గీత స్మరణం | dandalayya undralayya song from Coolie No1 | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Published Sun, Sep 8 2013 11:56 PM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM

గీత స్మరణం

గీత స్మరణం

సాకీ:  
జై జై జై జై... గణేష జై జై జై జై...
జైజై జై జై... వినాయక జై జై జై జై...

పల్లవి:


దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ
నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ
పిండి వంటలారగించీ తొండమెత్తి దీవించయ్యా
తండ్రివలె ఆదరించి తోడు నీడ అందించయ్యా... ఓ...
దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ
నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ
 
చరణం : 1


చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర     
పాపం కొండంత నీ పెనుభారం
ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా
హోహోహో జన్మ ధన్యం
చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర
పాపం కొండంత నీ పెనుభారం
ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు
తిప్పిందిరా హోహోహో జన్మ ధన్యం
 అంబారిగ ఉండగల  ఇంతటి వరం
      అయ్యారా అయ్యా
 అంబాసుతా ఎందరికి లభించురా
     అయ్యారా అయ్యా
 ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా
 దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా
     దయుంచయ్యా దేవ
 నీ అండాదండా ఉండాలయ్యా
     చూపించయ్యా త్రోవ
 
 చరణం: 2


 శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం
     నిన్నే చేసింది వేళా కోళం
 ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా
     ఏవైపోయింది గర్వం
 శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం
     నిన్నే చేసింది వేళా కోళం
 ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా
     ఏవైపోయింది గర్వం
 త్రిమూర్తులే నిను గని తలొంచరా అయ్యారా అయ్యా
 నిరంతరం మహిమను కీర్తించరా అయ్యారా అయ్యా
 నువ్వెంతనే అహం నువ్వే దండించరా
 దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ
 నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ
 అరెరెరెరెరే... పిండి వంటలారగించీ
     తొండమెత్తి దీవించయ్యా
 తండ్రివలె ఆదరించి తోడు నీడ
     అందించయ్యా... ఓ....
 దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా
     దయుంచయ్యా దేవ
 నీ అండాదండా ఉండాలయ్యా
     చూపించయ్యా త్రోవ
 
 చిత్రం    : కూలీ నెం.1 (1991)
 రచన     : సిరివెన్నెల
 సంగీతం     : ఇళయరాజా
 గానం     : ఎస్.పి.బాలు, బృందం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement