వయసు 86 వేషాలు 365 | age 86 Characters 365 | Sakshi
Sakshi News home page

వయసు 86 వేషాలు 365

Published Sun, Dec 18 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

వయసు 86 వేషాలు 365

వయసు 86 వేషాలు 365

డాక్టరా? టైలరా? రెండూ! మిస్టర్‌ అలినీ కలిస్తే మీరు ఈ ఇద్దరినీ కలిసినట్టే. ఇద్దర్నే కాదు. ఇంకా చాలామందిని కలిసినట్టు. అంతేకాదు, దేశదేశాల వాళ్లని కలిసినట్టు. అలీ మొదట డాక్టర్‌. నాడి చూడ్డం, మందు చీటీలు రాయడం బోర్‌ కొట్టేసి, టైలరింగ్‌లోకి వచ్చేశారు. వయసు 86. వేషాలు 365. అలీ ఏడాదంతా రోజుకో డ్రెస్‌తో స్టెయిల్‌గా కనిపిస్తారు. ఆ డ్రెస్‌ చూసి అదిరిపోయి, అపరిచితులు కూడా ఆయనకు విష్‌ చేస్తుంటారు. అంత రిచ్‌గా ఉంటుంది అలీ లుక్‌. ఈయన్ది జర్మనీ.

నాలుగేళ్ల క్రితం జో స్పాటన్‌ అనే లేడీ ఫొటోగ్రాఫర్‌ అలీని గమనించి, ‘వావ్‌’ అనుకుని, ‘వండర్‌ఫుల్‌’ అనుకుని  ఫొటోలు తీసుకుంది. వాటిని తన బ్లాగులో పెట్టుకుంది. అలీ ఫేమస్‌ అయిపోయారు. అంతకన్నా కూడా ఆయనలోని ఉత్సాహం ఫేమస్‌ అయిపోయింది. జర్మనీ నుంచి టర్కీ వరకు అలీ నాలుగు దశాబ్దాల పాటు దేశాలన్నీ తిరిగారు. రోజుకో డ్రెస్‌లో ఆయన్ని చూస్తే, రోజుకో దేశాన్ని చూసినట్టు ఉంటుంది. ఎనర్జిటిక్‌ కదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement