కుతుబ్‌షాహీల కాలం నాటి ప్రధాన కరెన్సీ? | Qutb Shahi major currency | Sakshi
Sakshi News home page

కుతుబ్‌షాహీల కాలం నాటి ప్రధాన కరెన్సీ?

Published Wed, Feb 1 2017 12:07 AM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM

కుతుబ్‌షాహీల కాలం నాటి ప్రధాన కరెన్సీ?

కుతుబ్‌షాహీల కాలం నాటి ప్రధాన కరెన్సీ?

చోళులు – ఆర్థిక పరిస్థితులు
చోళుల కాలంలో ప్రజల ముఖ్య వృత్తి   వ్యవసాయం.
దేవాలయాలు తమ ఆదాయాన్ని వ్యాపార సంస్థలు, గ్రామసభలకు 12 శాతానికి వడ్డీకి ఇచ్చేవి.
గ్రామ రక్షణాధికారికి చెల్లించే పన్నును                             పాడికావలి కూలి అనేవారు.
రాజరాజు–1 భూమిని సమగ్రంగా సర్వే చేయించాడు.
వరిమ్‌ పొట్టగమ్‌ అంటే భూమిశిస్తు రికార్డు అని అర్థం. భూమి శిస్తును ధన, ధాన్య రూపాల్లో చెల్లించవచ్చు.
వ్యక్తిగత భూములు, ప్రభుత్వ భూములు అని రెండు రకాల భూములుండేవి.
పన్నులు
మగ్గం పన్ను    – తలైయిరై   
స్వర్ణకారులపై పన్ను    – తట్టార పొట్టం
నీటి వనరులపై పన్ను        – వరక్కువార్‌ పట్టం
సంతలపై పన్ను    – అంగాడి పట్టం
వర్తక పన్ను     – శెట్టిరాం పన్ను
ఉప్పు పన్ను     – ఉప్పాయం
చెరువుల అజమాయిషీని ‘పరిదారియం’ అంటారు.
పంటలో 1/6 వంతును పన్నుగా విధించేవారు. మొదటి రాజరాజు కాలంలో 1/3 వంతు పంటను పన్నుగా విధించేవారు.
గ్రామసభ సభ్యుడిగా పోటీ చేయాలంటే స్వగ్రామంలో ఒకటిన్నర ఎకరాల భూమి  ఉండాలి.
బహమనీ సుల్తానులు – ఆర్థిక పరిస్థితులు
క్రీ.శ.1347– 1518 మధ్య కాలంలో బహమనీ సామ్రాజ్యంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ముఖ్యంగా మూడో మహ్మద్‌షా తన తల్లి ముఖ్దుమా–ఐ–జహాన్‌  కోరిక మేరకు ఆర్థిక అంశాల్లో నిపుణుడైన మహ్మద్‌ గవాన్‌ను ప్రధాని (వకీల్‌–ఐ–సుల్తానత్‌)గా నియమించాడు. దీంతోపాటు నిర్దిష్ట భూ వర్గీకరణ, శిస్తు విధానం, పంటల దిగుబడి లాంటి అంశాలను స్వయంగా పరిశీలించే వాడు.
ఆ రోజుల్లో తోలు పరిశ్రమ ప్రధానమైందిగా కొనసాగింది.
బీదర్, నిర్మల్, నాందేడ్, రాయ్‌చూర్‌లు కుటీర పరిశ్రమలకు కీలక కేంద్రాలుగా వెలుగొందాయి.
కుండల తయారీకి బీదర్‌ కేంద్రంగా ఉండేది.
బిద్రి పని విదేశాల్లో కూడా ప్రాధాన్యత పొందింది.
1/6 వంతును సరాసరి శిస్తుగా వసూలు చేసేవారు.
వృత్తిపని వారు, కూలీల స్థితి రైతుల కంటే మెరుగ్గా ఉందని నికిటిన్‌ రాశాడు.
వజ్రాలకు రాయచూర్‌ ప్రసిద్ధి చెందింది.
‘మహబూబ్‌–ఉల్‌–వతన్‌ ’అనే గ్రం«థం ఆ  కాలంలోని సుంకాల గురించి పేర్కొంటుంది.
వస్త్ర పరిశ్రమకు బీజాపూర్‌ ప్రసిద్ధి చెందింది.
బంగారం, సుగంధద్రవ్యాలు, చైనా వస్తువులు, ముత్యాలు, బానిసలు, మేలురకం అశ్వాలు  ప్రధాన దిగుమతులు.
వస్త్రాలు, బిద్రి పరికరాలు, వరంగల్‌ కార్పెట్‌లు ప్రధాన ఎగుమతులు.
కలప, గడ్డిపై ఎలాంటి పన్ను లేదు.
గుల్బర్గా, బీదర్‌లలో టంకశాలలు ఉండేవి.
పరిపాలనా యంత్రాంగం
దివాన్‌                       – ఆర్థిక మంత్రి
అమీర్‌–ఐ–జుమ్‌లా   – ఆర్థిక సలహాదారు
సరబ్‌దారు  – నీటి పంపిణీ పర్యవేక్షకుడు
కుతుబ్‌షాహీలు – ఆర్థిక వ్యవస్థ
కుతుబ్‌షాహీల కాలంలో రేవు పట్టణ ముఖ్యాధికారి?    – షాబందర్‌
షాబందర్‌ ముఖ్య విధులు?
– ఎగుమతి, దిగుమతి సుంకాల వసూలు
కంప్ట్రోలర్, ఆడిటర్‌ జనరల్‌?    – మజుందార్‌
ట్రెజరీ వ్యవహారాలు చూసే అధికారి?
– ఖజానాదార్‌
మోటుపల్లి ఆనాటి ప్రధాన రేవు పట్టణం.
అప్పట్లో నిజాంపట్టణం ఆదాయం?           55 వేల పగోడాలు
బ్రాహ్మణులు, బనీయాలు రెవెన్యూ వసూలు, హక్కుల వేలంలో పాల్గొనేవారు.
ఆనాటి ఒక çహోన్ను నేటి 3 రూపాయలకు సమానం.
గ్రామస్థాయి అకౌంటెంట్‌?        – కులకర్ణి
పరగణా స్థాయి అకౌంటెంట్‌?     – దేశ్‌పాండే
వైశ్యులు భారీ ఎత్తున వ్యాపారం చేసేవారని థామస్‌చౌరీ తన రచనల్లో రాశాడు.
సముద్రంపై జరిగే వ్యాపారాన్ని ‘ఓడబేరము’ అనేవారు.
‘ఓడకాడు’ అనే పదాన్ని శుకసప్తతిలో పేర్కొన్నారు.
రాజమాత మాసాహెబా సైదాబాద్‌ పరిసరాల్లో మాసాహెబా ట్యాంక్‌ను నిర్మించింది.
ఆర్థిక మంత్రిని ‘మీర్‌జుమ్లా’ అంటారు.
వర్తకుల పెద్దగా చౌదరి ఉండేవాడు.
పోతేదార్‌.. నాణేల మారకందారు.
తుపాకీ మందుకు మచిలీపట్నం,
నీలిమందుకు నాగులపంచ ప్రసిద్ధి చెందాయి.
హైదరాబాద్‌లోని కార్వాన్‌ ప్రాంతంలో వజ్రాలకు మెరుగుపెట్టేవారు.
పులికాట్, నరసాపురం, నిజాంపట్టణం మొదలైనవి ప్రసిద్ధ ఓడరేవులు.
బ్రిటిష్‌ నౌక ‘గ్లోబ్‌’ను నరసాపురంలోనే తయారుచేశారు.
గ్రామాల్లో మిరాశీ భూములుండేవి. మిరాశీ భూములు అంటే వంశపారంపర్య భూములు.
దుర్గ్‌ జలాశయాన్ని గోల్కొండకు 5 కిలోమీటర్ల దూరంలో నిర్మించారు.
కుతుబ్‌షాహీల కాలం నాటి ప్రధాన కరెన్సీ           – హోన్ను (బంగారు నాణెం).
హోన్నును విదేశీ వర్తకులు, బాటసారులు ‘పగోడా’ అనేవారు.
గోల్కొండ రాజ్యంలో వాడుకలో ఉన్న ఇతర కరెన్సీ               – ఫణం, తార్, కాసు
1656లో కొల్లూరు గనిలో ‘కోహినూర్‌ వజ్రం’ దొరికింది.
వజ్ర పరిశ్రమకు గోల్కొండ ప్రసిద్ధి.
రామళ్లకోట, వజ్రకరూర్, పరిటాల.. వజ్రాలకు ప్రసిద్ధి చెందాయి.
‘పెరికలు’ వర్తక సామగ్రిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరవేసేవారు.
కుతుబ్‌షాహీల కాలంలో ‘ముఘ్రా’, ‘తెలియా’ అనేవారు నేత పని చేసేవారు.
మస్లిన్, చింట్జ్‌ వస్త్రాలను పర్షియాకు ఎగుమతి చేసేవారు.
‘రిసాలత్‌ –ఇ–మిక్ధారియా’ గ్రంథంలో మీర్‌–మొమీన్‌– మహ్మద్‌– అస్ట్రాబాదీ తూనికలు, కొలతలను వివరించారు.

Advertisement

Related News By Category

Advertisement