అమ్మబాబోయ్! | Gossip | Sakshi
Sakshi News home page

అమ్మబాబోయ్!

Published Fri, Jun 12 2015 10:52 PM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

అమ్మబాబోయ్! - Sakshi

అమ్మబాబోయ్!

 గాసిప్

చాలామంది నటుల్లో ‘నటన’ మాత్రమే కాదు గానం కూడా ఉండొచ్చు. కొందరిలో రచనా సామర్థ్యం కూడా ఉండొచ్చు. కంగనా రనౌత్‌లో ‘ఉత్తమ నటి’ మాత్రమే కాదు...‘రచయిత్రి’ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆ ‘రచయిత్రి’ని చూసి నిర్మాత, దర్శకులు  జడుసుకుంటున్నారట.

విషయమేమిటంటే, ‘క్వీన్’ సినిమా స్క్రిప్ట్‌లో కంగనా  కూడా పాలుపంచుకుంది. డైలాగ్ రైటర్స్ జాబితాలో  ఆమె పేరు కూడా తెర మీద కనిపించింది. ‘క్వీన్’ సినిమా హిట్ కావడంతో తనలోని రచయిత్రిపై కంగనాకు పూర్తిగా నమ్మకం వచ్చేసినట్లుంది. దీంతో తన సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ రచనలో తాను కూడా భాగం అవుతుంది. అంతేకాదు.. డైలాగ్ రైటర్‌గా తన పేరు తప్పనిసరిగా స్క్రీన్ మీద కనిపించాలని కోరుతుందట. స్క్రిప్ట్‌లో కంగనా పాలుపంచుకోవడంలో తప్పేమిటి? అనే డౌటు రావచ్చు. అయితే ఆమె సూచనలు, సలహాలు, డైలాగులు...సినిమాకు ప్లస్ అవ్వడం కంటే మైనస్సయ్యే అవకాశాలే ఎక్కువని దర్శక,నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారట.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement