జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్లితీరాలని కోరుకునే యాత్ర. వెళ్లే మార్గం సంక్లిష్టమైనదైనా ప్రకృతి సోయగాలలో ప్రశాంతతను పొందాలని ఆకాంక్షించే యాత్ర. హిమాలయ పర్వత శ్రేణులలో వెలసిన ఆరాధ్య దైవాలను దర్శించి, తరించాలని తపించే యాత్ర. అదే, అతిపవిత్రమైన చార్ ధామ్ యాత్ర.
గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను ఒకేసారి సందర్శించుకొని రావటాన్ని ‘చార్‌ధామ్ యాత్ర’ అంటారు. సంవత్సరంలో ఆరు నెలల పాటు దేవతలు పూజిస్తారని పేరొందిన ఈ నాలుగు ఆలయాలను మిగిలిన ఆరు నెలల కాలంలో మానవులు సందర్శించుకోవచ్చు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాల ద్వారాలు ప్రతి సంవత్సరం మే మొదటి వారంలో తెరుస్తారు. తిరిగి నవంబర్‌లో దీపావళి పర్వదినం తర్వాత మూసివేస్తారు. ఈ నాలుగు ఆలయాలూ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. గంగానది, యమునా నది జన్మస్థలాలను గంగోత్రి, యుమునోత్రి అంటారు. అలాగే బద్రీనాథ్‌లో శ్రీ మహావిష్ణువు, కేదార్‌నాథ్‌లో శివుడు స్వయంభువుగా వెలిసినట్టు పురాణాలు చెబుతున్నాయి.
యమునోత్రి
చార్‌ధామ్ యాత్రలో మొదటగా దర్శించుకునే ధామం (క్షేత్రం) యమునోత్రి. యమునానది జన్మస్థలంలోనే యమునాదేవి ఆలయం ఉంది. యమునానది ప్రాశస్త్యం గురించి ఒక్కో పురాణం ఒక్కో కథను వివరిస్తున్నాయి. ప్రముఖంగా చెప్పుకునేది – సూర్యదేవుడి అర్ధాంగి ఛాయాదేవి. వీరికి యముడు, యమున సంతానం. ఛాయాదేవికి కూతురైన యమున మీద ఒకానొక సమయంలో ఆగ్రహం కలిగి భూలోకంలో పడి ఉండమని శపించిందట. దాంతో యమున భూలోకంలో నదిగా అవతరించిందట.
గంగోత్రి
చార్‌ధామ్ యాత్రలో సులువుగా చేరుకోగలిగే ప్రాంతం గంగోత్రి. ఈ నది జన్మస్థలం ఉత్తరాఖండ్‌లోని ఉత్సర కాశీ జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. సముద్రమట్టానికి 3,750 మీటర్ల ఎత్తులో హిమాలయ పర్వత శ్రేణులలో ఉంది. నదులన్నింటిలో గంగానది పరమపవిత్రమైనదిగా పూజలందుకుంటోంది. గోముఖం నుండి గంగోత్రి చేరే వరకు ఈ ప్రవాహంలోని నీటికి ఎక్కడా మానవ స్పర్శ అంటదు. అందువల్లే తమిళనాడు రామేశ్వరంలోని లింగేశ్వరస్వామికి నిత్యాభిషేకం గంగోత్రి నీటితోనే చేస్తారు.
కేదార్‌నాథ్
అత్యున్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది కేదార్‌నాథ్. వైశాఖమాసంలో అంటే ఏప్రిల్ ఆఖరి వారం లేదా మే నెల మొదటి వారంలో తెరుస్తారు. తిరిగి అక్టోబరు నెల ఆఖరి వారం లేదా నవంబరు మొదటి వారంలో మూసివేస్తారు. నరనారాయణులు కేదారనాథుని అనుమతి తీసుకొని, బదరీనాథ్‌లో తపస్సు చేశారని స్థలపురాణం చెప్తోంది.
బద్రీనాథ్
జగద్గురు ఆదిశంకరుల వారు నెలకొల్పిన ఈ క్షేత్రంలో అన్ని తీర్థాలలోని సమస్త దేవతలూ నివసిస్తారనీ నమ్మకం. ఈ ఆలయంలో వైశాఖం నుండి కార్తీక మాసం వరకు మానవులు, మార్గశిరం నుండి చైత్రమాసం చివరి వరకు నారద మహర్షి స్వామికి పూజలు చేస్తారని కథనాలు. గర్భాలయంలో ఉత్సవమూర్తితో పాటు స్వామి ఎడమవైపున నరనారాయణులు శ్రీదేవి– భూదేవి, నారదుడు, ఉద్ధవుడు... కుడివైపున కుబేరుడు, గరుత్మంతుడు కొలువుదీరి ఉన్నారు. పితరులకు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే వారికి మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
చార్‌ధామ్, అమర్‌నాథ్ యాత్రలో RVటూర్స్ – ట్రావెల్స్
తెలుగు రాష్ట్రాలలోనే పేరెన్నికగన్న RVటూర్స్ – ట్రావెల్స్ గత 15 ఏళ్లుగా కొన్ని వేలమందికి యాత్ర దర్శనాలను అందిస్తూ అనతి కాలంలోనే తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్‌గా పేరొందింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక ప్యాకేజీలతో సకల సదుపాయాలతో అనుభవజ్ఞులైన టూర్ మేనేజర్లతో అద్భుతమైన చార్‌ధామ్, అమరనాథ్ యాత్రల దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది. చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ చివరి వారం, మే నెలలో ఉండగా అమర్‌నాథ్ యాత్ర జూన్ 14, జూన్ 30, జులై 5, 2017 తేదీలలో చేయవచ్చు. అనేక పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శింపజేసే తెలుగు వారి ఆత్మీయ ట్రావెల్స్ RV టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మీరూ ఈ యాత్రలను చేయవచ్చు. మరింత సమాచారం కోసం RVటూర్స్ – ట్రావెల్స్ వారిని సంప్రదించగలరు.
చార్‌ధామ్ యాత్ర
Published Sat, Apr 1 2017 12:04 AM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM
Advertisement
Advertisement