మాడు వాసనకు బ్రెడ్
ఇంటిప్స్
అన్నం అడుగు భాగం మాడిపోతే పైన కూడా మాడు వాసన వస్తుంది. వైట్ బ్రెడ్ అన్నం పైభాగన పెట్టి 5-10 నిమిషాలు ఉంచితే వాసన తగ్గిపోతుంది. కూరగాయలు తరిగాక, పండ్లు కోసాక వేళ్లు మురికిపట్టినట్టు కనిపిస్తాయి. రంగుకూడా వదలదు. ఇలాంటప్పుడు బంగాళదుంప ముక్కతో రుద్ది, కడగాలి.
సూప్, సాస్ తాగిన గిన్నెలు జిడ్డుగా ఉంటాయి. ఇలాంటప్పుడు లోపలి భాగంలో చిన్న ఐస్‌ముక్క వేసి రుద్దితే జిడ్డు వదిలిపోతుంది.పాస్తా లేదా బంగాళదంపలు, ఇతర కూరగాయల ముక్కలను ఉడికించిన నీటిని మొక్కలకు పోస్తే అవిఏపుగా పెరుగుతాయి.
కోడిగుడ్డు మునిగేంత నీళ్లను గిన్నెలో పోయాలి. గుడ్డు పైకి తేలితే గుడ్డు కుళ్లిపోయిందని తెలుసుకోవాలి. సూప్‌లో ఉప్పు ఎక్కువైతే అడుగున తొక్కతీసిన బంగాళ దుంప ముక్క వేసి పది నిమిషాలు ఉంచాలి. అరటిపండ్లను మిగతా పండ్లతో ఉంచితే త్వరగా కుళ్లిపోతాయి. అందుకని అరటిపండ్లను ఎప్పుడూ విడిగానే ఉంచాలి.