ఉద్యోగాలు | Jobs | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Sat, May 7 2016 3:57 AM | Last Updated on Sun, Sep 3 2017 11:32 PM

Jobs

యూఐఐసీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు
యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (ఏవో: స్కేల్ -1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (స్కేల్-1): 300
ఫైనాన్స్: 43  అర్హత: చార్టెడ్ అకౌంటెంట్ (ఐసీఏఐ)/ కాస్ట్ అకౌంటెంట్ (ఐసీడబ్ల్యూఏ)/ఎంబీఏ ఫైనాన్స్/ఎంకాం/ బీకాం.
సివిల్ ఇంజనీరింగ్: 5
అర్హత: బీఈ/బీటెక్ (సివిల్ ఇంజనీరింగ్)
లీగల్: 15
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ‘లా’ డిగ్రీ. లాయర్‌గా మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు రెండేళ్లు సరిపోతుంది.
మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: 15
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్
యాక్చురీ: 2
అర్హత: స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్/యాక్చూరియల్  సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత
జనరలిస్ట్: 220    అర్హత: ఏదైనా డిగ్రీ
వయోపరిమితి: 2016, మార్చి 31 నాటికి 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.600 (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.100)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది: మే 6, 2016
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది: మే 17, 2016
పరీక్ష తేది: జూన్ 12, 2016
వెబ్‌సైట్: www.uiic.co.in
 
 
ఓయూలో బీకాం (ఆనర్స్)
ఉస్మానియా యూనివర్సిటీ.. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2016 ద్వారా మూడేళ్ల బీకాం (ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అర్హత: ఇంటర్మీడియట్,  దరఖాస్తు ఫీజు: రూ.400
దరఖాస్తు విధానం: యూనివర్సిటీ నిర్దేశించిన కాలేజీల్లో ఫీజు చెల్లించి దరఖాస్తు పొందవచ్చు. కాలేజీల జాబితా వెబ్‌సైట్లో పొందుపరిచారు.
ఎంపిక విధానం: కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2016 ర్యాంక్ ఆధారంగా
దరఖాస్తు చివరి తేది: మే 18, 2016
వెబ్‌సైట్: www.osmania.ac.in
 
 
ఓయూలో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్
పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ (పీజీడీడీఐఎం) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అర్హత: లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆఖరి సంవత్సరం విద్యార్థులు అర్హులే.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చివరి తేది: మే 7, 2016
అపరాధ రుసుముతో దరఖాస్తు చివరి తేది:
మే 14, 2016
వెబ్‌సైట్: www.osmania.ac.in

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement