‘హంగుల్’ జీవిని ఏ పార్కులో చూడొచ్చు? | In which park will be see Hangul creature ? | Sakshi
Sakshi News home page

‘హంగుల్’ జీవిని ఏ పార్కులో చూడొచ్చు?

Published Wed, Dec 17 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

‘హంగుల్’ జీవిని ఏ పార్కులో చూడొచ్చు?

‘హంగుల్’ జీవిని ఏ పార్కులో చూడొచ్చు?

భారతదేశం - జాతీయ పార్కులు,  వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
 1.    పశ్చిమ బెంగాల్‌లోని జల్దపార సంరక్షణ కేంద్రంలో పరిరక్షిస్తున్న జంతువు ఏది?
     1) అడవి గాడిద    2) ఏనుగు
     3) ఖడ్గమృగం    4) పులి
 
 2.    కన్హా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?
     1) జార్ఖండ్    2) మధ్యప్రదేశ్
     3) ఉత్తరప్రదేశ్    4) ఛత్తీస్‌గఢ్
 
 3.    అడవి గాడిదల (Wild ass) సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
     1) ఉత్తరప్రదేశ్    2) అసోం
     3) రాజస్థాన్    4) గుజరాత్
 
 4.    ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం?
     1) దుద్వా    2) కార్బిట్
     3) కజిరంగ    4) గిర్
 
 5.    హంగుల్ అనే అంతరించి పోతున్న జీవిని ఏ జాతీయ పార్కులో చూడొచ్చు?
     1) దాచిగాం    2) గిర్
     3) చంద్రప్రభ    4) బందీపూర్
 
 6.    {పాజెక్టు టైగర్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
     1) 1972  2) 1973   3) 1974  4) 1992
 
 7.    భారతదేశంలో మొట్టమొదట ఏర్పాటు చేసిన బయోస్పియర్ ఏది?
     1) సుందర్‌బన్‌‌స    2) సిమ్లిపాల్
     3) కచ్        4) నీలగిరి
 
 8.    పులులు అధికంగా ఉన్న రాష్ర్టమేది?
     1) మహారాష్ర్ట    2) కర్ణాటక
     3) మధ్యప్రదేశ్    4) కేరళ
 
 9.    ఆలివ్‌రిడ్లే తాబేళ్లు అధికంగా ఏ తీరంలో పెరుగుతాయి?
     1) వంగతీరం    2) కోరమాండల్
     3) ఉత్కళతీరం    4) మలబార్
 
 10.    {పపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
     1) ఏప్రిల్ 21    2) మార్చి 21
     3) మే 21    4) జూన్ 21
 
 11.    సముద్ర పోటు ప్రాంతాల్లో పెరిగే ముఖ్యమైన చెట్టు?
     1) సుందరి    2) సాల్
     3) చిర్        4) టేకు
 
 12.    సుగంధ ద్రవ్యాల తయారీకి ఉపయోగించే రూసాగడ్డి ఏ జిల్లాలో లభిస్తుంది?
     1) ఆదిలాబాద్    2) నిజామాబాద్
     3) కరీంనగర్    4) ఖమ్మం
 
 13.    ఆసియాటెక్ సింహాలకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్కు ఏది?
     1) కజిరంగా (అసోం)
     2) బందీపూర్ (కర్ణాటక)
     3) సరిస్కా (రాజస్థాన్)  4) గిర్ (గుజరాత్)
 
 14.    దేశంలో అతిపెద్ద జంతుప్రదర్శనశాల ఉన్న ప్రాంతమేది?
     1) ముంబై    2) చెన్నై
     3) కోల్‌కతా    4) ఢిల్లీ
 
 15.    రంగన్ తిట్టూ  పక్షి సంరక్షణా కేంద్రం ఎక్కడ ఉంది?
     1) మైసూర్    2) బెంగళూరు
     3) హుబ్లీ    4) బందీపూర్
 
 16.    సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్‌‌వను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
     1) గుజరాత్     2) ఉత్తరాఖండ్
     3) హిమాచల్ ప్రదేశ్ 4) ఒడిశా
 
 17.    కిందివాటిలో బయోస్పియర్ రిజర్‌‌వ కానిది?
     1) అగస్థ్యమలై    2) నల్లమలై
     3) నీలగిరి    4) పచ్‌మర్హి
 
 18.    సెంటర్ ఫర్ సోషల్ ఫారెస్టీ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఎక్కడ ఉంది?
     1) భోపాల్      2) సిమ్లా
     3) జబల్‌పూర్    4) అలహాబాద్
 
 19.    భారతదేశంలో ఏర్పాటు చేసిన  మొట్టమొదటి టైగర్ రిజర్‌‌వ ఏది?
     1) కజిరంగా (అసోం)
     2) పన్నా (మధ్యప్రదేశ్)
     3) బందీపూర్ (కర్ణాటక)
     4) రణతంబోర్ (రాజస్థాన్)
 
 20.    ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్‌‌ట- 2013 ప్రకారం భారతదేశంలో విస్తీర్ణం పరంగా అడవులు తక్కువగా ఉన్న రాష్ర్టం ఏది?
     1) గోవా       2) పంజాబ్
     3) అరుణాచల్ ప్రదేశ్  4) హర్యానా
 
 21.    ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్‌‌ట-2013 ప్రకారం విస్తీర్ణపరంగా అధిక అడవులు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది?
     1) దాద్రానగర్ హవేలీ
     2) అండమాన్ నికోబార్ దీవులు
     3) డామన్ డయ్యూ    4) చంఢీఘర్
 
 22.    ఏ రకం అడవులు నౌకా నిర్మాణంలో, న్యూస్‌ప్రింట్ తయారీలో ఉపయోగపడతాయి?
     1) మడ అడవులు    2) ఆల్ఫైన్ అడవులు
     3) ఉష్ణమండల ముళ్లజాతి అడవులు
     4) హిమాలయాల్లోని సమశీతోష్ణ  అడవులు
 
 23.    భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఆర్థికంగా  ముఖ్యమైన అడవులు ఏవి?
     1)    ఉష్ణమండల తేమతో కూడిన సతత హరిత అడవులు    
     2) మడ అడవులు
     3)    ఉష్ణమండల తేమతో కూడిన ఆకు రాల్చే అడవులు    
     4) ఆల్ఫైన్ అడవులు
 
 24.    మంచిగంధం వృక్షాలు ఏ రాష్ర్టంలో ప్రబలంగా విస్తరించి ఉన్నాయి?
     1) మధ్యప్రదేశ్    2) రాజస్థాన్
     3) పశ్చిమబెంగాల్     4) కర్ణాటక
 
 25.    దేవదారు చెట్లు సాధారణంగా ఏ అడవుల్లో కనిపిస్తాయి?
     1) ఉష్ణమండల సతతహరిత అడవులు
     2) ఆల్ఫైన్ అడవులు
     3) ముళ్లజాతి అడవులు
     4) ఉష్ణమండల ఆకురాల్చే అడవులు
 
 26.    అసోంలోని మానస్ సంరక్షణ కేంద్రం దేనికి ప్రసిద్ధి?
     1) ఎలుగుబంటి    2) అడవి గాడిద
     3)    పులి    4) పక్షులు
 
 27.    కింద పేర్కొన్నవాటిలో ఎక్కడ అత్యధిక సంఖ్యలో జాతీయ పార్కులు ఉన్నాయి?
     1) అండమాన్ నికోబార్ దీవులు    
     2) అరుణాచల్ ప్రదేశ్
     3) అసోం    4) మేఘాలయ
 
 28.    ఏటా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
     1) అక్టోబర్ 5    2) సెప్టెంబర్ 10
     3) జూన్ 9    4) జూన్ 5
 
 29.    భారతదేశంలో చివరిసారిగా ఏర్పడిన బయోస్పియర్ రిజర్‌‌వ ఏది?
     1) కచ్        2) పన్నా
     3) పచ్‌మర్హి    4) అగస్థ్యమలై
 
 30.    కవ్వాల్ శాంక్చుయరీ ఏ రాష్ట్రంలో ఉంది?
     1) రాజస్థాన్    2) గుజరాత్
     3) తెలంగాణా    4) మధ్యప్రదేశ్
 
 సమాధానాలు
 1) 3;    2) 2;    3) 4;    4) 3;
 5) 1;    6) 2;    7) 4;    8) 3;
 9) 3;    10) 2;    11) 1;     12) 2;     13) 4;     
 14) 3;    15) 1;  16) 4;  17) 2; 18) 4;
 19) 3;     20) 4;     21) 2;    22) 1;     23) 3;     
 24) 4;     25) 2;    26) 3; 27) 1;     
 28) 4;     29) 2;    30) 3.
 
 కాంపిటీటివ్ కౌన్సెలింగ్
 పోటీ పరీక్షల కోసం భారతదేశ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులకు సబంధించి ఏయే అంశాలను ఎలా చదవాలో తెలపండి.     
     - కె. ఊర్మిళ, నర్సాపూర్.
 పోటీ పరీక్షల దృష్ట్యా ‘భారత దేశం - జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు’ పాఠ్యభాగం ప్రత్యేకమైంది. భారత దేశ భూగోళ శాస్త్రంలో మిగిలిన అంశాలు కింది తరగతుల నుంచి ఒకదానితో ఒకటి అనుబంధంగా ఉంటూ ఎక్కువసార్లు రిపీట్ అవుతాయి. కానీ ఇది భిన్నమైంది. ప్రతి  పరీక్షలో దీని నుంచి 2, 3 ప్రశ్నలు తప్పనిసరిగా వస్తున్నాయి.  
 దేశ వ్యాప్తంగా జాతీయ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, బయోస్పియర్ రిజర్‌‌వలు మొదలైనవి వందల సంఖ్యలో, అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అందువల్ల వీటిలో ముఖ్యమైనవి, ప్రత్యేకమైనవి, వార్తల్లోకి వచ్చినవాటిని గుర్తించుకోవాలి. ఆయా ప్రదేశాలు, నదులు తదితర ప్రత్యేక అంశాల ఆధారంగా వీటికి పేర్లు పెట్టారు. ఇలాంటివాటిని బట్టి ఏయే రాష్ట్రాల్లో ఏయే సంరక్షణ కేంద్రాలున్నాయో గుర్తుంచుకోవాలి.  
 
 ఉదాహరణకు కింది ప్రశ్నను గమనించండి.
 ఫారెస్ట్ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
 1) ఢిల్లీ           2) సిమ్లా    
 3) డెహ్రాడూన్     4) భోపాల్
 సమాధానం: 3. దీంతోపాటు ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ, ఫారెస్ట్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా డెహ్రాడూన్‌లోనే ఉన్నాయి. ఇలాంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రత్యేకంగా ఏ జీవుల సంరక్షణ కోసం ఏయే పార్కులు/రిజర్వులను ఏర్పాటు చేశారో టేబుల్ రూపంలో పొందుపరుచుకొని తరచూ పునశ్చరణ చేసుకోవాలి. ఈ విభాగం నుంచి ప్రశ్నలను  ఎక్కువగా సాధన చేయాలి. తద్వారా మంచి మార్కులు సంపాదించవచ్చు.
 
 భారతదేశంలోని బయోస్పియర్ రిజర్‌‌వలు
 బయోస్పియర్ రిజర్‌‌వ     స్థాపించిన సం.   రాష్ర్టం
 నీలగిరి     1986    తమిళనాడు
 నందాదేవి     1988    ఉత్తరాఖండ్
 నోక్రెక్     1988    మేఘాలయ
 మానస్     1989     అసోం
 సుందర్‌బన్‌‌స    1989     పశ్చిమ బెంగాల్
 మన్నార్ సింధుశాఖ     1989     తమిళనాడు
 గ్రేట్ నికోబార్     1989     అండమాన్ నికోబార్
 సిమ్లిపాల్     1994     ఒడిశా
 దిబ్రూ-సైకోవా     1997     అసోం
 దిహంగీ- ది బంగ్     1998     అరుణాచల్ ప్రదేశ్
 పచ్‌మర్హి     1999    మధ్యప్రదేశ్
 కాంచన్‌జంగ్     2000    సిక్కిం
 అగస్థ్యమలై     2001     కేరళ
 అచానక్‌మర్        మధ్యప్రదేశ్,
 - అమర్‌కంఠక్     2005     ఛత్తీస్‌గఢ్
 కచ్     2008     గుజరాత్
 కోల్డ్‌డిజర్‌‌ట     2009    హిమాచల్ ప్రదేశ్
 శేషాచలం     2010     ఆంధ్రప్రదేశ్
 పన్నా     2011     మధ్యప్రదేశ్  
 
 ముల్కల రమేష్
 సీనియర్ ఫ్యాకల్టీ, హరీష్ అకాడమీ, హన్మకొండ.
 
 అప్రెంటీస్‌షిప్: ఫ్యాక్ట్
 ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్(ఫ్యాక్ట్) టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటీస్‌కు దరఖాస్తులు కోరుతోంది.
     టెక్నీషియన్ అప్రెంటీస్ సీట్ల సంఖ్య: 40
 విభాగాలు: మెకానికల్, కెమికల్, కంప్యూటర్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్.
 కాలపరిమితి: ఏడాది.
 అర్హతలు: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి.
 వయసు: 23 ఏళ్లకు మించకూడదు.
     
 ట్రేడ్ అప్రెంటీస్
 సీట్ల సంఖ్య: 118
 విభాగాలు: అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్), ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్ ప్లాంట్), ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్, డీజిల్ మెకానిక్, సీఓపీఏ, ప్లంబర్, వెల్డర్, ప్రోగ్రామ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్.
 కాలపరిమితి: కెమికల్ ప్లాంట్ ఏడాదిన్నర, మిగతావి ఏడాది.
 అర్హతలు: కెమికల్ ప్లాంట్‌కు బీఎస్సీ(కెమిస్ట్రీ), మిగతా వాటికి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.
     టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటీస్: 15
 విభాగాలు: ఆఫీస్ సెక్రటరీషిప్, అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్, సివిల్ కన్‌స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్.
 కాలపరిమితి: ఏడాది.
 అర్హతలు: సంబంధిత విభాగంలో ఒకేషనల్ గ్రూప్‌తో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
 వయసు: 23 ఏళ్లకు మించకూడదు.
 ఎంపిక: జనవరి 5 నుంచి 13 వరకు నిర్వహించనున్న రాత పరీక్ష ద్వారా.
 వెబ్‌సైట్: http://fact.co.in/
 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ
 చాందాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ  గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్/ డిప్లొమా హోల్డర్ల నుంచి అప్రెంటీస్‌షిప్‌కు దరఖాస్తులు కోరుతోంది.
     {V>y్యుయేట్ అప్రెంటీస్: 6
 విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్
 కాలపరిమితి: ఏడాది.
 అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి.
     టెక్నీషియన్ అప్రెంటీస్
 విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్
 కాలపరిమితి: ఏడాది.
 అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి.
 ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా.
 దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 24
 వెబ్‌సైట్: http://ofchanda.gov.in/

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement