
వాతావరణ మార్పుల ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా సౌరశక్తి లాంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఏర్పాటు చేసుకోవడం ఎక్కువ అవుతున్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ పరిణామం కాస్తా గల్ఫ్ దేశాల్లో ఒకరకమైన పోటీకి కూడా దారితీస్తోంది. ఈ క్రమంలో అబూదాబి ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. నూర్ అబూదాబీ అని పిలుస్తున్న ఈ సోలార్ ఫామ్‌లో ఏకంగా 1.177 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. దుబాయిలోని మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సోలార్ పార్కులో సామర్థ్యం ఒక గిగావాట్ కంటే ఇది కొంచెం ఎక్కువన్నమాట. నూర్ అబూదాబీని స్థానిక ప్రభుత్వంతోపాటు జపాన్‌కు చెందిన మారుబెని కార్పొరేషన్, చైనాకు చెందిన జింకో సోలార్ హోల్డింగ్‌లు సంయుక్తంగా నిర్మించాయి. మొత్తం ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు 32 లక్షల సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. దేశంలోని సహజవాయువు నిక్షేపాలను మరింత కాలం వాడుకునేందుకు వీలుగా తాము ఈ ప్రాజెక్టును చేపట్టనట్లు ప్రభుత్వం చెబుతోంది. సుమారు రెండు లక్షల పెట్రోలు, డీజిల్ కార్ల నుంచివ ఎలువడే కాలుష్యాన్ని ఈ సోలార్ ప్లాంట్ ద్వారా వాతావరణంలో కలవకుండా అడ్డుకోవచ్చునని చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment