బ్యూటిప్స్
ప్యాక్
కప్పు పెరుగులో టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్, టేబుల్ స్పూన్ నిమ్మరసం క లపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాలు వదిలేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే ట్యాన్ (ఎండ వల్ల ఏర్పడిన నలుపు) తగ్గడమే కాకుండా చర్మకాంతి పెరుగుతుంది.
బాత్
అరకప్పు గులాబీ రేకులను పేస్ట్ చేసి అందులో టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు కలపాలి. ఈ పేస్ట్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి, స్నానం చేయాలి. గులాబీల సుగంధం ఎండ వల్ల కలిగే ఒత్తిడి నుంచి త్వరగా ఉపశమనం పొందేలా చేస్తుంది. కొబ్బరిపాలు చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌ని అందిస్తాయి.
హెయిర్
గోరువెచ్చని గ్రీన్ టీని మాడుకు, శిరోజాలకు పట్టించి ఆరనివ్వాలి. తర్వాత నీళ్లతో తలంతా శుభ్రపరుచుకోవాలి. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు, కండిషనర్ ఎండ వల్ల కలిగే హానిని నివారించి, జుట్టు ఊడటాన్ని తగ్గిస్తాయి. గ్రీన్ టీలోని పోషకాలు శిరోజాలను పెంచడానికి దోహదం చేస్తాయి.
మసాజ్
చెరకురసంలో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాసి, వేళ్లతో మృదువుగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో ఒకసారి, వెచ్చని నీటితో ఒకసారి ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఈ విధంగా రోజూ చేస్తే ఎండ కారణంగా పొడిబారిన చర్మం తేమని పుంజుకుని ఆరోగ్యంగా తయారవుతుంది.
యాక్నె
వెనిగర్‌లో ఉప్పు కలిపి చిక్కటి మిశ్రమం తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని యాక్నె(చిన్న చిన్న మొటిమల గడ్డలు) మీద రాసి, మృదువుగా రబ్ చేయాలి. ఇరవై నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తే జిడ్డు తొలగడంతోపాటు మొటిమలు, యాక్నె, మచ్చలు తగ్గుతాయి.
సమ్మర్@ 5
Published Thu, May 28 2015 10:47 PM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM
Advertisement