పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published Wed, Jun 17 2015 11:02 PM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:అవిల్లా హాలండ్ (అమెరికన్ టీవీ నటి)రవింద్ స్వామి (తమిళ నటుడు)
 
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 5. ఈ సంవత్సరం వీరికి అన్ని విఘ్నాలు, ఆటంకాలు తొలగిపోయి, అనుకోని అవకాశాలు వస్తాయి. ఇది బుధునికి సంబంధించిన సంఖ్య అయినందువల్ల ఏ కార్యాన్నైనా తెలివితేటలతో చేసి, కార్యజయం పొందుతారు. విద్యార్థులు ఈ సంవత్సరం చదువులో చాలా మంచి మార్కులు సాధిస్తారు. కాంపిటీటివ్ పరీక్షలలో విజయం సాధిస్తారు. రచయితలకు, మీడియా వ్యక్తులకు, అధ్యాపకులకు, పాత్రికేయులకు, కంప్యూటర్ రంగ నిపుణులకు, సినీనటులకు అనుకూలమైన సమయం. విదేశాలలో విద్య, ఉద్యోగ, వ్యాపారాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండటం అవసరం.

లక్కీ నంబర్స్: 1,3,5,6,9; లక్కీ కలర్స్: రెడ్, గ్రీన్, వైట్, శాండల్, బ్లూ; లక్కీ డేస్: మంగళ, బుధ, గురువారాలు.
సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయటం, రక్తదానం చేయటం, పేదవిద్యార్థులకు పుస్తకాలు దానం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
 - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement