ఎంఫార్మా కోర్సులకు జీప్యాట్ - 2017 | MPharma courses JPat - 2017 | Sakshi
Sakshi News home page

ఎంఫార్మా కోర్సులకు జీప్యాట్ - 2017

Published Mon, Oct 10 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

ఎంఫార్మా కోర్సులకు జీప్యాట్ - 2017

ఎంఫార్మా కోర్సులకు జీప్యాట్ - 2017

దేశవ్యాప్తంగా ఎంఫార్మా (ఎంఫార్మసీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష.. గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్). ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ప్రతి ఏటా ఈ పరీక్షను నిర్వహిస్తోంది. కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరిగే ఈ పరీక్ష స్కోర్ ద్వారా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్లు, యూనివర్సిటీ ఫార్మసీ డిపార్ట్‌మెంట్లు, క్యాంపస్ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో ఎంఫార్మా కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. అంతేకాకుండా స్కాలర్‌షిప్స్, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. 2017కు సంబంధించి జీప్యాట్ ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో జీప్యాట్ అర్హతలు, పరీక్ష విధానం తదితర అంశాలపై ఫోకస్..
 
  అర్హత: 10+2/ఇంటర్మీడియెట్ తర్వాత నాలుగేళ్ల బీఫార్మసీ ఉత్తీర్ణత. లేటరల్ ఎంట్రీ ద్వారా బీఫార్మసీ అభ్యసించినవారు, బీఫార్మసీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. బీఫార్మసీ మొదటి  మూడేళ్ల విద్యార్థులు అర్హులు కాదు.
 
 పరీక్ష విధానం: మూడు గంటల వ్యవధి (180 నిమిషాలు)లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 125 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు కేటాయించారు. అదేవిధంగా ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగెటివ్ మార్కు ఉంటుంది. ఫార్మాస్యూటిక్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రోబయాలజీ ఇన్ ఫార్మసీ, ఇంట్రడక్షన్ టు ఫార్మాస్యూటికల్ జురిప్రుడెన్స్ అండ్ ఎథిక్స్, ఇంట్రడక్షన్ టు డిస్‌పెన్సింగ్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ, ఇంపార్టెన్స్ ఆఫ్ యూనిట్ ఆపరేషన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టాచియోమెట్రీ; డొసేజెస్ ఫార్మ్స్, డిజైనింగ్ అండ్ ఎవల్యూషన్, బయోఫార్మాస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనటిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ ఫార్మసీ వంటి అంశాలపై ప్రశ్నలడుగుతారు.
 
  ఈ అంశాల్లో ముందుగా ప్రాథమిక భావనలను, ముఖ్య సూత్రాలను ఔపోనస పట్టాలి. తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ ఆధారంగా ముఖ్యమైన అంశాలన్నింటిని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. చదువుకోవడానికి వీలుగా షార్ట్ నోట్స్, బుల్లెట్ పాయింట్స్‌లా రూపొందించుకోవాలి. తరచుగా వీటిని పునశ్చరణ చేస్తుండాలి. ఈ పై టాపిక్స్‌తోపాటు ఫార్మసీలో కర్బన రసాయన శాస్త్రం ప్రాధాన్యత, ప్రభావాలను కూడా అభ్యర్థులు చదవాలి.
 
 అదేవిధంగా ఫార్మాస్యూటికల్స్‌లో బయోకెమిస్ట్రీ, వాటి అనువర్తనాలు, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఎనాలిసిస్, ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ, బయోలాజికల్ సోర్సెస్, కల్టివేషన్ తదితర అంశాలు కూడా పరీక్ష కోణంలో ముఖ్యమైనవే.
 
  ప్రిపరేషన్ తీరు: జీప్యాట్‌లో అడిగే ప్రశ్నలు సబ్జెక్ట్ నాలెడ్జ్‌తోపాటు ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌గా కూడా ఉంటాయి. కాబట్టి కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా.. ఒక అంశాన్ని సాధారణ పరిస్థితులకు అన్వయించి ఆలోచించే నైపుణ్యం పొందాలి. ఉదాహరణకు.. ఏదైనా ఒక వ్యాధి ఉన్న వ్యక్తికి నిర్దేశిత ఔషధం ఇస్తే కలిగే పరిణామాలను అంచనా వేయగల సామర్థ్యం సొంతం చేసుకోవాలి.
 
  జీప్యాట్ స్కోర్‌తో ఫెలోషిప్: జీప్యాట్ స్కోర్‌కు ఏడాది వ్యాలిడిటీ ఉంటుంది. ఈ వ్యవధిలో ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు నెలకు రూ.12,400 చొప్పున ఫెలోషిప్ పొందొచ్చు.
 
  దరఖాస్తు రుసుం: జనరల్/ఓబీసీ విద్యార్థులు రూ.1400+బ్యాంక్ ఛార్జీలు, మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.700 + బ్యాంక్ ఛార్జీలను.. క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు లేదా ఏదైనా ఎస్‌బీఐ శాఖలో నగదు చెల్లించాలి.
  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
  ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: అక్టోబర్ 10.
  ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 10.
  పరీక్ష తేదీలు: జనవరి 28, 29, 2017. వెబ్‌సైట్: http://aicte-gpat.in/
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement