దొంగచాటు పెళ్లిళ్లకు... చట్టం చుట్టమై రాదు | Clandestine marriage to ... the law does not cuttamai | Sakshi
Sakshi News home page

దొంగచాటు పెళ్లిళ్లకు... చట్టం చుట్టమై రాదు

Published Mon, May 23 2016 3:14 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

దొంగచాటు పెళ్లిళ్లకు... చట్టం చుట్టమై రాదు

దొంగచాటు పెళ్లిళ్లకు... చట్టం చుట్టమై రాదు

కేస్ స్టడీ


రమేష్, అజయ్, శ్రీనివాస్‌లు మంచి స్నేహితులు. వారంతా ‘కాంపస్’ హాస్టల్‌లో ఉంటూ ఉన్నత చదువులు చదువుతున్నారు. ఒక రోజు ఉన్నట్లుండి వీరి కామన్ ఫ్రెండ్ సుధీర్‌ను పోలీసులు ఎక్కడికో పిలిపించి బాగా కొట్టి కేస్ పెట్టారని, పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడని తెలిసింది. వెంటనే క్యాంపస్ మిత్రులంతా వెళ్లి స్టేషన్ బెయిల్ ఇప్పించి సుధీర్‌ను బయటకు తెచ్చుకున్నారు. అదే రోజు న్యాయవాదిని సంప్రదించారు. సుధీర్‌ను అన్ని విషయాలు వివరంగా అడిగిన న్యాయవాది అతనిపై నిర్భయ చట్టం క్రింద కేస్ బుక్ అయిందని చెప్పారు. సుధీర్ నివ్వెరపోయాడు. ఆ కేస్ పెట్టిన అమ్మాయితో తనకు నాలుగేళ్లుగా సంబంధం ఉందని, రహస్యంగా తాళి కట్టానని, పెద్దలను ఎదిరించలేక తనపై కేస్ పెట్టిందని వాపోయాడు. తల్లిదండ్రులు కడుపు కట్టుకొని హాస్టళ్లలో ఉంచి చదివిస్తుంటే మీరేమో ప్రేమ వ్యవహారాల్లో ఇరుక్కొని బంగారంలాంటి భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని న్యాయవాది ఆవేదన వ్యక్తం చేస్తూ, రహస్యంగా తాళికట్టి సంసారం చేస్తే అది వివాహం కాదని చెప్పారు.


ఇద్దరూ హాస్టల్స్‌లో ఉంటూ, అదీ ఆ అమ్మాయి వేరే జిల్లాలో హాస్టల్‌లో ఉంటూ, ఫ్రెండ్స్ రూమ్స్‌లో దొంగచాటుగా కలిస్తే అది వివాహమెలా అవుతుందని, అది చెల్లదని స్పష్టం చేశారు. ఒకవేళ తాళి కడితే, దానికి ఎవరైనా సాక్ష్యం ఉండాలని, కనీసం ఫొటోలైనా ఉండాలని, లేకుంటే ఎక్కడైనా కలిసి కాపురం చేసినట్లు దాఖలాలైనా ఉండాలని అన్నారు. వారి మధ్య ప్రేమ కంటే ఆకర్షణ ఎక్కువగా ఉందని, ఆ అమ్మాయిని బలవంతంగా తన భార్య అని రప్పించుకొనే అవకాశం లేదని, అలా చేస్తే అది ఇంకో కేస్ కిందకు వస్తుందని తెలియచేశారు. ఆవేశంతో ఊగిపోతూ అమ్మాయిలంతా మోసగత్తెలంటూ వచ్చిన మిత్రబృందం సుధీర్ చేసిన పిచ్చి పనికి బాధపడి బెయిలబుల్ సబ్‌సెక్షన్ కింద కేస్ బుక్ చేసిందుకు కాస్త ఊరట చెందుతూ లాయర్‌గారి సలహా ప్రకారం కాంప్రమైజ్‌కు వచ్చేలా, కేస్ ఎత్తివేసేలా ఆ అమ్మాయిని ఒప్పించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కనుక ఎవ్వరికీ తెలియకుండా, జీవితంలో స్థిరపడకుండా, వేరే వేరే ఊళ్లలో ఉంటూ, ఎక్కడో కలుసుకుంటూ, కుదరకపోతే బెదిరిస్తూ ఉంటే సుధీర్‌లాగా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. విలువైన భవిష్యత్తుకు భంగం వాటిల్లుతుంది. కుటుంబ సభ్యులకు మనోవేదన మిగులుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement