కర్బూజ వేసవిలో విరివిగా దొరుకుతుంది. ఒకింత చవకగానూ లభిస్తుంది. దోసజాతికి చెందిన ఈ పండును ఈ సీజన్‌లో తింటే చలవచేస్తుంది కాబట్టి చాలామంది దీన్ని తీసుకుంటూ ఉంటారు. సహజంగా అంతగా తియ్యగా ఉండదు కాబట్టి ఏ చక్కెరతోనో లేదా ఏ జ్యూస్ రూపంలోనో తీసుకుంటారు. కానీ స్వాభావికంగా తిన్నా లేదా కొద్ది పాటి చక్కెరతో తింటేనే ఎంతో మేలు. దీనితో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. వాటిలో కొన్ని ఇవి...
♦ కర్బూజలో నీటిపాళ్లతో పాటు ఖనిజలవణాలూ ఎక్కువ. అందుకే వేసవిలో తీసుకుంటే డీ–హైడ్రేషన్ ప్రమాదం నుంచి కాపాడుతుంది.
♦ దీనిలో పీచుపదార్థాలూ చాలా ఎక్కువ. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు పేగులనూ ఆరోగ్యంగా ఉంచుతుంది.
♦ దీనిలో పీచు ఎక్కువ, తీపి తక్కువ. అందుకే డయాబెటిస్ రోగులకు చాల మేలు చేస్తుంది. దీని పీచు మలబద్దకాన్ని నివారిస్తుంది.
♦ ఆకలి లేమితో బాధపడేవారికి కర్బూజ ఒక స్వాభావికమైన ఔషధంగా పనిచేసి, ఆకలిని పుట్టిస్తుంది.
♦ అసిడిటీని అరికడుతుంది. అల్సర్ వంటి సమస్యలను నివారిస్తుంది.
♦ పుష్కలమైన విటమిన్–సి కారణంగా మంచి వ్యాధినిరోధకతను సమకూర్చి, ఎన్నెన్నో వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
♦ ఐరన్ పాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత నుంచి కాపాడుతుంది.
♦ దీనిలో క్యాల్షియం, ఫాస్ఫరస్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే ఎముకలను దృఢపరచి, ఆస్టియోపోరోసిస్ వంటి అనేక వ్యాధులను నివారిస్తుంది.
కర్బూజ చలువ... చవక
Published Mon, Apr 2 2018 1:14 AM | Last Updated on Mon, Apr 2 2018 1:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment