నల్లమచ్చలకు ఉల్లిరసం..
బ్యూటిప్స్
ఉల్లిరసంలో కొద్దిగా దూది ఉండ ముంచి ముఖం మీది నల్లమచ్చలపై రుద్దాలి.ఇలా రోజూ నిద్రపోయే ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రెండు టేబుల్‌స్పూన్ల నిమ్మరసంలో ఒక టేబుల్ స్పూన్ వేప పొడి వేసి బాగా కలపాలి. ఆ పేస్ట్‌ను వారానికి రెండుసార్లు ఫేస్‌కు ప్యాక్ వేసుకుంటే మొటిమలు తగ్గుతాయిఅందానికి సూచికగా భావించే కనురెప్పలు రాలిపోకుండా ఉండాలంటే ఈ చిట్కా పాటించండి. కనురెప్పలకు బాదం నూనెతో రోజూ మసాజ్ చేసుకుంటే సరి.
చిటికెడు కుంకుమ పువ్వును పెరుగులో 10 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత దాన్ని పెదాలపై రోజుకు రెండు, మూడుసార్లు రాసుకుంటే మంచి రంగు వస్తుంది.