వాహనాల పొగకు పిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మోటారు వాహనాల కారణంగా తలెత్తే వాయు కాలుష్యం కారణంగా చిన్నారులు ఉబ్బసం బారిన పడుతున్నారు. వాహనాల నుంచి వెలువడే నానా వాయువుల్లో ముఖ్యంగా నైట్రోజన్ ఆక్సైడ్ ప్రభావం వల్ల చిన్నారులు ఉబ్బసం బారిన పడుతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌పోర్ట్ స్టడీస్ శాస్త్రవేత్తలు ఇంగ్ల్లండ్‌లోని బ్రాడ్‌ఫోర్డ్ ప్రాంతాన్ని నమూనాగా తీసుకుని చేపట్టిన తాజా అధ్యయనంలో తేలింది.
వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువ మంది చిన్నారులు ఉబ్బసంతో బాధపడుతున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని లీడ్స్ వర్సిటీ నిపుణుడు డాక్టర్ హనీన్ ఖ్రీస్ తెలిపారు. వాహనాల కాలుష్యాన్ని అదుపు చేయగలిగితే, ఉబ్బసంతో బాధపడే చిన్నారుల సంఖ్యను చాలావరకు తగ్గించవచ్చని వెల్లడించారు. తమ అధ్యయనానికి బ్రాడ్‌ఫోర్డ్‌ను నమూనాగా తీసుకున్నా, ప్రపంచవ్యాప్తంగా వాహన కాలుష్యం ప్రభావం దాదాపు ఒకేవిధంగా ఉంటుందని డాక్టర్ ఖ్రీస్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment