బ్యూటిప్స్
cనికి చుబుకం కూడా ఓ కారణం. చాలామందికి గడ్డం కింద మరో చిరు గడ్డం వస్తుంటుంది. దాన్నే డబుల్ చిన్ అంటారు. కొంతమందికి ఇది వయసు పెరిగినప్పుడు వస్తుంది. మరికొందరికి జన్యులోపాల కారణంగా వస్తుంది. సౌందర్య స్పృహ ఎక్కువగా ఉన్నవారు ఈ డబుల్ చిన్‌తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ కింది విషయాలను పాటిస్తే చాలు..మీ సమస్య దూరమవుతుంది.
ఈ డబుల్ చిన్ నుంచి దూరమవ్వాలంటే ఫేషియల్ మజిల్స్‌కు పని చెప్పాల్సిందే. త్వరగా డబుల్ చిన్ సమస్య తొలగిపోవాలంటే రోజుకు వీలైనన్ని షుగర్ లెస్ గమ్స్‌ను నమలండి. ఎలాంటి దంత సమస్యలు రాకుండా మంచి ఫలితం కనిపిస్తుంది.
కొకో బటర్ వాడకంతో కూడా డబుల్ చిన్ త్వరగా తగ్గుతుంది. ఇది చర్మం సాగుదలకు బాగా దోహద పడుతుంది. దాని కోసం కొకో బటర్‌ను కొద్దిగా వేడి చేసి చాలాసేపు గొంతు, డబుల్ చిన్ ప్రాంతంలో మర్దన చేయాలి. ఉదయం స్నానానికి ముందు, రాత్రి నిద్రపోవడానికి ముందు ఇలా రోజుకు రెండుసార్లు చేయడం మంచి పరిష్కారం.
గోధుమ మొలకల నుంచి తీసిన నూనె (వీట్ జెర్మ్ ఆయిల్) ఈ డబుల్ చిన్ సమస్యను త్వరగా దూరం చేస్తుంది. అందులోని విటమిన్-ఇ చర్మాన్ని బిగుతుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు 10-15 నిమిషాల పాటు ఈ నూనెతో గొంతుకు కింది నుంచి మీదకు మర్దన చేయాలి. ఆ నూనెను తుడుచుకోకుండానే నిద్రపోవాలి. ఉదయం లేచాక చల్లటి నీటిలో ముంచిన టిష్యూతో నూనెను తుడిచేయాలి.
గుడ్డు తెల్లసొనతో ప్యాక్ వేసుకుంటే డబుల్ చిన్ తగ్గే అవకాశాలు ఎక్కువే. ఓ గిన్నెలో రెండు కోడిగుడ్ల తెల్లసొనను తీసుకోవాలి. అందులో పాలు, తేనె, నిమ్మరసం కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్, మెడకు ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే స్కిన్ టైట్ అవుతుంది. దాంతో డబుల్ చిన్ మాయమవుతుంది.
వ్యాయామం ప్రధానం: ముందు ఒక కుర్చీలో వెన్నెముకను నిటారుగా పెట్టి కూర్చోవాలి. తర్వాత తలను పైకి ఎత్తి ఫ్యాన్‌ను చూస్తూ, అలకలో ఉన్నప్పుడు మూతిని ఎలా ముడుచుకుంటారో అలా పెట్టి పది సెకన్లు ఉండాలి. ఇలా కొన్ని వారాల పాటు రోజూ ఆరు సార్లు చేయాలి. దాంతో డబుల్ చిన్ తప్పకుండా మాయమవుతుంది.
డబుల్ చిన్ ఢమాల్..
Published Wed, Sep 23 2015 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 AM
Advertisement
Advertisement