శక్తిమంతమైన కార్టూన్ మహిళను సృష్టించండి | Create powerful cartoon woman | Sakshi
Sakshi News home page

శక్తిమంతమైన కార్టూన్ మహిళను సృష్టించండి

Published Thu, Mar 19 2015 10:50 PM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM

శక్తిమంతమైన కార్టూన్ మహిళను సృష్టించండి

శక్తిమంతమైన కార్టూన్ మహిళను సృష్టించండి

ఆపిల్ ఐ-ప్యాడ్ గెలుచుకోండి
 
 
‘వండర్  ఉమెన్’, ‘ఎక్స్ మెన్ స్టార్మ్’, ‘కమలాఖాన్’, ‘మిస్ మార్వెల్’ల వంటి అత్యంత శక్తిమంతమైన మహిళా కార్టూన్ సూపర్ హీరోను సృష్టించే సృజనాత్మకత మీలో ఉందా? అయితే సాక్షి ‘ఫ్యామిలీ’, యు.ఎస్.కాన్సులేట్ జనరల్ (హైదరాబాద్) కలిసి నిర్వహిస్తున్న ఈ పోటీ మీ కోసమే.
 
నిబంధనలు


పోటీలో పాల్గొనేవారు 14-21 సంవత్సరాల మధ్య వయసు గల విద్యార్థినీ విద్యార్థులై, భారత పౌరులై ఉండాలి. ఒక మహిళా కార్టూన్ సూపర్ హీరోయిన్‌ని సృష్టించి, ఆమెకో పేరు ఇవ్వాలి.  మామూలు మనుషులకు లేని అద్భుత శక్తి ఆమెకు ఉండి, ఆ శక్తితో ఆమె తన చుట్టూ ఉండే వ్యక్తులను లేదా సమాజాన్ని  కాపాడగలగాలి.
 
మీరు సృష్టించిన ఆ మహిళా కార్టూన్ సూపర్‌హీరో పాత్రకు ప్రేరణ ఏమిటి? ఆ సూపర్ హీరోకి ఉన్న అద్భుత శక్తి ఏమిటి? ఆ శక్తి ఎలా, ఎక్కడి నుంచి వచ్చింది? సమాజం కోసం ఆ శక్తిని మీ సూపర్ హీరో ఎలా ఉపయోగిస్తుంది అనే వాటిని మీరు కథలా రాసి పంపించాలి. ఆ సూపర్‌హీరో బొమ్మను కూడా గీసి, కథకు జతపరచాలి. కథను చిన్న కార్టూన్ స్ట్రిప్‌లా నడిపించి పంపితే మరీ మంచిది.
 
బహుమతి

 
విజేతగా నిలిచినవారి సూపర్ హీరో కథను లేదా కామిక్ స్ట్రిప్‌ను ‘సాక్షి’ ఫ్యామిలీ ప్రచురిస్తుంది. విజేత ఇంటర్వ్యూ కూడా సాక్షి ఫ్యామిలీలో వస్తుంది. వీటితో పాటు యు.ఎస్.కాన్సులేట్ తరఫున విజేత ఆపిల్ ఐ ప్యాడ్ మినీని కూడా సొంతం చేసుకుంటారు.మీ మహిళా కార్టూన్ సూపర్ హీరో కథను, బొమ్మను పంపవలసిన మెయిల్ ఐడి: జిడఛ్ఛీట్చఛ్చఛీఞ్చఃజఝ్చజీ.ఛిౌఝ.
 
గడువు తేదీ: 25 మార్చి 2015.
మరింత సమాచారం కోసం యు.ఎస్.కాన్సులేట్ జనరల్, హైదరాబాద్ ఫేస్‌బుక్ పేజీని చూడండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement