గతంలో రొమ్ము క్యాన్సర్ వస్తే రొమ్ము తొలగించాల్సి వచ్చేది. కానీ అమెరికాలో లభ్యమయ్యే చికిత్స ఇప్పుడు మన హైదరాబాద్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌లోనే దొరుకుతుంది. దాంతో ఇప్పుడు రొమ్ము తొలగించాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి ఆపదా రాకుండా చికిత్స చేయడం సాధ్యమవుతుంది. అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటాలజిస్ట్‌లలో డాక్టర్ సుగుణ చిర్ల ఏకైక మహిళ. ఇలాంటి అత్యాధునిక విద్యార్హతలు కలిగిన నిపుణులున్న అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ లాంటి చోట్ల ఈ రొమ్ము క్యాన్సర్ చికిత్స మరింత సులభం. ఆ వివరాలు తెలుసుకోవడం కోసమే ఈ కథనం.
మన శరీరంలో నిత్యం వేల సంఖ్యలో కణాలు పుడుతూ, చనిపోతూ ఉంటాయి. ఈ ప్రక్రియ అంతా జన్యువుల నియంత్రణలో జరుగుతుంటుంది. కొన్నిసార్లు జన్యువుల నియంత్రణ తప్పి, కణవిభజన ప్రక్రియ అదుపుతప్పి కణాలు విశృంఖలంగా పుడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు అదనంగా ఏర్పడ్డ కణాలు ఒక కణితిగా రూపొందుతాయి. ఈ కణుతులు హానికరం కావుగాని... కొన్ని సందర్భాల్లో మాత్రం హానికరంగా పరిణమిస్తాయి. అవే క్యాన్సర్ కణుతులు. ఇది రొమ్ము భాగంలో ఏర్పడ్డప్పుడు దాన్ని రొమ్ము క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్ రొమ్ములోగాని, నిపుల్‌కు పాలను సరఫరా చేసే నాళాల్లోగాని రావచ్చు. కానీ ముందే గుర్తిస్తే రొమ్మును తొలగించకుండానే చికిత్స చేయవచ్చు.
క్యాన్సర్‌కు వయసును కూడా ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్‌గా పరిగణించవచ్చు. అలాగే రొమ్ము క్యాన్సర్ వంశపారంపర్యం కాదు. కాకపోతే తల్లికి, అక్కచెల్లెళ్లలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంటే రిస్క్ కాస్త ఎక్కువ. ఒకవేళ ఇదివరకు ఒక రొమ్ములో క్యాన్సర్ వస్తే రెండో రొమ్ముకూ వచ్చే అవకాశాలు ఉండవచ్చు. అంతేగాని వంశపారంపర్యంగా కానీ, ఒక రొమ్ముకు వస్తే మరో రొమ్ముకు తప్పనిసరిగా వస్తుందని చెప్పలేము.
లేటు వయసులో పెళ్లిళ్లు, గర్భధారణ...
పెరిగే వయసు రొమ్ము క్యాన్సర్‌కు ఒక రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పుకున్నాం. ముప్ఫయి ఏళ్లు దాటిన ప్రతి 233 మంది మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 60 ఏళ్లు దాటిన ప్రతి 27 మందిలో ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడవచ్చు. త్వరగా పెళ్లిచేసుకుని గర్భం దాల్చడం అన్నది రొమ్ము క్యాన్సర్ అవకాశాలను తగ్గించే అంశం. ఎందుకంటే గర్భధారణ వల్ల నెలసరులు తగ్గుతాయి. ఆ మేరకు ఈస్ట్రోజెన్ ప్రభావం కూడా తగ్గుతుంది. కాబట్టి రొమ్ముక్యాన్సర్‌కు అవకాశాలు కూడా తగ్గుతాయి.
రిస్క్‌ను తగ్గించే రొమ్ము పాలు: బిడ్డకు రొమ్ము పాలు పట్టడం కూడా రొమ్ముక్యాన్సర్ రిస్క్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. ఎంతకాలం బిడ్డకు రొమ్ము పాలు పడుతూ ఉంటే రొమ్ము క్యాన్సర్ రిస్క్ అంతగా తగ్గుతుంది. దీనివల్ల బిడ్డ కూడా ఆరోగ్యంగా ఎదుగుతుంది. కాబట్టి బిడ్డ పుట్టాక కనీసం ఏడాది పాటైనా రొమ్ము పాలు పట్టేలా చూసుకోవాలి.
