
అమీ యాక్షన్..!
గాసిప్
‘మదరాసపట్టణం’ సినిమాతో తెరంటేట్రం చేసిన అమీ జాక్సన్... ఏక్ దివాన థా (హిందీ), ఎవడు (తెలుగు), ‘ఐ’ సినిమాలతో ప్రేక్షకులకు చేరువైంది. ‘ఐ’ సినిమా గనుక హిట్టై ఉంటే ఈ బ్రిటన్ సుందరి కెరీర్ మరోలా ఉండేది.అమీ జాక్సన్ అక్షయ్ కుమార్‌తో కలిసి నటిస్తున్న ‘సింగ్ ఈజ్ బ్లింగ్’లో మొదట్లో కృతిసనన్‌ను తీసుకున్నారు. ఆమె నచ్చక పోవడంతో ప్రత్యామ్నాయం కోసం వేరే వాళ్లను వెదుకుతున్న డెరైక్టర్‌కి ఎవరో అమీ పేరు సూచించారట.
అమీకి హార్స్‌రైడింగ్‌లో బాల్యం నుంచే పరిచయం ఉంది. ఈ సినిమాలో హార్స్‌రైడింగ్ సీన్‌లు ఎక్కువగా ఉండడంతో అమీని ఎంచుకోవడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనుకున్నారు అయితే ఎందుకైనా మంచిదని ఒక ట్రైనర్‌ను కూడా మాట్లాడుకున్నారు. అయితే ట్రైనర్ అవసరం లేకుండానే... తన రైడింగ్ స్కిల్‌ను అద్భుతంగా చాటుకుంది అమీ. దీంతో దర్శక, హీరోలు అబ్బురపడిపోయి అమీని తెగ మెచ్చుకున్నారట. ‘‘ఈ అమ్మాయితో యాక్షన్ సినిమా చేయిస్తే...మెగా హిట్ ఖాయం’’ అన్నాడట అక్షయ్ కుమార్.ఆయన ఎందుకన్నాడో తెలియదుగానీ... అదే నిజమైతే అమీని డిష్యుం డిష్యుం సీన్లలో చూడవచ్చున్నమాట!