మానవుని చెవి వినగలిగే ధ్వని తీవ్రత?
మాదిరి ప్రశ్నలు - ధ్వని
1. కింద పేర్కొన్నవాటిలో దేంట్లో ధ్వని వేగం ఎక్కువ?
1) గాలి 2) ఇనుము
3) నీరు 4) శూన్యం
2. ధ్వని వేగాన్ని కనుగొనడానికి మొదటగా సూత్రాన్ని ప్రతిపాదించింది?
1) న్యూటన్ 2) డాప్లర్
3) ఐన్‌స్టీన్ 4) లాప్లస్
3. గాలి గొట్టంలో మార్పు ద్వారా ధ్వనిని వెలువరించే పరికరం?
1) తబలా 2) ఫ్లూట్
3) గిటార్ 4) జల తరంగిణి
4. మానవుడు వినగలిగే ధ్వని పౌనఃపున్యం?
1) 30 ఓఏ్డ 2) 15 ఓఏ్డ
3) 5 ఏ్డ 4) 40 ఓఏ్డ
5. గాలిలో ధ్వని తరంగాలు ఏ రకమైన తరంగాలకు ఉదాహరణ?
1) తిర్యక్ 2) స్థిర
3) విద్యుదయస్కాంత 4) దైర్ఘ్య
6. పర శ్రావ్యాలను వినగలిగే జీవి?
1) గబ్బిలం 2) కుక్క
3) పాము 4) ఏనుగు
7. గాలిలో ధ్వని వేగం సుమారుగా?
1) 400 KHz 2) 330 KHz
3) 500 KHz 4) 150 KHz
8. సముద్రంలో మునిగిన వస్తువుల ఉనికిని కనుగొనడానికి వినియోగించే వ్యవస్థ?
1) SONAR 2) RADAR
3-) LASER 4) NAVIGATION
9. శబ్ద తరంగ లక్షణం?
1) కీచుదనం 2) తరచుదనం
3) నాణ్యత 4) పైవన్నీ
10. పిండాన్ని పరిశీలించడానికి వైద్యులు వేటిని ఉపయోగిస్తారు?
1) పరశ్రావ్యాలు 2) అతి ధ్వనులు
3) తిర్యక్ తరంగాలు 4) దైర్ఘ్య తరంగాలు
11. అనుదైర్ఘ్య తరంగాల్లో ఏర్పడేవి?
1) శృంగాలు, ద్రోణులు
2) అస్పందన, ప్రస్పందనాలు
3) సంపీడన, విరళీకరణాలు
4) తరంగాగ్రాలు
12. పౌనఃపున్యానికి ప్రమాణం?
1) మీటర్ 2) హెర్‌ట ్జ
3) కెలోరి 4) ఆంపియర్
13. సితార, వీణ నుంచి వచ్చే ధ్వనులను గుర్తించడానికి ఉపయోగపడే ధ్వని లక్షణం?
1) తీవ్రత 2) పిచ్
3) నాణ్యత 4) ఏదీకాదు
14. మానవుడి చెవి వినగలిగే ధ్వని తీవ్రత?
1)9 dB – 180 dB
2) 50 dB – 500 dB
3) 100 dB – 600 dB
4) 0 dB – 10 dB
15. తరంగంలో రెండు వరుస శృంగాలు లేదా రెండు వరుస ద్రోణుల మధ్య దూరాన్ని ఏమంటారు?
1) తరంగ వేగం 2) పౌనఃపున్యం
3) తరచుదనం 4) తరంగ దైర్ఘ్యం
16. ఒక వ్యక్తికి అసలు ధ్వని వినిపించిన 0.1 సెకన్ల లోపు పరావర్తన ధ్వని వినిపించింది. ఈ ధ్వనిని ఏమంటారు?
1) ప్రతిధ్వని 2) ప్రతినాదం
3) తరచుదనం 4) కీచుదనం
17. చెవిపై కలిగించిన గ్రహణ సంవేదన స్థాయిని ఏమంటారు?
1) పిచ్ 2) కీచుదనం
3) తీవ్రత 4) నాణ్యత
18. వినేందుకు ఇంపుగా ఉన్న ధ్వనులను ఏమంటారు?
1) సంగీత స్వరాలు 2) చప్పుళ్లు
3) అతిధ్వనులు 4) పరశ్రావ్యాలు
19. వినేందుకు కఠోరంగా ఉన్న ధ్వనులను ఏమంటారు?
