవయిత్రి?
     1) తిమ్మక్క    2) మొల్ల
     3) మధురవాణి    4) రంగాజమ్మ
 31.    ‘కీర్తింతురేద్దాని గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి’ - ఏ కావ్యంలోది?
     1) క్రీడాభిరామం    2) పల్నాటి వీరచరిత్ర
     3) భీమేశ్వర పురాణం    4) కాశీఖండం
 32.    ‘వాణి నా రాణి’ అని సగర్వంగా పలికిన కవి?
     1) శ్రీనాథుడు    2) పోతన
     3) నాచన సోమన
     4) పిల్లలమర్రి పిన వీరభద్రుడు
 33.    తెలుగు సాహిత్యంలో తొలి జంట కవులు?
     1) తిరుపతి వెంకటకవులు
     2) కొప్పరపు కవులు
     3) నందిమల్లయ ఘంటసింగనలు
     4) వెంకట పార్వతీశ్వర కవులు
 34.    కుమార భారతి బిరుదున్న కవి?
     1) మంచన     2) మారన
     3) నందితిమ్మన    4) తెనాలి రామకృష్ణుడు
 35.    ‘చందమామ రావే! జాబిల్లి రావే’! గేయ రచయిత?
     1) త్యాగయ్య    2) అన్నమయ్య
     3) క్షేత్రయ్య    4) కంచర్ల గోపన్న
 36.    భవ్య భారతి బిరుదున్న కవి?
     1) బయ్యన    2) జక్కన
     3) మారన    4) కేతన
 37.    నాసికేతోపాఖ్యాన గ్రంథకర్త?
     1) ముక్కుతిమ్మన    2) దగ్గుపల్లి దుగ్గన
     3) గౌరన    4) కేతన
 38.    ‘పదకవితా పితామహుడు’ బిరుదున్న కవి?
     1) క్షేత్రయ్య    2) త్యాగయ్య
     3) అన్నమయ్య    4) పురంధరదాసు
 39.    తెలుగులో ‘కొక్కోక శాస్త్ర’ పద్య గ్రంథకర్త?
     1) శ్రీనాథుడు    2) మడికి సింగన
     3) కూచిరాజు ఎర్రన    4) పోతన
 40.    కుమారగిరి రెడ్డి రాసిన ‘వసంత రాజీయం’ అనే గ్రంథం?
     1) సంగీత శాస్త్రం    2) నాట్య శాస్త్రం
     3) అలంకార శాస్త్రం    4) శిల్ప శాస్త్రం
 
 సమాధానాలు
     1) 2;    2) 3;    3) 1;    4) 2;    5) 4;
     6) 2;    7) 3;    8) 1;    9) 2;    10) 3;
     11) 4;    12) 2;    13) 1;    14) 2;    15) 3;
     16) 4;    17) 1;    18) 3;    19) 2;    20) 3;
     21) 2;    22) 3;    23) 2;    24) 1;    25) 2;
     26) 3;    27) 3;    28) 2;    29) 4;    30) 2;
     31) 3;    32) 4;    33) 3;    34) 4;    35) 2;
     36) 1;    37) 2;    38) 3;    39) 3;    40) 2.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement