ధనమేరా అన్నిటికీ మూలం... | children and Money: Teaching Children Money Habits for | Sakshi
Sakshi News home page

ధనమేరా అన్నిటికీ మూలం...

Published Wed, Dec 9 2015 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 1:42 PM

ధనమేరా అన్నిటికీ మూలం...

ధనమేరా అన్నిటికీ మూలం...

పరిపరి శోధన
‘ధనమేరా అన్నిటికీ మూలం...’ అని తెలుగు సినీకవి ఏనాడో చెప్పిన మాట అక్షర సత్యమని ఒక తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా డబ్బు మనుషుల్లో స్వార్థాన్ని పెంచుతుందని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలోని మిన్నెసోటా వర్సిటీకి చెందిన కార్ల్‌సన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఇల్లినాయీ వర్సిటీ పరిశోధకులు వివిధ దేశాలకు చెందిన 550 మంది చిన్నారులపై పరీక్షలు జరిపి ఈ విషయాన్ని నిగ్గు తేల్చారు.

మూడు నుంచి ఆరేళ్ల వయసు లోపు పిల్లల చేతికి డబ్బు ఇచ్చి, వారి ప్రవర్తనను నిశితంగా పరిశీలించారు. ఆ వయసు చిన్నారులకు డబ్బు విలువ అర్థం కాకున్నా, చేతికి డబ్బు వచ్చే సరికి వారి ప్రవర్తన స్వార్థపూరితంగా మారిందని ఈ పరిశోధకులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement