తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కమిషన్... తాజాగా గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్యం; ఆర్ అండ్ బీ; ప్రజారోగ్యం, మున్సిపల్ తదితర విభాగాల్లో 563 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో అర్హతలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్ ప్రణాళికపై ప్రత్యేక కథనం...
ఉద్యోగాల వివరాలు
ఉద్యోగం ఖాళీలు
1. అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) -
గ్రామీణ నీటి సరఫరా,
పారిశుద్ధ్య ఇంజనీరింగ్ విభాగం 125
2. అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) -
రహదారులు, భవనాల విభాగం 42
3. అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్/మెకానికల్)
- ప్రజారోగ్యం, మున్సిపల్ ఇంజనీరింగ్
విభాగం 258
4. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)
- ప్రజారోగ్యం, మున్సిపల్ ఇంజనీరింగ్
విభాగం 84
5. టెక్నికల్ ఆఫీసర్స్ (సివిల్/ మెకానికల్) -
ప్రజారోగ్యం, మున్సిపల్ ఇంజనీరింగ్
విభాగం 54
మొత్తం 563
అర్హత: ఇంజనీరింగ్‌లో డిప్లొమా. కొన్ని పోస్టులకు డిప్లొమాతోపాటు ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు కూడా అర్హులే.వేతన స్కేలు: పోస్టు కోడ్1: రూ.29,760- రూ.80,930; పోస్టు కోడ్ 2, 3, 4, 5: రూ.31,460- రూ.84,970.వయసు: 2015, జులై 1 నాటికి కనిష్ట వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 44 ఏళ్లు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు; పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఆన్‌లైన్ లేదా ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటాయి. ఇందులో సాధించిన మార్కులు ఆధారంగా నియామకాలుంటాయి.
నియామకాలకు కనీస అర్హత మార్కులు: ఓసీ-40 శాతం; బీసీ-35శాతం; ఎస్సీ,ఎస్టీ,పీహెచ్‌సీ-30 శాతం.
పరీక్ష విధానం
ప్రశ్నలు సమయం మార్కులు
రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్)
పేపర్-1: జనరల్ స్టడీస్
అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 150 150
పేపర్-2:
సివిల్ ఇంజనీరింగ్
(డిప్లొమా స్థాయి) లేదా
మెకానికల్ ఇంజనీరింగ్
(డిప్లొమా స్థాయి) 150 150 150
ముఖ్య సమాచారం:
వన్‌టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) విధానంలో తొలుత టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. తర్వాత టీఎస్‌పీఎస్‌సీ ఐడీ, పుట్టిన తేదీ సహాయంతో ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తిచేయాలి. ఫీజు: ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.100 చెల్లించాలి. దీంతో పాటు రూ.80 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్‌మెన్ పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. నిరుద్యోగ అభ్యర్థుల కోటాలో ఫీజు నుంచి మినహాయింపు పొందితే దీనికి సంబంధించి తగిన సమయంలో కమిషన్‌కు డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 28, 2015.
పరీక్ష తేదీ: అక్టోబరు 25, 2015.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్
వెబ్‌సైట్: www.tspsc.gov.in
మోడల్ ప్రశ్నలు
Civil Engineering
1. The shape of the deflection curve for concentrated load is
1) parabola 2) circular
3) semi-circular 4) ellipse
2. The elastic curve of a beam is taken as
1) neutral axis level
2) centroidal axis level
3) bottom line of the beam
4) major principle of the section.
Mechanical Engineering
1. If ds=dQ/T during process, the process is
1) reversible 2) irreversible
3) impossible 4) none of these
2. Second law of thermodynamics defines
1) heat 2) work
3) internal energy 4) entropy
General Studies
1. Who wrote the book 'Planned Economy for India'
1) M.Visvesvaraya
2) SardarVallabhai Patel
3) Jawaharlal Nehru
4) Mahatma Gandhi
2. The indus valley civilization was discovered in
1) 1902 2) 1921 3) 1922 4) 1932
టీఎస్పీఎస్సీ... ఏఈ
Published Thu, Sep 3 2015 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM
Advertisement
Advertisement