ఎ‘వరి’ది?
తిండి గోల
భారతదేశానికి వ్యవసాయకదేశమని పేరు. వరి ఆధారిత కేంద్రమై విరాజిల్లుతోంది మనదేశమే. సింధు, హరప్పానాగరికతల కాలంలోనూ ఈ పంట మూలాలు మన దేశాన ఉన్నట్టు ఎన్నో చారిత్రక ఆధారాలు, వరిపంట మూలాలు భారత్‌లోనే ఉన్నాయని, వరికి జన్మస్థలం భారతదేశమేనని నిరూపించే తిరుగులేని సాక్ష్యాధారాలు మన శాస్త్రజ్ఞుల వద్ద ఉన్నాయి. ప్రపంచ వరి దిగుబడి మొత్తం పరిశీలిస్తే ఒక్క ఆసియా ఖండంలోనే 87 శాతం వరి పండుతుంది. ప్రపంచంలో ఎక్కువ వరి పంట సాగు విస్తీర్ణం ఉన్న దేశంగా భారత్‌కే గుర్తింపు ఉంది. దాదాపు నాలుగున్నర కోట్ల హెక్టార్లలో వరి సాగు ఇక్కడ జరుగుతోంది.
కిందటేడాది కోటీ అరవై లక్షల టన్నుల దిగుబడిని సాధించిన చైనా ఆ తరువాతి స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనాకేంద్రం (ఐఎఆర్‌ఐ)కి చెందిన బయోటెక్నాలజిస్టుల బృందం వరి పంట మూలాలు, వరి పంట అభివృద్ధి, దిగుబడి బాగా ఉండే సరికొత్త వంగడాల గురించి విస్తృత పరిశోధనలు నిర్వహించింది. వీరు తమ పరిశోధనలలో వరి మూలాలు భారత్‌లోనే ఉన్నాయని, ఇది సంపూర్ణంగా స్వదేశీ పంట అని, దీని హక్కులు పూర్తిగా భారత్‌కు చెందినవేనని తెలిపారు.