1) సంగీత స్వరాలు 2) చప్పుళ్లు
3) అతిధ్వనులు 4) పరశ్రావ్యాలు
20. తరంగం ప్రయాణించేటప్పుడు యానకం సాంద్రత లేదా పీడనంలో కలిగే అత్యధిక మార్పును ఏమంటారు?
1) డోలనావర్తన కాలం
2) ఆవర్తన కాలం 3) కంపన పరిమితి
4) పౌనఃపున్యం
21. ధ్వని వేగం, పౌనఃపున్యం, తరంగ దైర్ఘ్యాల మధ్య సంబంధం?
1)v = nl 2) n = vl
3) l = vn 4)
22. శృతి దండాన్ని కనుగొన్నదెవరు?
1) ఐన్‌స్టీన్ 2) జాన్‌షోర్
3) న్యూటన్ 4) డాప్లర్
23. ఒక తరంగ స్వభావాన్ని వివరించడానికి ఉపయోగపడే రాశి?
1) తరంగ దైర్ఘ్యం 2) కంపన పరిమితి
3) పౌనఃపున్యం 4) పైవన్నీ
24. మాట్లాడేటప్పుడు మన శరీరంలో కంపించే అవయవం?
1) స్వరపేటిక 2) గొంతు
3) నోరు 4) నాలుక
25. SONAR అంటే ఏమిటి?
1) సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్
2) సౌండ్ నావిగేషన్ అండ్ రేడియేషన్
3) సౌండ్, నాయిస్ అండ్ రిడక్షన్
4) సౌండ్, నాయిస్ అండ్ ఎయిర్
26. 500Hz పౌనఃపున్యం ఉన్న ధ్వని ఆవర్తన కాలం?
1) 0.2 సెకన్లు 2) 0.02 సెకన్లు
3) 0.002 సెకన్లు 4) 0.0002 సెకన్లు
27. సంగీత స్వరాల్లో ’రి’ పౌనఃపున్యం ఎంత?
1) 256 ఏ్డ 2) 288 ఏ్డ
3) 320 ఏ్డ 4) 512 ఏ్డ
28. ఒక వస్తువు ఎలాంటి స్థితిలో మాత్రమే ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది?
1) నిశ్చల 2) చలన
3) కంపన 4) వాయు
29. జెట్ విమానం శబ్ద తీవ్రత?
1) 150 Hz 2) 200 Hz
3) 80 Hz 4) 120 Hz
30. గబ్బిలాలు వాటికి ఎదురుగా ఉన్న అవరోధాలను గుర్తించడానికి వేటిని ఉపయో గించుకుంటాయి?
1) ధ్వని తరంగాలు 2) పరశ్రావ్యాలు
3) అతిధ్వనులు 4) కంపనాలు
31. టీవీ వాల్యూమ్ పెంచితే ధ్వని లక్షణాల్లో మార్పు చెందేది ఏది?
1) కంపన పరిమితి 2) పౌనఃపున్యం
3) తరంగ దైర్ఘ్యం 4) వేగం
32. స్థిర తరంగంలో అత్యధిక స్థానభ్రంశం ఉన్న బిందువు?
1) శృంగం 2) ద్రోణి
3) ప్రస్పందన స్థానం
4) అస్పందన స్థానం
33. ఒక ప్రస్పందన, దాని పక్కనే ఉన్న అస్పందన స్థానాల మధ్య దూరం 12 సెం.మీ. అయితే తరంగ దైర్ఘ్యం ఎంత?
1) 6 ఛిఝ 2) 3 ఛిఝ
3) 24 ఛిఝ 4) 48 ఛిఝ
34. అనునాద గాలి స్తంభాల్లో ఏ రకమైన తరంగాలు ఏర్పడతాయి?
1) తిర్యక్ 2) దైర్ఘ్య
3) స్థిర 4) ధ్వని
35. ఒక యానకంలో ధ్వని ప్రసరించడానికి దానికిఉండాల్సిన లక్షణం?
1) స్థితిస్థాపకత 2) జడత్వం
3) సాంద్రత 4) 1, 2
38. పరశ్రావ్యాల పౌనఃపున్యం?
1) 20 హెడ్‌జ ్టకంటే ఎక్కువ
2) 20 హెడ్‌జ
3) 20 హెడ్‌జ కంటే తక్కువ
4) 2000 హెడ్‌జ
39. ఊయలను ఊపే సందర్భంలో.. దాన్ని తక్కువ బలంతో ఊపినా అధిక డోలనా పరిమితితో ఊగడంలో ఇమిడి ఉన్న దృగ్విషయం ఏది?
1) ధ్వని వేగం 2) ధ్వని పరావర్తనం
3) ప్రతినాదం 4) అనునాదం
40. తరంగంలో ఒకే ప్రావస్థలో ఉన్న రెండు అనుక్రమ కణాల మధ్య దూరాన్ని ఏమంటారు?
1) తరంగ దైర్ఘ్యం 2) తరంగ వేగం
3) పౌనఃపున్యం 4) తరచుదనం
42. అనునాద గాలిస్తంభంలో మొదటి అనునాదం ఏర్పడినప్పుడు గాలి స్తంభం పొడవు(1)?
1) 2) 3) 4) 2
43. యానకంలోని ఏవైనా రెండు స్థిర బిందువుల మధ్య శక్తి నిర్బంధించి ఉంటే ఆ తరంగాలు ఏ రకమైనవి?
1) దైర్ఘ్య తరంగాలు 2) తిర్యక్ తరంగాలు
3) స్థిర తరంగాలు
4) అనునాద తరంగాలు
44. రెండు వస్తువులు ఒకదానితో ఒకటి అనునాదంలో ఉన్నప్పుడు వాటిలో గరిష్ఠంగా ఉండే అంశం?
1) కంపన పరిమితి 2) పౌనఃపున్యం
3) తరంగదైర్ఘ్యం 4) వేగం
45. ఒక యానకంలో జనకస్థానం నుంచి దూరంగా ప్రయాణించే తరంగాలను ఏమంటారు?
1) దైర్ఘ్య తరంగాలు
2) తిర్యక్ తరంగాలు
3) పురోగామి తరంగాలు
4) స్థిర తరంగాలు
46. స్టెతస్కోప్ ట్యూబ్ ద్వారా ధ్వని ఎలా ప్రయాణిస్తుంది?
1) ట్యూబ్‌తోపాటు వంగి
ప్రయాణిస్తుంది
2) సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తుంది
3) బహుళ పరావర్తనాల వల్ల
4) పైవన్నీ
47. తిర్యక్ తరంగ ప్రసారంలో లోతైన ప్రాం తాన్ని ఏమంటారు?
1) శృంగం 2) ద్రోణి
3) సంపీడనం 4) విరళీకరణం
48. దైర్ఘ్య తరంగాల్లో కణాల మధ్య దూరం తక్కువగా ఉండే ప్రాంతం?
1) శృంగం 2) ద్రోణి
3) సంపీడనం 4) విరళీకరణం
49. శవ్య అవధి కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉన్న ధ్వనులు?
1) అతిధ్వనులు
2) పరశ్రావ్యాలు
3) ప్రతినాదాలు
4) ప్రతిధ్వనులు
50. ఒక యానకంలో ధ్వని ప్రయాణించే
టప్పుడు?
1) ఆ యానకంలోని కణాలు స్థానభ్రంశం చెందుతాయి
2) ఆ యానకంలో కణాల మధ్య శక్తి బదిలీ జరుగుతుంది
3) ఆ యానకంలో కణాల మధ్య ఖాళీ పెరుగుతుంది
4) ఆ యానకం గతిశక్తి పెరుగుతుంది
51. గాలిలో ధ్వని ప్రసారాన్ని మొదటిసారిగా పూర్తిగా వివరించిందెవరు?
1) జాన్ షోర్ 2) హెర్‌ట్జ
3) న్యూటన్ 4) డాప్లర్
52. యానకంలో కణాలు తరంగ చలనదిశకు లంబంగా కంపిస్తే ఆ తరంగాలను ఏమంటారు?
1) అనుదైర్ఘ్య 2) స్థిర
3) పరావర్తన తరంగాలు
4) తిర్యక్ తరంగాలు
53. {స్పింగ్‌లో ఏర్పడే తరంగాలు ఏ
రకమైనవి?
1) దైర్ఘ్య 2) తిర్యక్
3) స్థిర 4) పరావర్తన