
టీడీపీకి బాబూమోహన్ రాజీనామా
బీ-ఫారాలు ఇవ్వలేదని మనస్తాపం
జోగిపేట, న్యూస్‌లైన్: టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ మంత్రి పి.బాబూమోహన్ ప్రకటించారు. మెదక్ జిల్లా ఆందోల్‌లో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు.
ఆందోల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్న తనకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల బీ-ఫారాలను ఇవ్వకపోవడంతో తాను తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కాగా, రాజీనామా ప్రకటించిన తర్వాత బాబూమోహన్ క న్నీటి పర్యంతమయ్యారు.