సూర్యాపేటరూరల్, న్యూస్‌లైన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకూ పార్టీలకతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని వైఎ స్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీరవోలు సోమిరెడ్డి అన్నారు. సూర్యాపేట మండలం పిన్నాయిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని సపావట్‌తండా, దాస్‌తండాలలో వివిధ పార్టీల నుంచి సుమారు 200 మంది సపావట్ తండాలో శనివారం జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్బంగా సోమిరెడ్డి మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే దృక్పథంతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకా న్ని ప్రవేశపెట్టారన్నారు.
మారుమూ ల ప్రాంతం నుంచి ఆస్పత్రికి సకాలంలో చేర్చేందుకు 108 పేరుతో అంబులెన్స్ పథకం, పేద, మద్యతరగతి కుటుంబాల పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ఎన్నో పథకాలు అందించినట్లు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో 70రూపాయలు ఉన్న సామాజిక పిం ఛను రూ.200కు పెంచి వృద్ధులను, వితంతువులు, వికలాంగులను ఆదరించారని వివరించారు. ప్రతి పేదవాడి గుండెల్లో ఆయన చిరస్థాయికి నిలిచిపోయారని కొనియాడారు.
మహానేత కుటుంబానికి అండగా నిలబడాలంటే ప్రతి ఒక్కరూ వైఎ స్సార్‌సీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌కు ఓటు వేసి అత్యధిక స్థానాల్లో గెలిపిం చాలని కోరారు. గత ఐదేళ్లుగా సూ ర్యాపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ తరఫున జెడ్పీటీసీగా బరిలో నిలిచిన భూక్యా చిలుకమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. అంతకు ముందు ఆయనకు తండావాసులు ఘనస్వాగతం పలికారు.
పార్టీలో చేరిన వారి లో భూక్యా సింధు, పాండు, రమేశ్, నరేశ్, స్వామి, భాస్కర్, నాగా, నంధు, నర్సింహ, పార్వతి, రాత్లా, భద్రు, రాత్ల భిక్షం, సపావట్ రాగ్యా, ఆంబోత్ మంగ్యా, రాములు, నం దు, సక్కుబాయితో పాటు సుమారు 200 మంది ఉన్నారు.
వైఎస్ హయాంలో అందరికీ సంక్షేమం
Published Sun, Mar 30 2014 1:19 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement