Facial cosmetics
-
ఫేషియల్ క్రీమ్ ....ప్రాణాల మీదకు తెచ్చింది..
కాలిఫోర్నియా: అతివలు తమ ముఖ సౌందర్యం కోసం పలు రకాల ఫేషియల్ క్రీమ్‌లు వాడతారన్న విషయం తెలిసిందే. ఇవి వారి ముఖానికి మరింత నిగారింపు ఇస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ శాక్రమెంటోలోని ఓ మహిళ పాలిట ఫేషియల్ క్రీమ్... శాపంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మెక్సికో నుంచి దిగుమతి చేసుకున్న పాండ్స్ లేబుల్ ఉన్న ఫేస్ క్రీమ్‌ను ఓ మహిళ ఉపయోగించడం వల్ల ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలిచంగా... ఆమె వాడిన క్రీములో హాని కలిగించే మిథైల్ మెర్క్యూరీ కలిపినట్లు కౌంటీ వైద్య విభాగం నిర్ధారించింది. కాగా ఆ క్రీమ్‌ను తయారుచేసిన సమయంలో అందులో మిథైల్ మెర్క్యూరీని కలవలేదని తెలిపింది. థర్డ్ పార్టీ వాళ్లు కలిపి వినియోగదారులకు విక్రయించినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మిథైల్ మెర్క్యూరీ హానికరమైందని.. దీని కారణంగా జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఆందోళన, నిరాశ, తలనొప్పి, వణుకు వంటి లక్షణాలు వస్తాయని తెలిపారు. కాగా ఈ విషయంపై పాండ్స్ కంపెనీ స్పందించింది. ఈ క్రీమును స్కిన్ లైట్‌నర్‌గా.. మచ్చలు, ముడతలు తొలగించడానికి మహిళలు ఉపయోగిస్తారని.. తమ ఉత్పత్తుల్లో మెర్కూరీని ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించమని స్పష్టం చేసింది. తమ ఉత్పత్తులు( క్రీమ్‌లు) సురక్షితంగా ఉండేలా రిటైలర్లతో కలిసి పనిచేస్తామని తెలిపింది. ఏదేమైనా తమ లేబుల్ ఉన్న క్రీమ్ వాడి ఆస్పత్రిపాలైన మహిళ పట్ల ఆందోళన చెందుతున్నామని తెలిపింది. అదేవిధంగా తాము ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి అధికారులను నియమిస్తామని పేర్కొంది. అధికారికంగా లోగో, లేబుల్స్ ఉన్న పాండ్స్ ఉత్పత్తులను మాత్రమే కొనాలని వినియోగదారులకు విఙ్ఞప్తి చేసింది. -
డబుల్ చిన్ ఢమాల్..
బ్యూటిప్స్ cనికి చుబుకం కూడా ఓ కారణం. చాలామందికి గడ్డం కింద మరో చిరు గడ్డం వస్తుంటుంది. దాన్నే డబుల్ చిన్ అంటారు. కొంతమందికి ఇది వయసు పెరిగినప్పుడు వస్తుంది. మరికొందరికి జన్యులోపాల కారణంగా వస్తుంది. సౌందర్య స్పృహ ఎక్కువగా ఉన్నవారు ఈ డబుల్ చిన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ కింది విషయాలను పాటిస్తే చాలు..మీ సమస్య దూరమవుతుంది. ఈ డబుల్ చిన్ నుంచి దూరమవ్వాలంటే ఫేషియల్ మజిల్స్‌కు పని చెప్పాల్సిందే. త్వరగా డబుల్ చిన్ సమస్య తొలగిపోవాలంటే రోజుకు వీలైనన్ని షుగర్ లెస్ గమ్స్‌ను నమలండి. ఎలాంటి దంత సమస్యలు రాకుండా మంచి ఫలితం కనిపిస్తుంది. కొకో బటర్ వాడకంతో కూడా డబుల్ చిన్ త్వరగా తగ్గుతుంది. ఇది చర్మం సాగుదలకు బాగా దోహద పడుతుంది. దాని కోసం కొకో బటర్‌ను కొద్దిగా వేడి చేసి చాలాసేపు గొంతు, డబుల్ చిన్ ప్రాంతంలో మర్దన చేయాలి. ఉదయం స్నానానికి ముందు, రాత్రి నిద్రపోవడానికి ముందు ఇలా రోజుకు రెండుసార్లు చేయడం మంచి పరిష్కారం. గోధుమ మొలకల నుంచి తీసిన నూనె (వీట్ జెర్మ్ ఆయిల్) ఈ డబుల్ చిన్ సమస్యను త్వరగా దూరం చేస్తుంది. అందులోని విటమిన్-ఇ చర్మాన్ని బిగుతుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు 10-15 నిమిషాల పాటు ఈ నూనెతో గొంతుకు కింది నుంచి మీదకు మర్దన చేయాలి. ఆ నూనెను తుడుచుకోకుండానే నిద్రపోవాలి. ఉదయం లేచాక చల్లటి నీటిలో ముంచిన టిష్యూతో నూనెను తుడిచేయాలి. గుడ్డు తెల్లసొనతో ప్యాక్ వేసుకుంటే డబుల్ చిన్ తగ్గే అవకాశాలు ఎక్కువే. ఓ గిన్నెలో రెండు కోడిగుడ్ల తెల్లసొనను తీసుకోవాలి. అందులో పాలు, తేనె, నిమ్మరసం కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్, మెడకు ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే స్కిన్ టైట్ అవుతుంది. దాంతో డబుల్ చిన్ మాయమవుతుంది. వ్యాయామం ప్రధానం: ముందు ఒక కుర్చీలో వెన్నెముకను నిటారుగా పెట్టి కూర్చోవాలి. తర్వాత తలను పైకి ఎత్తి ఫ్యాన్‌ను చూస్తూ, అలకలో ఉన్నప్పుడు మూతిని ఎలా ముడుచుకుంటారో అలా పెట్టి పది సెకన్లు ఉండాలి. ఇలా కొన్ని వారాల పాటు రోజూ ఆరు సార్లు చేయాలి. దాంతో డబుల్ చిన్ తప్పకుండా మాయమవుతుంది.