
నలుగురు పిల్లలూ ఒకేరోజు పుట్టారు!
అనుకోకుండా కొన్ని అద్భుతమైన సంఘటనలు జరుగుతుంటాయి. అవి అనుభవించే వారిలో ఆనందాన్ని, వినేవారిలో ఆసక్తిని కలిగిస్తాయి.
అరుదైన ఆనందం
అనుకోకుండా కొన్ని అద్భుతమైన సంఘటనలు జరుగుతుంటాయి. అవి అనుభవించే వారిలో ఆనందాన్ని, వినేవారిలో ఆసక్తిని కలిగిస్తాయి. బ్రిటన్‌కు చెందిన ఎమిలీ, పీటర్ దంపతులకు ఇలాంటివే కొన్ని సంఘటనలు అత్యంత ఆనందాన్ని ఇచ్చేవిగా మారాయి. అవి ఏమిటంటే వారి నలుగురు పిల్లలూ ఒకేరోజున జన్మించడం! ఒకేరోజున పిల్లలు పుట్టడం అంటే కవలలో, ముగ్గురు పిల్లలో అనుకుంటాం. కానీ ఎమిలీకి వేర్వేరు కాన్పులలో నలుగురు పిల్లలూ ఒకే తేదీన పుట్టారు. మొత్తం మూడు కాన్పుల్లో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిందామె. వీరి పెద్ద కొడుకు ఐదేళ్ల క్రితం జనవరి 12న పుట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు ఎమిలీకి అత్యవసర సిజేరియన్ ఆపరేషన్‌లో కవల ఆడశిశువులు పుట్టారు.
యాదృచ్ఛికంగా అది కూడా జనవరి 12వ తేదీనే! ఈ యేడాది జనవరి 12 వ తేదీన ఎమిలీ నాలుగో బేబీకి జన్మనిచ్చింది. ఇంత కో ఇన్సిడెంట్‌గా తమ పిల్లల పుట్టిన రోజులన్నీ ఒకే రోజు కావడంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. లోకల్ సెలబ్రిటీలే అయిపోయింది ఆ ఫ్యామిలీ అంతా. అత్యంత అరుదుగానే ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందని, ఎమిలీ దంపతులు అదృష్టవంతులు అయినందువల్ల వారి పిల్లల పుట్టిన రోజులన్నీ ఒకే రోజున వచ్చాయని అనుకుంటున్నారంతా!