యూపీఎస్సీ..సివిల్స్-2016 గెలుపు బాట.. | Special Focus on civils | Sakshi
Sakshi News home page

యూపీఎస్సీ..సివిల్స్-2016 గెలుపు బాట..

Published Thu, Apr 28 2016 4:47 AM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM

యూపీఎస్సీ..సివిల్స్-2016  గెలుపు బాట..

యూపీఎస్సీ..సివిల్స్-2016 గెలుపు బాట..

 ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత ఉద్యోగ నియామకాలకు నిర్వహించే పరీక్ష సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్! ఒకవైపు అత్యున్నత కెరీర్, మరోవైపు ప్రజలకు సేవచేసే అవకాశం ‘సివిల్స్’కు ఎంపిక కావడం ద్వారా లభిస్తుంది. అందుకే దీనికి పోటీ తీవ్రంగా ఉంటుంది.ఈ పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ‘సివిల్స్-2016’పై స్పెషల్ ఫోకస్..
 
  దరఖాస్తుకు చివరి తేదీ: మే 27, 2016
  ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 7, 2016
  మొత్తం ఖాళీల అంచనా: 1079

 
 జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్స్ పరీక్ష ద్వారా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ పీ అండ్ టీ అకౌంట్స్- ఫైనాన్స్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ వంటి మొత్తం 24 అఖిల భారత సర్వీసుల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.వయసు: 2016, ఆగస్టు 1 నాటికి కనిష్ట వయసు 21 ఏళ్లు. గరిష్ట వయసు 32 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్లు; బీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.ఎంపిక ప్రక్రియ: సివిల్ సర్వీసెస్‌కు సంబంధించిన ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది.
 
 కాంపిటీటివ్ గెడైన్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్
 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ విధానం)
 మెయిన్ ఎగ్జామినేషన్  (డిస్క్రిప్టివ్ విధానం)
 ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్

 
 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
 ఇందులో రెండు ఆబ్జెక్టివ్ (మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్) పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు కేటాయించారు. పేపర్‌కు రెండు గంటల చొప్పున సమయం అందుబాటులో ఉంటుంది. పేపర్-2 అర్హత పేపర్ మాత్రమే. ఇందులో కనీసం 33 శాతం మార్కులు సాధించాలి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి మాత్రమే మెయిన్స్ నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ పేపర్లలో నెగిటివ్ మార్కులు ఉంటాయి.
 
 మెయిన్ ఎగ్జామినేషన్
 ఇందులో రెండు అర్హత పేపర్లు పేపర్-ఎ (అభ్యర్థి ఎంపిక చేసుకున్న భాష), పేపర్-బి (ఇంగ్లిష్) ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 300 మార్కులు కేటాయించారు. వీటిని మెరిట్ జాబితా రూపకల్పనకు  పరిగణనలోకి తీసుకోరు.

 
 గమనిక
 ప్రతి పేపర్‌కు 250 మార్కులు చొప్పున మొత్తం 1750 మార్కులు కేటాయించారు.   మెయిన్‌లో ప్రతిభ కనబరచిన వారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఖాళీల ఆధారంగా దాదాపు రెట్టింపు సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. 275 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్‌లో ప్రతిభ చూపిన వారితో తుది జాబితా రూపొందిస్తారు.
 
 దరఖాస్తు విధానం
 అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన వారు రూ.100 ఫీజు చెల్లించాలి.
 వెబ్‌సైట్: www.upsconline.nic.in
 
 విజయానికి మార్గాలు
  పటిష్ట ప్రణాళిక ద్వారా సివిల్స్‌లో విజయం సాధించవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే సిలబస్‌లోని అంశాలకు సంబంధించి తొలుత ప్రాథమిక భావనలపై పట్టుసాధించాలి. ప్రిపరేషన్‌కు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ఉపయోగించుకోవాలి. వీటిని చదవడం వల్ల బేసిక్స్‌పై అవగాహన ఏర్పడుతుంది. గత ప్రశ్నపత్రాలను విశ్లేషించడం ద్వారా ఏ అంశాలకు అధిక ప్రాధాన్యం లభిస్తుందో గుర్తించవచ్చు. దానికి అనుగుణంగా ప్రిపేర్ కావొచ్చు. ప్రిపరేషన్ సమయంలో సమకాలీన అంశాలకు (కరెంట్ అఫైర్స్)కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎకాలజీ, ఎన్విరాన్‌మెంట్, కల్చర్, ఆర్ట్స్ తదితర అంశాలపై దృష్టిసారించాలి. ప్రిలిమ్స్ సిలబస్, మెయిన్స్ సిలబస్‌లో ఉమ్మడిగా ఉన్న అంశాలను గుర్తించి, వాటిని ఒకేసారి ప్రిపేరవ్వాలి. దీనివల్ల సమయం ఆదాతోపాటు ఆయా అంశాలపై పట్టుసాధించడానికి వీలవుతుంది.
 
 సివిల్స్ మెయిన్స్‌కు సంబంధించి ఆప్షనల్ సబ్జెక్టు ఎంపిక పై అభ్యర్థులు స్పష్టమైన అవగాహన ఏర్పరుచుకోవాలి. ఆసక్తి, మెటీరియల్ లభ్యత, శిక్షణ, అకడమిక్ నేపథ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
 
 సివిల్స్ ఔత్సాహికులు ప్రిపరేషన్‌లో సమకాలీన అంశాలకు ప్రాధాన్యమిస్తూ వాటిని సిలబస్‌లోని అంశాలతో బేరీజు వేసుకొనే నైపుణ్యం సాధించాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. కోచింగ్ తీసుకుంటేనే విజయం సాధ్యమనే అపోహ వీడాలి.
 - శ్రీరంగం శ్రీరామ్,
 శ్రీరామ్స్ ఐఏఎస్ అకాడమీ.

 
 ప్రిలిమ్స్ పేపర్-2లో నిర్దేశిత 33 శాతం మార్కులు వస్తే చాలనే ధోరణి కాకుండా 60 శాతం మార్కులు సాధించేలా కృషి చేయాలి. తెలుగు మీడియం అభ్యర్థులు కాంప్రెహెన్షన్  కోసం ఇంగ్లిష్ వ్యాసాలను ప్రాక్టీస్ చేయాలి. పేపర్-1 కు సంబంధించి ఎకాలజీకి అధిక ప్రాధాన్యమివ్వాలి.మిగిలిన అన్ని విభాగాలనూ కరెంట్ అఫైర్‌‌సతో అనుసంధానిస్తూ చదవాలి.
 - వి.గోపాల కృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement