క్రియాటిన్‌కూ, కిడ్నీకీ సంబంధం ఏమిటి?
నా వయసు 42. నాది డెస్క్ జాబ్ కావడం వల్ల రోజుకు కనీసం 10 -12 గంటలకు పైగా కూర్చుని పని చేయవలసి వస్తుంది. ఇటీవల కాజువల్‌గా హెల్త్ చెకప్ జరిగినప్పుడు, క్రియాటినిన్ 1.7 ఉన్నట్లుగా రిపోర్టు వచ్చింది. కిడ్నీ స్పెషలిస్ట్‌కు తప్పక చూపించాల్సిందిగా మా కంపెనీ డాక్టర్ సలహా ఇచ్చారు. క్రియాటినిన్‌కూ, కిడ్నీకీ సంబంధం ఏమిటి? క్రియాటినిన్ తగ్గడానికి ఏవైనా మార్గాలుంటే చెప్పండి.
- డిబి., హైదరాబాద్
మూత్రపిండాల (కిడ్నీ) పనితీరును తెలుసుకోవడానికి చేసే పరీక్షల్లో క్రియాటినిన్, బ్లడ్ యూరియా చాలా ముఖ్యమైనవి. సాధారణంగా శరీరంలో క్రియాటినిన్ పరిమాణం 0.5 ఎంజీ/డీఎల్ నుంచి 1.2 ఎంజీ/డీఎల్ వరకు ఉండాలి. అదే బ్లడ్ యూరియా అయితే 20 ఎంజీ/డీఎల్ నుంచి 40 ఎంజీ/డీఎల్ ఉండవచ్చు. ఒకవేళ క్రియాటినిన్ పరిమాణం 1.5 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీ పనితీరు సామర్థ్యం తగ్గినదానికి ఒక సూచనగా పరిగణించాలి. అదే క్రియాటినిన్ పరిమాణం 4 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీ పనితీరు 80 శాతం నుంచి 90 శాతం వరకు తగ్గినట్లుగా భావించాలి.
శరీరంలో క్రియాటినిన్ పెరగడానికి ప్రధానమైన కొన్ని కారణాలు... హైబీపీ, డయాబెటిస్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, ప్రోస్టేట్ గ్రంథి వాపు, నొప్పి నివారణ మందులు దీర్ఘకాలంపాటు వాడటం, ఉప్పు, మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని రోజూ తీసుకోవడం వంటివి.
ఒకవేళ క్రియాటినిన్ పరిమాణం1.5 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా వస్తే కేవలం కిడ్నీకి సంబంధించిన పరీక్షలే కాకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటివి కూడా చెక్ చేయించుకుని కిడ్నీ స్పెషలిస్ట్‌ను కలవాలి. వయసు పెరిగేకొద్దీ శరీరంలో క్రియాటినిన్ పరిమాణం పెరగకుండా ఉండాలంటే రోజూ 3-4 లీటర్ల నీటిని తాగుతూ, అరగంటకు తగ్గకుండా ఒళ్లు అలిసేలా వ్యాయామం చేస్తూ, మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి.
మీరు చెప్పిన విధంగా అదేపనిగా గంటలు గంటలు కూర్చుండటం వల్ల క్రియాటినిన్ పెరుగుతుందనే అంశంపై ఇంకా శాస్త్రీయమైన నిరూపణలేమీ లేనప్పటికీ, మీరు వైర్‌లెస్ ఇంటర్నెట్ ఉపయోగాన్ని వీలైనంతగా తగ్గించడం, బాగా వేడిని వెలువరించే ల్యాప్‌టాప్‌లను శరీరానికి వీలైనంత దూరంగా ఉంచి ఉపయోగిస్తే మంచిది. మధ్య మధ్య వీలైనంత విశ్రాంతి తీసుకోవడం అవసరం.
యాండ్రాలజీ కౌన్సెలింగ్
Published Thu, Jul 23 2015 10:44 PM | Last Updated on Sun, Sep 3 2017 6:02 AM
Advertisement
Advertisement