‘నీట్’గా.. ఈజీగా..
‘నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)-1’గా ఇటీవల పేరుమారిన ఆలిండియా ప్రి మెడికల్/ప్రి డెంటల్ టెస్ట్ (ఏఐపీఎంటీ) దేశవ్యాప్తంగా మే 1న (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. 180 నిమిషాల (3 గంటల) వ్యవధి గల ఈ పరీక్షలో 180 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలని నిర్దేశించారు. ఆబ్జెక్టివ్ తరహాలో ఉన్న ఈ ప్రశ్నలను ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ) సబ్జెక్ట్‌ల నుంచి ఇచ్చారు. ఈ నేపథ్యంలో
ప్రశ్నల స్థాయిపై సమీక్ష..
ఫిజిక్స్: సగటు కన్నా కొంచెం ఎక్కువ కఠినంగా ఉన్నాయి. 40 శాతం ప్రశ్నలు ‘టఫ్’గా, మరో 40 శాతం ‘మీడియం’గా, మిగిలిన 20 శాతం ప్రశ్నలు ‘ఈజీ’గా ఉన్నాయి. అధిక శాతం గణనలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. కొన్ని ప్రశ్నలను ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచి ఇవ్వగా మరికొన్నింటిని గత ప్రశ్నాపత్రాల నుంచి ఇచ్చారు.
కెమిస్ట్రీ: గత ఏడాదితో పోల్చితే కాస్త కఠినంగానే ఉన్నాయి. దాదాపు మూడొంతుల ప్రశ్నలు 11వ తరగతి నుంచి, మిగిలినవి 12 తరగతి నుంచి ఇచ్చారు. ఎక్కువ శాతం ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ స్థాయిని మించి ఉన్నాయి. రెండు ప్రశ్నలకు రెండు ఆప్షన్లూ కరెక్ట్ ఆన్సరే ఇవ్వగా ఒక ప్రశ్నలో ఒక్క ఆప్షన్‌కూ సరైన సమాధానంలేదు.
బయాలజీ: యావరేజ్ లెవల్ ప్రశ్నలు తక్కువగానే ఉన్నాయి. రెండు తరగతుల నుంచీ దాదాపు సమాన సంఖ్యలో వచ్చాయి. కొన్ని ప్రశ్నలను ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచి ఇవ్వలేదు. ఒక ప్రశ్నలో సూక్ష్మ పోషకాలకు సరిపోలే ఆన్సరే ఇవ్వలేదు. అధిక శాతం ప్రశ్నలు సైటాలజీ, ఫిజియాలజీ, జెనెటిక్స్, ఇకాలజీ చాప్టర్ల నుంచే అడిగారు. మొత్తం మీద ప్రశ్నాపత్రం గత ఏడాదితో పోల్చితే తేలిగ్గానే ఉందని చెప్పొచ్చు.
ఎగ్జామ్ రివ్యూ
Published Tue, May 3 2016 2:01 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM
Advertisement
Advertisement