historical evidence
-
అగ్ని గుండంగా రాష్ట్రం.. ఇదీ మణిపూర్ కథ..!
మణిపూర్ చరిత్ర అంటే రాజులు, సంస్థానాలు, ఆక్రమణలు, చొరబాట్లు మాత్రమే కాదు. భిన్న సంప్రదాయాలు, సంస్కృతులు కలిగిన జాతుల కలబోత. విభిన్న తెగల వారు ఒకే చోట సహజీవనం చేసే మణిహారం. మెయిటీలు, కుకీల మధ్య మూడు నెలలుగా జరుగుతున్న ఘర్షణలు రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మార్చాయి. ఈ నేపథ్యంలో మణిపూర్ చరిత్ర అందరిలోనూ ఆసక్తిని పెంచింది. మణిపూర్ లోయ ప్రాంతంలో మెయిటీలు, నాగా, జొమి ఇలా 124 తెగలు నివసిస్తూ ఉంటే మణిపూర్ కొండల్లో 38 గిరిజన తెగలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో కుకీల ప్రాబల్యం ఎక్కువ. ఈ వర్గాల మధ్య ఘర్షణలు ఇప్పుడు కొత్తేం కాదు. గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో మెయిటీలు, కుకీల మధ్య ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. చరిత్రలోకి తొంగి చూస్తే మణిపూర్‌కు సంబంధించిన చారిత్రక ఆధారాలు క్రీ.శ. 33వ సంవత్సరం నుంచి ఉన్నాయి. అయితే, అంతకు ముందు సైతం ఇంఫాల్ లోయలో మానవ నాగరికత వెల్లివిరిసినప్పటికీ అక్కడ ఉన్న వారంతా మెయిటీ వర్గీయులు అని చెప్పడానికి వీల్లేదు. టిబెట్, బర్మా నుంచి మెయిటీలు వలస వచ్చినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. భారత్‌ను సుదీర్ఘకాలం పరిపాలించిన రాజవంశాలలో ఒకటైన నింగ్‌డౌ వంశీకులు మణిపూర్ లోయను పాలించారు. మణిపూర్ రాజులు, ప్రజలు 18 వ శతాబ్దం వరకు సనామహిజం అనే దేశీయ మత విశ్వాసాల్ని ఆచరించారు. 15వ శతాబ్దంలో లోయను పాలించిన క్యంబ అనే రాజు విష్ణమూర్తి దేవాలయాన్ని నిర్మించాడు. అప్పట్నుంచి లోయలోకి బ్రాహ్మణుల రాక ప్రారంభమైంది. అప్పట్లోనే మణిపూర్ లోయను పాలించిన రాజులు హిందువులుగా మారారా అన్న చర్చ ఉంది. అయితే 1704వ సంవత్సరంలో రాజు చరియారోంగ్బా తన కుటుంబంతో సహా హిందూమతంలోకి మారారు. అప్పట్నుంచి ఇంఫాల్ లోయలో హిందువుల ప్రాబల్యం పెరిగింది. నింగ్‌డౌ వంశీకులే 1724లో ఈ ప్రాంతానికి మణిపూర్ (మణిమాణిక్యాలకు నిలయం) అని పేరు పెట్టారు. కుకీల ప్రస్తావన తొలిసారి ఎప్పుడంటే కొన్ని వందల శతాబ్దాల కిందటే మణిపూర్ లోయ ప్రాంతంలో మెయిటీల ఉనికి ఉంది. కానీ కుకీల ప్రస్తావన 17వ శతాబ్దంలో తొలిసారిగా తెలిసింది. 1777లో బెంగాల్ గవర్నర్ జనరల్‌గా వారెన్ హేస్టింగ్స్ ఉన్నప్పుడు చిట్టగాంగ్‌లో బ్రిటీషర్లపై ఒక తెగ దాడి సందర్భంగా తొలిసారిగా కుకీల ప్రస్తావన వినిపించింది. బ్రిటీష్ రచనల్లో కుకీలను పాత కుకీలు, కొత్త కుకీలుగా విభజించారు. ఆంగ్లో, బర్మా యుద్ధం (1824–1826) జరిగినప్పుడు బర్మా నుంచి వచ్చినవారే కొత్త కుకీలు అని బ్రిటీష్ రచనల ద్వారా తెలుస్తోందని రచయిత, చరిత్రకారుడు మలేమ్ నింగ్‌తౌజ వెల్లడించారు. అప్పట్నుంచే మెయిటీల డిమాండ్ 1819లో మణిపూర్‌పై బర్మా దురాక్రమణకు దిగింది. దీంతో మణిపూర్ రాజులు బ్రిటీష్ సాయం కోరారు. అప్పట్నుంచి 1891 వరకు మణిపూర్ తెల్లదొరల సంరక్షణలో ఉంది. తర్వాత సంస్థానా«దీశుల చేతికొచ్చింది. సంస్థాలన్నీ భారత్‌లో విలీనమయ్యాయి. స్వాతంత్య్రం తర్వాత 1949 సంవత్సరం అక్టోబర్ 15 నుంచి మణిపూర్ అధికారికంగా భారత్‌లో అంతర్భాగమైంది. ఆ సమయంలో మెయిటీలకు ఎస్టీ హోదా ఇవ్వాలన్న చర్చ వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. కుకీలకు తెల్లదొరల అండ బ్రిటిష్ పాలకుల అండదండలతో కుకీలు మణిపూర్ కొండప్రాంతాల్లో స్థిరపడ్డారు. నాగా తెగల దాడుల నుంచి లోయ ప్రాంతాలను రక్షించే పనిలో ఉండేవారు. ఓ రకంగా బ్రిటీష్ పాలకుల కిరాయి సైన్యంగా పని చేసేవారు. తెల్లదొరలు తమ వ్యూహంలో భాగంగా ఒక తెగకి వ్యతిరేకంగా మరో తెగని, వారికి వ్యతిరేకంగా ఇంకో తెగవారిని ప్రోత్సహించారు. కొండ ప్రాంతాల్లో కుకీల ప్రాబల్యం పెరిగిపోవడానికి బ్రిటీష్ వారి వ్యూహాలే కారణమని మలేమ్ నింగ్‌తౌజ అభిప్రాయపడ్డారు. నేటి ఘర్షణలకు మూలం మణిపూర్ ఘర్షణలపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. లోయ ప్రాంతాల్లో నివసించే మెయిటీలు ఎస్టీ హోదా కోసం డిమాండ్ చేస్తూ ఉంటే కొండప్రాంతంలో ఎస్టీ హోదా ఉన్న కుకీలు తమకు ప్రత్యేక పరిపాలనా యంత్రాంగం కావాలని పట్టుబడుతూ ఉండడంతో మూడు నెలలుగా హింస చెలరేగుతోంది. 1949 తర్వాత మయన్మార్ నుంచి అక్రమ వలసదారులు భారీగా వచ్చి కుకీ సమాజంలో కలిసిపోయారని అదే నేటి ఘర్షణలకు మూలమని రచయిత, చరిత్రకారుడు నింగ్‌తౌజ తెలిపారు. మణిపూర్ చరిత్రతో నేటి ఘర్షణలకు సంబంధం లేదని ఆయన చెబుతున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివాసం ఏర్పాటు చేసుకున్న అక్రమ వలసదారుల్ని ఏరివేయడానికి రాష్ట ప్రభుత్వం చేపట్టిన చర్యలు కుకీలలో ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో మణిపూర్‌కు చెందిన కొన్ని సంస్థలు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ప్రదర్శన నిర్వహిస్తూ 1951 తర్వాత అక్రమంగా వచ్చిన వలసదారుల్ని రాష్ట్రం నుంచి తరిమివేయాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యలు, సవాళ్లతోనే మణిపూర్ జాతుల సంఘర్షణ సంక్లిష్టంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘అన్ని రోడ్లు రోమ్’కే వెళ్లాయి!
‘ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ (అన్ని రోడ్లు రోమ్‌కే వెళతాయి)’ అన్న నానుడి చారిత్రకంగా అక్షర సత్యమని తేలింది. ఇటలీ రాజధాని రోమ్ నగర పరిసరాల్లోని 29 చోట్ల పురాతత్వ శాస్త్రజ్ఞుల తవ్వకాల్లో బయట పడిన 12వేల సంవత్సరాల క్రితం నాటి 127 మంది మానవుల చెవి భాగాలపై డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా ఆశ్చర్యకరమైన అంశాలు బయట పడ్డాయి. అప్పటికే రోమ్ నగరానికి గ్రీకులు, సిరియన్లతోపాటు లెబనాన్ దేశస్థులు వలసవచ్చారని తేలింది. 127 మానవుల చెవుల్లో ఈ మూడు దేశాల ప్రజల డీఎన్ఏలు బయటపడ్డాయి. రోమ్ నగరం విశిష్టతకు సంబంధించి ఇప్పటికే ఆర్కియాలోజీ, చారిత్రక నివేదికలెన్నో తెలియజేస్తున్నాయి. డీఎన్ఏ పరీక్షల ద్వారా ఈ విషయాలను ధ్రువీకరించడం పెద్దగా జరగలేదు. ఆ దిశగా ఇది ముందడుగు అని చెప్పవచ్చు. పాశ్చాత్య యూరప్ సామ్రాజ్యం పతనమయ్యాక నాలుగో శతాబ్దంలో గ్రీస్, సిరియా, లెబనాన్ నుంచి రోమ్ నగరానికి భారీగా వలసలు పెరిగాయని స్టాన్ఫోర్డ్, ఇటాలియన్ యూనివర్శిటీలకు చెందిన పరిశోధకులు తెలిపారు. -
పెద్దపల్లిలో చారిత్రక ఆధారాలు
పెద్దపల్లి రూరల్: రెండు వేల ఏళ్లనాటి చారిత్రక ఆనవాళ్లు మట్టిదిబ్బల కింద పదిలంగా ఉన్నాయి. పాచికలు, మట్టిపాత్రలు, కొలత పావులు, చిన్నపాటి రింగ్ వంటి వస్తువులు..అబ్బురపరిచే ఇటుక కట్టడాలు పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడ్డాయి. నెలరోజులుగా పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూర్‌లో రాష్ట్ర పురావస్తుశాఖ అధికారులు చేపట్టిన తవ్వకాల్లో ఇవి లభ్యమయ్యాయి. ఈ తవ్వకాలను బుధవారం పురావస్తుశాఖ డైరెక్టర్ విశాలాచ్చి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ శాతవాహనులు పెద్దబొంకూర్ నుంచే తమ పాలన సాగించినట్లు ఆనవాళ్లు ఉన్నాయన్నారు. 50 ఏళ్ల తర్వాత మళ్లీ తవ్వకాలు సాగిస్తున్నామని.. దేశచరిత్రను భావితరాలకు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఈ తవ్వకాలు చేపడుతున్నట్లు తెలిపారు. అప్పట్లో ఈ ప్రాంతవాసులు మట్టితో తయారైన పూసలను మెడలో వేసుకునేవారని లభించిన ఆధారాలు తెలుపుతున్నాయన్నారు. శంకంతో చేసిన పూసలు, ముల్లాపు పూసలు, పచ్చటి బంగారు రేకులతో చేసిన పూతలు, క్రిస్టల్, గాజు, షేల్ బ్రీడ్స్, కార్నేలియన్ పూసలను కూడా వినియోగించినట్లు సాక్ష్యం ఉందని తెలిపారు. చదరంగ ఆట కోసం ఎముకలతో తయారైన పాచికలను తయారు చేసిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు. ఇనుముతో తయారు చేసిన రింగ్, మట్టిపాత్రలు కూడా తవ్వకాల్లో బయటపడ్డట్టు తెలిపారు. ఇటుక కట్టడాలు, వృత్తాకారపు ఇటుక నిర్మాణాలు, నీటిబావులు, డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయని వివరించారు. సిద్దిపేట జిల్లాలో బృహత్ శిలాయుగపు ఆనవాళ్లు: రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత చారిత్రక పరిశోధనలు చేపట్టిన సిద్దిపేట జిల్లాలో బృహత్ శిలాయుగపు సమాధుల్లో లభించిన మానవ అవశేషాలు క్రీస్తుపూర్వం 600 ఏళ్ల నాటివిగా గుర్తించినట్లు తెలిపారు. పుల్లూరుబండ గ్రామంలో చేపట్టిన తవ్వకాల్లో మానవ ఆకృతి గల స్త్రీ శిల్పం(ఆంత్రోఫామిక్ ఫిమేల్ ఫిగర్) దక్షిణ భారతదేశంలోనే మొదటిగా భావిస్తున్నట్లు చెప్పారు. నర్మెట్టలోని సమాధిలో లభించిన ఎముకతో తయారు చేసిన(డైమండ్ షేప్) ఆభరణాలు, సమాధిపై పేర్చిన పైకప్పు మూతరాయి భారీ గండశిలను పేర్చి ఉండడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చన్నారు. ఇన్చార్జి రాములునాయక్, ఇంజినీరింగ్ డెప్యూటీ డైరెక్టర్ నారాయణ, రిటైర్డ్ డీడీ రంగాచార్యులు, ఏడీ మాధవి ఉన్నారు. -
మట్టి దిబ్బలో మహా చరిత్ర
మట్టి దిబ్బ మాటున శాతవాహనుల చరిత్ర వందేళ్ల కిందే చారిత్రక ప్రాధాన్యత సాక్షి, సంగారెడ్డి: శాతవాహనుల కాలం నాటి చారిత్రక ప్రదేశాన్ని గుర్తించి వందేళ్లు కావస్తు న్నా.. పూర్తి స్థాయిలో వివరాలు వెలుగు చూడటం లేదు. సుమారు వంద ఎకరాల్లో విస్తరించి ఉన్న మట్టి దిబ్బల వెనుక విలువైన చారిత్రక ఆధారాలు దాగి ఉన్నట్టు పురావస్తు శాఖ చెబుతోంది. భారత పురావస్తు సర్వేక్షణ (ఏఎస్ఐ) ఆధ్వర్యంలో జరిగిన తవ్వ కాల్లో సూక్ష్మ, మధ్య శిలాయుగం సంస్కృతి బయట పడింది. ఇక్కడ తవ్వకాల్లో వెలుగు చూసిన వస్తువులతో ఏఎస్ఐ తెలంగాణలోనే ఏకైక మ్యూజియంను నిర్వహిస్తోంది. అయితే ఇప్ప టి వరకు అరకొరగానే తవ్వకాలు జరగడంతో పూర్తి చరిత్ర వెలుగు చూడటం లేదు.సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో సుమారు వంద ఎకరాల్లో విస్తరిం చి ఉన్న ఓ మట్టి దిబ్బను విదేశీ పురాతత్వ నిపుణుడు హెన్నీ కౌజెన్స్ 1907లో గుర్తించా డు. ఈ ప్రాంత చారిత్రక ప్రాధాన్యతను గుర్తించిన నాటి హైదరాబాద్ ప్రభుత్వం 1940–42లో పురాతత్వ శాఖ ద్వారా తవ్వకాలు జరిపించింది. ఖ్వాజా మహ్మద్ అనే పురాతత్వ నిపుణుడి పర్యవేక్షణలో జరిగిన తవ్వకాల్లో అనేక చారిత్రక ఆధారాలు వెలుగు చూశాయి. మట్టి దిబ్బను ఆనుకుని ప్రవహించే వాగు సమీపంలో మధ్య శిలాయుగం నాటి పనిముట్లు, పనిముట్ల తయారీ పరిశ్రమ, సూక్ష్మ శిలాయుగం నాటి కోణాకృతులు తదితరాలు బయట పడ్డాయి. దీంతో ఈ ప్రాంతం సూక్ష్మ, మధ్య శిలా యుగం నాటి సంస్కృతి ఉనికిని పురాతత్వ నిపుణులు గుర్తించారు. ఆ తర్వాత 1970–71 లో ఏఎస్ఐ (ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో మరోమారు తవ్వకా లు సాగించారు. నవీన శిలాయుగానికి చెందిన రాతి గొడ్డళ్లు, గచ్చకావి, ఎరుపు రంగు మట్టి పాత్రలు బయట పడ్డాయి. కాల్చిన ఇటుక, సున్నంతో నిర్మించిన శిథిల నిర్మాణాలు, శిల్ప ఖండాలు, నాణేలు, పూసలు, మట్టి బొమ్మలు, వివిధ ఆకృతుల్లో ఉన్న మట్టి పాత్రలు బయట పడ్డాయి. తిరిగి 2009–11 మధ్యకాలంలోనూ ఏఎస్ఐ జరిపిన తవ్వకాల్లోనూ శాతవాహనుల కాలం నాటి చారిత్రక ఆధారాలు, బౌద్ధస్తూప, విహార, చైత్య మండపాల ఆనవాళ్లు, నేల మాళిగ అవశేషాలు బయట పడ్డాయి. వంద ఎకరాల్లో విస్తరించిన ఈ మట్టి దిబ్బపై వందేళ్ల కాలంలో కేవలం పదోవంతు కూడా తవ్వకాలు జరగకపోవడంతో పూర్తి స్థాయిలో చరిత్ర వెలుగు చూడటం లేదు. తవ్వకాల్లో శాతవాహనుల ఆనవాళ్లు ఇప్పటివరకు పలు దఫాలుగా జరిపిన తవ్వకాల్లో వెలుగు చూసిన చారిత్రక ఆనవాళ్లు శాతవాహనుల కాలం నాటి జీవన విధానానికి అద్దం పట్టేలా ఉన్నాయి. తవ్వకాల్లో బౌద్ధ మతానికి సంబంధించిన స్తూపాలు, చైత్యాల ఆనవాళ్లు బయట పడ్డా.. నిధుల కొరతతో పూర్తి స్థాయిలో పరిశోధనలు జరగలేదు. వర్షానికి మట్టి కొట్టుకు పోతుండటంతో మట్టి పాత్రలు, ముడి ఇనుప వస్తువులు, కాల్చిన ఇటుకలు ఎటు చూసినా బయట పడుతున్నా యి. అమరావతి, నాగార్జున కొండ, ఫణిగిరి తరహాలో ఇక్కడా బౌద్ధమ తానికి సంబంధిం చిన అనేక ఆనవాళ్లు వెలుగు చూసే అవకాశ ముందని చరిత్రపై ఆసక్తి ఉన్న వారు వ్యాఖ్యా నిస్తున్నారు. నిధుల కొరతతో తరచూ తవ్వకాలు నిలిచిపోతుండగా.. చారిత్రక మట్టిదిబ్బ చుట్టూ వ్యవసాయ క్షేత్రాలు ఉండ టంతో క్రమ క్షయానికి గురవుతోంది. ఆర్కి యలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతంలో మరిన్ని తవ్వకాలు వేగంగా జరపాలని కోరుతున్నారు. ప్రచారానికి నోచుకోని మ్యూజియం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏఎస్ఐ ఆధ్వర్యంలో చంద్రగిరి, నాగార్జునకొండ, అమరావతి, కొండాపూర్‌లలో నాలుగు మ్యూజియాలు నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలం గాణలో కొండాపూర్ మ్యూజియం మాత్రమే ఉంది. చారిత్రక సంపద కొలువైన ఈ మ్యూజియంలో వివిధ కాలాలకు అద్దం పట్టే మట్టి పాత్రలు, మట్టి బొమ్మలు, నాటి ప్రజలు ధరించిన ఆభరణాలు, తాయెత్తులు, గవ్వ, రాగి, గాజుతో తయారు చేసిన కంకణాలు, కాల్చిన మట్టితో చేసిన పూసలు భద్రపరి చారు. శాతవాహనుల కాలం నాటి ముద్రిత నాణేలు, రాగి, సీసం నాణేలు ఉన్నాయి. రమోన్ చక్రవర్తి పోన్‌టిఫ్ ఆగస్టస్ (క్రీ.పూ 37 నుంచి క్రీ.శ. 14 వరకు) రూపం కలిగిన నాణేలు కూడా ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు. గుణాఢ్యుడి రాజధాని కొండాపూర్.. శాతవాహనుల కాలంలో చుట్టూ కోటతో ఆవరించిన మహానగరంగా కొండాపూర్‌ను చరిత్రకారులు అభివర్ణిస్తున్నారు. బృహత్క థను రచించిన శాతవాహన రాజు గుణాఢ్యుడు కొండాపూర్ రాజధానిగా పరిపాలించినట్టు తెలుస్తోంది. క్రీ.పూ. రెండో శతాబ్దంలో కొండాపూర్ మహా నగరంగా విరాజిల్లగా, శాతవాహనుల ‘టంకశాల’ ఇక్కడే ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. దక్షిణ తక్షశిలగా పిలిచే కొండాపూర్‌ను శాతవాహనులు పాలించి నట్టు తవ్వకాల్లో సాక్ష్యాధారాలు లభిం చాయి. ఆధునిక నగర జీవితానికి అవస రమైన అన్ని సదుపాయాలు ఆనాటికే ఉన్నట్టు కొండాపూర్ తవ్వకాల్లో ఆధారాలు లభించాయి. శాతవాహనుల కాలంనాటి ప్రజలు నివసించిన గృహ సముదాయాలు, రాగి నాణేలు, దంతపు వస్తువులు, గాజు, మట్టి పాత్రలు ఇక్కడ బయట పడ్డాయి. -
మనదగ్గరే.. ‘మహాతలవర’ సామంత పాలన!
♦ లభించిన చారిత్రక ఆధారాలు.. ♦ నల్లగొండ జిల్లా పజ్జూరు ♦ పురావస్తు తవ్వకాల్లో బయల్పడిన నాటి నాణేలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణలో ‘మహాతలవర’ సామంత రాజుల పాలనకు సంబంధించిన చారిత్రక ఆధారాలు లభించాయి. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల పరిధిలోని పజ్జూరు - ఎర్రగడ్డల గూడెం గ్రామాల సరిహద్దులోని పాటి మీద పురావస్తుశాఖ ఆధ్వర్యంలో జరుపుతున్న తవ్వకాల్లో ఈ చారిత్రక ఆధారాలు లభించాయి. తొలియుగ చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయన్న కారణంతో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి మేరకు గత 50 రోజులుగా ఇక్కడ పురావస్తుశాఖ తవ్వకాలు జరుపుతోంది. తవ్వకాల్లో ఇప్పటికే గృహ సముదాయం బయల్పడగా, తాజాగా మహాతలవర సామంతుల పాలనను నిర్ధారించే నాణేలు బయటకు వచ్చాయి. తవ్వకాల్లో భాగంగా బుధవారం ఓ సీసం, ఓ రాగి నాణేలు బయటపడ్డాయని, ఇవి మహాతల వర కాలం నాటివని పురావస్తు అధికారులు చెపుతున్నారు. మట్టిపూసలు, మహిళలు తిలకం దిద్దుకునేందుకు సాధనం కూడా లభ్యమయ్యాయి. క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు తెలంగాణను శాతవాహనులు, ఇక్ష్వాకులు పాలిం చారు. వీరికి సామంతులుగా మహాతలవరులు పనిచేసేవారు. ‘మహాతల’ అంటే పెద్దవాడు అని, ‘వర’ అంటే వరించినవాడు లేదా పొందినవాడు అని అర్థమన్నది అధికారుల భావన. -
ఎ‘వరి’ది?
తిండి గోల భారతదేశానికి వ్యవసాయకదేశమని పేరు. వరి ఆధారిత కేంద్రమై విరాజిల్లుతోంది మనదేశమే. సింధు, హరప్పానాగరికతల కాలంలోనూ ఈ పంట మూలాలు మన దేశాన ఉన్నట్టు ఎన్నో చారిత్రక ఆధారాలు, వరిపంట మూలాలు భారత్‌లోనే ఉన్నాయని, వరికి జన్మస్థలం భారతదేశమేనని నిరూపించే తిరుగులేని సాక్ష్యాధారాలు మన శాస్త్రజ్ఞుల వద్ద ఉన్నాయి. ప్రపంచ వరి దిగుబడి మొత్తం పరిశీలిస్తే ఒక్క ఆసియా ఖండంలోనే 87 శాతం వరి పండుతుంది. ప్రపంచంలో ఎక్కువ వరి పంట సాగు విస్తీర్ణం ఉన్న దేశంగా భారత్‌కే గుర్తింపు ఉంది. దాదాపు నాలుగున్నర కోట్ల హెక్టార్లలో వరి సాగు ఇక్కడ జరుగుతోంది. కిందటేడాది కోటీ అరవై లక్షల టన్నుల దిగుబడిని సాధించిన చైనా ఆ తరువాతి స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనాకేంద్రం (ఐఎఆర్ఐ)కి చెందిన బయోటెక్నాలజిస్టుల బృందం వరి పంట మూలాలు, వరి పంట అభివృద్ధి, దిగుబడి బాగా ఉండే సరికొత్త వంగడాల గురించి విస్తృత పరిశోధనలు నిర్వహించింది. వీరు తమ పరిశోధనలలో వరి మూలాలు భారత్‌లోనే ఉన్నాయని, ఇది సంపూర్ణంగా స్వదేశీ పంట అని, దీని హక్కులు పూర్తిగా భారత్‌కు చెందినవేనని తెలిపారు.