నవోదయ విద్యాలయ సమితిలో 2072 టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్
నవోదయ విద్యాలయ సమితి 2072 టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వీటిల్లో అసిస్టెంట్స్ కమిషనర్స్, ప్రిన్సిపాల్స్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ), ఇతర (మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ (మేల్, ఫిమేల్), లైబ్రేరియన్ వంటి పోస్టులున్నాయి. దేశవ్యాప్తంగా 591 నవోదయ విద్యాలయాలున్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీల వివరాలు, అర్హతలు, ఎంపిక పై ఫోకస్..
విభాగాలవారీగా ఖాళీలు
అసిస్టెంట్స్ కమిషనర్స్: 2
(వీటిల్లో ఒకటి పీహెచ్‌లకు కేటాయించారు)
అర్హత: హ్యుమానిటీస్/సైన్స్/కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఏదైనా ప్రభుత్వ/సెమీ గవర్నమెంట్/స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థల్లో ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌లో ఐదేళ్ల పని అనుభవం. రెసిడెన్షియల్ స్కూల్‌లో పనిచేసి ఎడ్యుకేషన్‌లో రీసెర్చ్ చేసినవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి: జూలై 31, 2016 నాటికి 45 ఏళ్లు మించరాదు.
వేతన శ్రేణి: రూ.15,600 - రూ.39,100 (గ్రేడ్ పే రూ.7600)
ప్రిన్సిపాల్స్ = 40 (అన్‌రిజర్వుడ్ - 22,
ఓబీసీ - 10, ఎస్సీ-06, ఎస్టీ-2)
అర్హత:
50 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ/తత్సమానం. వైస్ ప్రిన్సిపాల్/పీజీటీ/లెక్చరర్/మాస్టర్‌గా 10 లేదా 12 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
రెసిడెన్షియల్ స్కూల్ హౌస్‌మాస్టర్‌గా మూడేళ్ల పని అనుభవం.
ఇంగ్లిష్ లేదా హిందీ/ సంబంధిత ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం తప్పనిసరి.
వయోపరిమితి: జూలై 31, 2016 నాటికి 35- 45 ఏళ్లు.
వేతన శ్రేణి: రూ.15,600 - రూ.39,100 (గ్రేడ్ పే రూ.7600)
పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ) = 880 పోస్టులు
బయాలజీ = 77 (అన్‌రిజర్వుడ్-44, ఓబీసీ- 17, ఎస్సీ- 15, ఎస్టీ-1)
కెమిస్ట్రీ = 90 (అన్‌రిజర్వుడ్ - 46, ఓబీసీ - 12, ఎస్సీ - 15, ఎస్టీ- 17)
కామర్స్= 52 (అన్‌రిజర్వుడ్- 20, ఓబీసీ - 15, ఎస్సీ - 11, ఎస్టీ- 06)
ఎకనామిక్స్= 112 (అన్‌రిజర్వుడ్- 44, ఓబీసీ-23, ఎస్సీ-33, ఎస్టీ - 12)
ఇంగ్లిష్ = 76 (అన్‌రిజర్వుడ్ - 56, ఎస్సీ- 11, ఎస్టీ - 09)
జాగ్రఫీ = 56 (అన్‌రిజర్వుడ్ - 32, ఓబీసీ - 09, ఎస్సీ - 10, ఎస్టీ - 05)
హిందీ = 78 (అన్‌రిజర్వుడ్ - 57, ఎస్సీ-12, ఎస్టీ-09)
హిస్టరీ = 70(అన్‌రిజర్వుడ్ - 48, ఓబీసీ-08, ఎస్సీ-09, ఎస్టీ-05)
మ్యాథ్స్ = 117 (అన్‌రిజర్వుడ్ - 36, ఓబీసీ - 25, ఎస్సీ-31, ఎస్టీ-25)
ఫిజిక్స్ = 102 (అన్‌రిజర్వుడ్ - 49, ఓబీసీ - 19, ఎస్సీ - 15, ఎస్టీ- 19)
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ = 50 (అన్‌రిజర్వుడ్-33, ఎస్సీ-07, ఎస్టీ -10)
అర్హత: సంబంధిత పోస్టు, సబ్జెక్టును బట్టి... రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి నిర్దేశిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో రెండేళ్ల ఇంటిగ్రేటెడ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ లేదా 50 శాతం మార్కులతో హిందీ/ఫిజిక్స్ (అప్లైడ్ ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్)/కెమిస్ట్రీ (కెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ), మ్యాథమెటిక్స్ (మ్యాథమెటిక్స్/అప్లైడ్ మ్యాథమెటిక్స్)/ఎకనామిక్స్ (ఎకనామిక్స్/అప్లైడ్ ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్)/హిస్టరీ/జాగ్రఫీ/కామర్స్ (కామర్స్ విత్ అకౌంటింగ్/కాస్ట్ అకౌంటింగ్/ఫైనాన్షియల్ అకౌంటింగ్)/ఇంగ్లిష్/బయాలజీ (బోటనీ/జువాలజీ/లైఫ్ సెన్సైస్/బయోసెన్సైస్/జెనెటిక్స్/మైక్రో బయాలజీ/బయోటెక్నాలజీ/మాలికుల్యర్ బయాలజీ/ప్లాంట్ ఫిజియాలజీ) ఉత్తీర్ణత. ఐటీ పోస్టులకు 50 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ఐటీ) లేదా ఏదైనా బ్రాంచ్‌లో బీఈ/బీటెక్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిప్లొమా ఉత్తీర్ణత లేదా ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ఎంసీఏ లేదా బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్)/బీసీఏ ఉత్తీర్ణత.
ఐటీ పోస్టులకు మినహాయించి అన్ని పోస్టులకు బీఈడీ ఉండాలి.
హిందీ లేదా ఇంగ్లిష్ లాంగ్వేజ్ బోధించగల ప్రావీణ్యం ఉండాలి.
వయోపరిమితి: జూలై 31, 2016 నాటికి 40 ఏళ్లు మించరాదు.
వేతన శ్రేణి: రూ.9300- రూ.34,800 (గ్రేడ్ పే రూ.4800)
ట్రైన్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) - 660 పోస్టులు
ఇంగ్లిష్ = 159 (అన్‌రిజర్వుడ్ - 77, ఓబీసీ - 26, ఎస్సీ - 19, ఎస్టీ - 37)
హిందీ = 132 (అన్‌రిజర్వుడ్ - 78, ఓబీసీ - 28, ఎస్సీ - 18, ఎస్టీ - 08)
మ్యాథ్స్ = 229 (అన్‌రిజర్వుడ్ - 99, ఓబీసీ - 20, ఎస్సీ - 51, ఎస్టీ - 59)
సైన్స్ = 72 (అన్‌రిజర్వుడ్ = 35, ఓబీసీ - 06, ఎస్సీ-09, ఎస్టీ-22)
సోషల్ స్టడీస్ = 68 (అన్‌రిజర్వుడ్ - 49, ఓబీసీ - 08, ఎస్సీ - 02, ఎస్టీ - 09)
అర్హత: రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ లేదా 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టు (ఇంగ్లిష్/మ్యాథ్స్ (మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ)/సైన్స్ (బోటనీ/జువాలజీ/కెమిస్ట్రీ)/హిందీ/సోషల్ స్టడీస్ (జాగ్రఫీ/ఎకనామిక్స్/పొలిటికల్ సైన్స్)లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ ఉండాలి.
సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్)లో ఉత్తీర్ణత తప్పనిసరి.
వయోపరిమితి: జూలై 31, 2016 నాటికి 35 ఏళ్లు మించరాదు.
వేతన శ్రేణి: రూ.9300 - రూ.34,800 (గ్రేడ్ పే రూ.4600)
మిస్‌లేనియస్ కేటగిరీ - 255 పోస్టులు
మ్యూజిక్ = 41 (అన్‌రిజర్వుడ్ - 14, ఓబీసీ - 21, ఎస్సీ -02, ఎస్టీ - 04)
ఆర్ట్ = 50 (అన్‌రిజర్వుడ్ = 20, ఓబీసీ - 26, ఎస్టీ-04)
పీఈటీ (పురుషులు) = 28 (అన్‌రిజర్వుడ్ - 12, ఓబీసీ - 16)
పీఈటీ (మహిళలు) = 91 (అన్‌రిజర్వుడ్ = 54, ఓబీసీ-21, ఎస్సీ-8, ఎస్టీ-8)
లైబ్రేరియన్ = 45 (అన్‌రిజర్వుడ్ - 35, ఓబీసీ - 10)
అర్హత: మ్యూజిక్ టీచర్ పోస్టులకు ఐదేళ్ల గ్రాడ్యుయేషన్ (మ్యూజిక్)/పోస్ట్‌గ్రాడ్యుయేషన్ (మ్యూజిక్) లేదా బ్యాచిలర్ డిగ్రీ (మ్యూజిక్)తోపాటు బీఈడీ ఉత్తీర్ణత లేదా తత్సమానం.
ఆర్ట్ టీచర్ పోస్టులకు ఫైన్‌ఆర్ట్స్ (డ్రాయింగ్/పెయింటింగ్/స్కల్‌ప్చర్/గ్రాఫిక్ ఆర్ట్స్/క్రాఫ్ట్స్)లో ఐదేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత లేదా పీజీ డిగ్రీ ఇన్ డ్రాయింగ్, పెయింటింగ్, ఫైన్‌ఆర్ట్స్ లేదా తత్సమానం.
పీఈటీ పోస్టులకు ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఏదైనా డిగ్రీతోపాటు డీపీఈడీ ఉత్తీర్ణత.
లైబ్రేరియన్ పోస్టులకు లైబర్రీ సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత లేదా గ్రాడ్యుయేషన్‌తోపాటు లైబ్రరీ సైన్స్‌లో ఏడాది వ్యవధి ఉన్న డిప్లొమా ఉత్తీర్ణత. ఇంగ్లిష్/హిందీ/సంబంధిత ప్రాంతీయ భాషలో పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి: జూలై 31, 2016 నాటికి 35 ఏళ్లు మించరాదు.
వేతన శ్రేణి: రూ.9300 - రూ.34,800 (గ్రేడ్ పే రూ.4600)
టీజీటీ (థర్డ్ లాంగ్వేజ్ టీచర్స్)- మొత్తం పోస్టులు : 235 ఇందులో తెలుగు = 4 (ఎస్టీ - 4)
అర్హత: 50 శాతం మార్కులతో తెలుగు ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ ఉత్తీర్ణత.
బీఈడీతోపాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్)లో ఉత్తీర్ణత.
వయోపరిమితి: జూలై 31, 2016 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
వేతన శ్రేణి: రూ.9300 - రూ.34,800 (గ్రేడ్ పే రూ.4600)
వయోసడలింపు: అన్ని పోస్టులకు ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్ పోస్టులు మినహాయించి మిగిలిన అన్ని పోస్టులకు అన్ని కేటగిరీల మహిళలకు పదేళ్లు, దివ్యాంగులు.. జనరల్ - పదేళ్లు, ఓబీసీ - 13 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ - 15 ఏళ్లు)కు సడలింపు ఉంటుంది.
ఎంపిక: అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్స్, పీజీటీలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. టీజీటీలు, మిస్‌లేనియస్ కేటగిరీ(లైబ్రేరియన్) పోస్టులు, టీజీటీ (థర్డ్ లాంగ్వేజ్) పోస్టులకు రాతపరీక్ష మాత్రమే ఉంటుంది. రాతపరీక్షను దేశవ్యాప్తంగా 42 నగరాల్లో నిర్వహిస్తారు. అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్ పోస్టులకు ఢిల్లీలో మాత్రమే పరీక్ష ఉంటుంది.
అసిస్టెంట్ కమిషనర్ పరీక్ష విధానం
మూడు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో రీజనింగ్ ఎబిలిటీ (ప్రశ్నలు - 20, మార్కులు - 20), జనరల్ అవేర్‌నెస్ (ప్రశ్నలు - 40, మార్కులు - 40), లాంగ్వేజ్ టెస్ట్ (జనరల్ ఇంగ్లిష్, జనరల్ హిందీ) (ప్రశ్నలు - 40, మార్కులు - 40), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (ప్రశ్నలు - 20, మార్కులు - 20), ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ప్రశ్నలు - 60, మార్కులు - 60)లు ఉంటాయి.
ప్రిన్సిపాల్ పరీక్ష విధానం
మూడు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో రీజనింగ్ ఎబిలిటీ (ప్రశ్నలు - 20, మార్కులు - 20), జనరల్ అవేర్‌నెస్ (ప్రశ్నలు - 40, మార్కులు - 40), లాంగ్వేజ్ టెస్ట్ (జనరల్ ఇంగ్లిష్, జనరల్ హిందీ) (ప్రశ్నలు - 40, మార్కులు - 40), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (ప్రశ్నలు - 20, మార్కులు - 20), అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ ప్రొసీజర్/రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (ప్రశ్నలు - 60, మార్కులు - 60)లు ఉంటాయి.
పీజీటీ, టీజీటీ, మిస్‌లేనియస్ టీచర్స్, టీజీటీ (థర్డ్ లాంగ్వేజ్) పరీక్ష విధానం
అన్ని పోస్టులకు కలిపి కామన్ పేపర్ ఉంటుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ఇందులో జనరల్ ఇంగ్లిష్ అండ్ హిందీ (40 ప్రశ్నలు), జనరల్ అవేర్‌నెస్ (30 ప్రశ్నలు), జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ (30 ప్రశ్నలు), టీచింగ్ ఆప్టిట్యూడ్ (20 ప్రశ్నలు), సంబంధిత సబ్జెక్ట్ నాలెడ్జ్ (80 ప్రశ్నలు) ఉంటాయి. పీజీటీ ప్రశ్నపత్రం పోస్ట్‌గ్రాడ్యుయేషన్ స్థాయిలో, టీజీటీ, ఇతర పోస్టుల ప్రశ్నపత్రం గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉంటుంది. మొత్తం మార్కులు 200. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు.
ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇతరులు అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్ పోస్టులకు రూ.1500, పీజీటీ. టీజీటీ, మిస్‌లేనియస్, రీజినల్ లాంగ్వేజ్ టీచర్స్ పోస్టులకు రూ.1000 ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు విధానం: www.nvshq.org, www.mecbsegov.in వెబ్‌సైట్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత అభ్యర్థులు దాన్ని ప్రింటవుట్ తీసుకుని భద్రపర్చాలి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, హైదరాబాద్,
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబర్ 10, 2016
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 9, 2016
ఫీజు చెల్లించడానికి చివరి తేది: అక్టోబర్ 14, 2016
పరీక్ష తేదీలు: నవంబర్, డిసెంబర్ 2016
వెబ్‌సైట్స్: www.nvshq.org, www.mecbsegov.in