గుర్తించడం ఎలా?: రొమ్ము క్యాన్సర్ కణుతుల్లో సాధారణంగా నొప్పి ఉండదు. కొన్నిసార్లు ఈ కణుతులు మెత్తగా ఉండవచ్చు. లేదా గట్టిగా కూడా ఉండవచ్చు. రొమ్ములో ఎలాంటి మార్పు కనిపించినా అశ్రద్ధ చేయకూడదు. రొమ్ములో వాపు, నొప్పి, నిపుల్స్ లోపలికి వెళ్లడం, ఎరుపెక్కడం, పాలు కాకుండా నిపుల్ నుంచి ఇతరత్రా ద్రవాలు స్రవించడం, చంకలో గడ్డలు ఏర్పడటం లాంటి మార్పులు కనిపిస్తే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. రొమ్ము క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స అంత సులువవుతుంది. పైగా పూర్తిగా నయమయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి. రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రఫీ అనే పరీక్ష చేస్తారు. దీనిద్వారా అతి సులువుగా, తక్కువ సమయంలో బయాప్సీ చేయవచ్చు. ఇప్పుడు ఆధునిక డిజిటల్ మామోగ్రఫిక్ ప్రక్రియలో బెడ్ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి సౌకర్యంగా కూర్చుని లేదా పడుకుని, అత్యంత వేగంగా ఒక నిమిషం కంటే తక్కువ సమయంలోనే ఫలితాలు పొందవచ్చు. మామోటోమ్ లాంటి పరికరాలు మరింత కచ్చితంగా మల్టిపుల్ బయాప్సీ చేస్తాయి. దాంతో రేడియేషన్ మోతాదు కూడా 50 శాతం తగ్గుతుంది. కాబట్టి రేడియేషన్ దుష్ర్పభావాలు కూడా తక్కువే.
పరిష్కారాలు: రొమ్ముక్యాన్సర్ అనగానే చాలామంది రొమ్ము తొలగించాల్సి వస్తుందేమోనని భయపడతారు. కానీ నిజానికి ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్స వల్ల రొమ్ము తొలగించకుండానే క్యాన్సర్‌కు చికిత్స చేసే వీలుంది. రొమ్ములో ఏర్పడ్డ చిన్న కణుతులను సర్జరీ ద్వారా తీసేస్తారు. అవే పెద్ద కణుతులైతే రెండుమూడు సార్లు కీమోథెరపీ ఇచ్చి వాటి పరిమాణం తగ్గించి, ఆ తర్వాత ఆపరేషన్ ద్వారా మిగిలిన కణుతులను కూడా తీసేస్తారు.
ఆంకోప్లాస్టిక్ సర్జరీ: పాడైన రొమ్ము ఆకృతిని సరిచేసే చికిత్స ఇది.
బ్రెస్ట్ రీ-కన్‌స్ట్రక్షన్: అసహజాకృతిలో ఉండే రొమ్మును సరిచేయడం.
బ్రెస్ట్ ఇంప్రూవ్‌మెంట్: ఇంప్లాంట్స్ ద్వారా రొమ్ము సైజ్‌ను పెంచడం.
బ్రెస్ట్ లిఫ్ట్: నిపుల్ దగ్గర చిన్న గాటు పెట్టి కావలసిన ఆకృతికి, పరిమాణానికి రొమ్మును సరిచే యడం.
కీమోథెరపీ: ఆపరేషన్ తర్వాత మిగిలిపోయిన క్యాన్సర్ కణాలను పూర్తిగా నాశనం చేయడానికి కీమోథెరపీ చేస్తారు. దీని వల్ల క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టే అవకాశం తగ్గుతుంది. అవసరాన్ని బట్టి మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ కూడా అందిస్తారు. ఈ తరహా చికిత్సను నాలుగోదశకు చేరిన క్యాన్సర్‌కు కూడా ఉపయోగించవచ్చు.
వీఎంఏటీ: దీన్నే వాల్యుమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ అంటారు. ఇది రేడియేషన్ మోతాదును తగ్గిస్తుంది. రెండు నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే ఈ చికిత్స పూర్తి చేయవచ్చు.
నివారణ చాలా సులభం: క్యాన్సర్ రాకుండా నివారించడం మన చేతిలో ఉన్నదే.
పెరిగే బరువు, స్థూలకాయం క్యాన్సర్‌కు కారణాలు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో బరువును నియంత్రించుకోవడం, స్థూలకాయం రాకుండా కాపాడుకోవడంతో క్యాన్సర్‌ను నివారించవచ్చు.
మంచి ఆహారంతో క్యాన్సర్ నివారణ చాలా తేలిక. మాంసాహారాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడం, కొవ్వు పదార్థాలను పరిహరించడం, తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం.
వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయటం
ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.
ఒత్తిడి, ఆందోళన లాంటి వాటికి దూరంగా ఉండటం క్షేమకరం.
రెండు పదుల వయసు దాటిన తరువాత ప్రతి మహిళ ఎక్కడైనా గడ్డల్లా ఉన్నాయేమోనని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. 40 ఏళ్లలోపు వాళ్లందరూ ప్రతి మూడేళ్లకు ఒకసారి డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవాలి. 40 దాటినవాళ్లు ప్రతి ఏటా పరీక్ష చేయించుకోవాలి. ప్రతి రెండేళ్లకు ఒకసారి డిజిటల్ మామోగ్రఫీ ద్వారా పరీక్ష చేయించుకోవడం మంచిది. 50 దాటితే ప్రతి ఏటా ఈ పరీక్ష తప్పనిసరి.
డాక్టర్ సుగుణ చిర్ల
ఎండీ, అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటాలజిస్ట్
అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్
శేరిలింగంపల్లి, హైదరాబాద్
email:drsuguna@americanoncology.com
ఇప్పుడు రొమ్ము క్యాన్సర్‌కు అమెరికా స్థాయి చికిత్స ఇక్కడే...!
Published Sat, Oct 19 2013 11:39 PM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM
Advertisement