first day ఇన్ కాలేజ్ | first day in college | Sakshi
Sakshi News home page

first day ఇన్ కాలేజ్

Published Sun, Aug 21 2016 12:49 AM | Last Updated on Fri, Oct 5 2018 9:08 PM

first day ఇన్ కాలేజ్ - Sakshi

first day ఇన్ కాలేజ్

 క్యాంపస్  లైఫ్
 క్యాంపస్ గురించి..

 కాలేజ్ అంటేనే క్యాంపస్, అందులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, లైబ్రరీ, ఆడిటోరియం, ల్యాబ్స్, క్యాంటీన్, క్లాస్ రూమ్‌లు ఇలా ఎన్నో ఉంటాయి. మొదటి రోజు కాలేజీకి కాస్త ముందుగానే చేరుకొని, క్యాంపస్ అంతా కలియతిరగాలి. ఏవి ఎక్కడెక్కడున్నాయో ముందే తెలుసుకుంటే సగం కంగారు తగ్గుతుంది.
 
 నోట్‌బుక్స్ తప్పనిసరి..
 ఫస్ట్ డే కాలేజీకి వెళ్లేటప్పుడు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం.. నోట్ బుక్స్ తీసుకెళ్లడం. కాలేజీ మొదటి రోజు ఏముంటుంది.. ఇంట్రడక్షనే కదా! బుక్స్ ఎందుకు? అని చాలామంది వట్టి చేతుల్తో వెళ్తారు. అలాకాకుండా కనీసం ఒకటి రెండు నోట్‌బుక్స్, పెన్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. మరీ ఖాళీగా వెళితే ప్రొఫెసర్లకు మీపై నెగటివ్ ఇంప్రెషన్ కలిగే ప్రమాదం ఉంది.
 
 ప్రొఫెసర్స్‌తో మాటామంతీ..
 క్యాంపస్‌లో వేల మంది.. క్లాస్‌రూంలో పదుల మంది.. అందరిలో మీరూ ఒకరిలా కాకుండా కాస్త ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా మీ ప్రొఫెసర్స్ దృష్టిలో పడాల్సిందే. ప్రొఫెసర్స్‌కు మిమ్మల్ని పరిచయం చేసుకోండి. అర్థవంతమైన ప్రశ్నలు వేసి మీపై మంచి ఇంప్రెషన్ కలిగేలా ప్రవర్తించండి. భవిష్యత్తులో పాఠాల విషయంలో బెరుకు లేకుండా సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది.  
 
 సిలబస్ నోట్ చేసుకోండి...
 సాధారణంగా చాలా కాలేజీల్లో ఫస్ట్ డేని సిలబస్ డేగా పరిగణిస్తారు. సిలబస్ గురించి ప్రొఫెసర్ చెప్పే అన్ని అంశాల్ని తప్పనిసరిగా నోట్ చేసుకోండి. అందులో పేర్కొన్న అంశాల వారీగానే సెమిస్టర్ అంతా తరగతులు నిర్వహిస్తారు. దీనివల్ల భవిష్యత్తులో బోధించే పాఠ్యాంశాలకు సంబంధించి ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది.
 
 డ్రెస్సింగ్ సెన్స్..
 ఫస్ట్ డే కాలేజీకి వెళ్లేటప్పడు తప్పక గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం.. డ్రెస్సింగ్ సెన్స్. మరీ స్టైలిష్‌గా ఉండాలని మీకు నప్పని దుస్తులు వేసుకొని అపహాస్యం  కావద్దు. మీ బాడీ లాంగ్వేజ్‌కు తగిన వాటిని ఎంపిక చేసుకొని హుందాగా కనిపించేలా చూసుకోవాలి. అలాగని సింపుల్‌గా ఉండాలనే ఉద్దేశంతో మరీ రొటీన్‌గా కూడా వెళ్లొద్దు. కాలేజీకి అవసరమయ్యే డ్రెసెస్‌తోపాటు స్టేషనరీ, బుక్స్‌కు సంబంధించి ముందుగానే షాపింగ్ చేయడం మంచిది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement