5 మినిట్స్ రిలీఫ్
ఎగ్జామ్ టిప్స్
ఏడాది మొత్తం సిలబస్ ఒకటి రెండు రోజుల్లో పూర్తిచేయాలన్న ఆలోచన తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. సిలబస్‌ను పూర్తిచేయలేక, పరీక్షలు ఎలా రాస్తామో అనే టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. అందుకని ముందు నుంచే సిలబస్‌ని ప్లాన్ ప్రకారం విభజించి దానికి అనుగుణంగా పిల్లలు చదివేలా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. టెన్త్ క్లాస్, ఇంటర్మీడియెట్ ఆపై తరగతుల విద్యార్థులు రాత్రిళ్లు మేల్కొని చదువుతుంటారు. నిద్ర రాకుండా ఉండటానికి కాఫీ, టీలు ఎక్కువగా సేవిస్తుంటారు. హఠాత్తుగా పెరిగే కాఫీ, టీల వల్ల తలనొప్పి వస్తుంది, ఒళ్లు భారంగా తయారవు తుంది.
ఇలాంటి సమయాల్లో నొప్పి నివారణ అంటూ ఏవేవో ట్యాబ్లెట్లు వేసుకుంటే ఆరోగ్యానికి మరింత నష్టం వాటిల్లుతుంది. అందుకని కాఫీ, టీలకు బదులుగా వేడి నీళ్లు, చల్లటి మజ్జిగ, సూప్‌లు తాగడం రిలీఫ్ ఇస్తుంది. చదువుతున్న సమయంలో ప్రతి అరగంటకు ఒకసారి అయిదు నిమిషాలు లేచి అటూ ఇటూ తిరగడం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేయడంలాంటి టెక్నిక్స్ వల్ల శరీరానికి సత్వర స్వాంతన లభిస్తుంది. తలనొప్పిభారం తగ్గుతుంది. మందులతో అవసరం పడదు.