పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published Tue, Jun 16 2015 11:09 PM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: లియాండర్ పేస్ (టెన్నిస్ క్రీడాకారుడు),అమృతారావ్ (నటి, మోడల్)

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 4. వీరికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమా అన్నట్లుంటుంది. మంచి భావవ్యక్తీకరణ, వాక్పటిమ కలిగి ఉండటం వల్ల ప్రతి అంశాన్నీ తమకు అనుకూలంగా మలచుకోగలుగుతారు. కొత్త పరిచయాలు ఏర్పడి, వాటిని లాభదాయకంగా మార్చుకోగలుగుతారు. కొత్త ఆస్తులు సమకూర్చుకుంటారు. రాహుగ్రహ ప్రతికూలత వల్ల కోర్టు వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మొండిగా ప్రవర్తించకుండా, సామరస్య ధోరణి అవలంబించడం మంచిది. అవివాహితులకు ఈ సంవత్సరం మంచి సంబంధాలు కుదిరి, అనుకూలమైన జీవిత భాగస్వామి లభిస్తారు. అయితే, ప్రేమ వ్యవహారాలు అనుకూలించక పోవచ్చు. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారి కోరిక నెరవేరుతుంది. రాజకీయనాయకులకు పదవులు వరిస్తాయి. మితిమీరిన క్రమశిక్షణ పాటించడం వల్ల తోటి ఉద్యోగుల అసహనానికి, విమర్శలకు గురవుతారు.

లక్కీ నంబర్స్: 4,5,6,8; లక్కీ కలర్స్: వయొలెట్, క్రీమ్, పర్పుల్, బ్లూ, ఎల్లో; లక్కీడేస్: శని, ఆది, బుధవారాలు.
సూచనలు: నవగ్రహారాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవటం, అనాథలను, వృద్ధులను ఆదరించడం.
- డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement