లేని అమ్మాయికి కాని రేప్... | But the rape of a girl who does not ... | Sakshi
Sakshi News home page

లేని అమ్మాయికి కాని రేప్...

Published Wed, Jan 27 2016 7:32 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

లేని అమ్మాయికి  కాని రేప్... - Sakshi

లేని అమ్మాయికి కాని రేప్...

నిజం నిదానంగా చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టివస్తుందట.  సరిగ్గా ఇలాంటిదే ఈ కథ! కామోగెలో పీటర్సన్ అనే ఒక అమ్మాయి రేప్‌కి గురైందని సౌతాఫ్రికాకి చెందిన ఖుతి మెకానానిసె అనే ఒకమ్మాయి ట్వీట్ చేసింది. ఒకటి కాదు. రెండు కాదు... ఏకంగా డెబ్భయి ట్వీట్లు చేసింది. ఆ కథ నిజమో కాదో తెలుసుకోకుండా పత్రికలు ప్రచురించాయి, ట్విట్టర్ వీరులు స్పందించారు. సోషల్ మీడియా సలసల మరిగింది. ఆఖరికి ప్రభుత్వ విభాగాలు సైతం స్పందించాయి.

కొందరైతే బాధతో దేశం వదిలేస్తామని మన ఆమీర్ ఖాన్‌లా ప్రకటించేశారు. అంతలో ఖుతి నెమ్మదిగా అసలు విషయాన్ని బయటపెట్టింది. లేని కామోగెలోపై జరగని రేప్ గురించి తాను కట్టు కథ అల్లానని ఒప్పుకుంది. పైగా మహిళలపై అత్యాచారాలను ఎత్తి చూపేందుకే తానిలా చేశానని చెప్పి దులిపేసుకుంది. అంతా బాగుంది. కానీ ఇలాంటి చీప్ ట్రిక్కులు అసలైన ఇష్యూలను నాన్నా పులి కథలా మార్చేసే ప్రమాదం కూడా ఉందని ఖుతిలాంటి వాళ్లు గుర్తుంచుకోవాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement