Krtisanan
-
కిక్-2లో కథానాయికగా?
గాసిప్ కృతీసనన్ ఇప్పుడేం చేస్తున్నారు? తెలుగులో ‘1 నేనొక్కడినే’, ‘దోచెయ్’ చిత్రాల తర్వాత ఆమె ఇక్కడి తెరపై కనిపించలేదు. ‘హీరో పంతి’ ద్వారా హిందీ తెరకు పరిచయమైన ఈ బ్యూటీ వరుసగా అక్కడి సినిమాలకు ‘సై’ అంటున్నారు. తొలి చిత్రం తర్వాత చేసినే ‘దిల్వాలే’ కూడా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో బాలీవుడ్లో కృతి సక్సెస్‌ని టేస్ట్ చేయలేకపోయారు. అయినప్పటికీ ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా, ఆమెను ఒక బంపర్ ఆఫర్ వరించిందని సమాచారం. కండలవీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించే చాన్స్ కొట్టేశారట. గతంలో సల్మాన్ నటించిన ‘కిక్’కి కొనసాగింపుగా ఇప్పుడాయన సీక్వెల్ చేయాలనుకుంటున్నారట. తొలి భాగం ఘన విజయం సాధించిన నేపథ్యంలో మలి భాగంలో కథానాయికగా అవకాశం వస్తే బాగుంటుందని బాలీవుడ్లో కొంతమంది నాయికలు ఆశించారు. కానీ, చివరికి కృతీకి వెళ్లిందని సమాచారం. మరి.. ఈ చిత్రం అయినా కృతీకి సక్సెస్‌పరంగా కిక్ ఇస్తుందా? ఆమె కెరీర్‌కి మంచి బ్రేక్ అవుతుందా?... వేచి చూడాలి. ఇంకో విషయం ఏంటంటే.. ఇప్పటివరకూ కృతి ఈ చిత్రానికి అధికారికంగా సైన్ చేయలేదట. చివరి నిమిషంలో చేజారినా ఆశ్చర్యపోవడానికి లేదు. -
కృతీకి బంపర్ ఆఫర్!
‘ఆవ్ తుజే మోకార్తా’ అంటూ ‘1 నేనొక్కడినే’ సినిమాలో మహేశ్‌బాబును టీజ్ చేసిన కృతీసనన్ ఆ చిత్రంతోనే కుర్రకారు హృదయాలను దోచేశారు. ఆ తర్వాత ‘దోచెయ్’ సినిమాలో నాగచైతన్య మనసుని కూడా దోచేసుకున్నారు. ఈ పొడుగు కాళ్ల సుందరి టాలీవుడ్లో ఫుల్ బిజీ అవుతుందని చాలామంది ఊహించారు. అయితే హిందీ రంగంలో అవకాశాలు రావడంతో కృతి అక్కడ బిజీ అయిపోయారు. బాలీవుడ్లో ‘హీరో పంతి’, ‘దిల్వాలే’ చిత్రాల్లో నటించిన కృతీని ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ వరించినట్లు సమాచారం. అక్కినేని నాగార్జున కెరీర్లో హిట్ పిక్చర్‌గా నిలిచిపోయిన వాటిలో ఒకటైన ‘హలో బ్రదర్’ చిత్రాన్ని అంత సులువుగా మర్చిపోలేం. ఆ చిత్రానికి హిందీ రీమేక్‌గా సల్మాన్‌ఖాన్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘జుద్వా’. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ రీమేక్ హిందీలో కూడా మంచి విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని తన కుమారుడు వరుణ్ ధావన్ హీరోగా మళ్లీ రీమేక్ చే యడానికి దేవిడ్ ధావన్ సన్నాహాలు చేస్తున్నారు. సాజిద్ నడియాడ్వాలా నిర్మించనున్న ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు స్థానం ఉంది. ఒక కథానాయికగా కృతీసనన్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. మరో కథానాయికగా శ్రద్ధాకపూర్ పేరును పరిశీలిస్తున్నారట. పాత ‘జుడ్వా’లో కరిష్మా కపూర్, శిల్పాశెట్టి అద్భుతంగా నటించారు. రెండు పాత్రలూ నటనకు అవకాశం ఉన్నవే. సో.. కృతీకి కనుక ఈ రీమేక్‌లో అవకాశం దక్కితే నటిగా ఇంకా నిరూపించుకోవడానికి స్కోప్ దొరికినట్లే! -
అమీ యాక్షన్..!
గాసిప్ ‘మదరాసపట్టణం’ సినిమాతో తెరంటేట్రం చేసిన అమీ జాక్సన్... ఏక్ దివాన థా (హిందీ), ఎవడు (తెలుగు), ‘ఐ’ సినిమాలతో ప్రేక్షకులకు చేరువైంది. ‘ఐ’ సినిమా గనుక హిట్టై ఉంటే ఈ బ్రిటన్ సుందరి కెరీర్ మరోలా ఉండేది.అమీ జాక్సన్ అక్షయ్ కుమార్‌తో కలిసి నటిస్తున్న ‘సింగ్ ఈజ్ బ్లింగ్’లో మొదట్లో కృతిసనన్‌ను తీసుకున్నారు. ఆమె నచ్చక పోవడంతో ప్రత్యామ్నాయం కోసం వేరే వాళ్లను వెదుకుతున్న డెరైక్టర్‌కి ఎవరో అమీ పేరు సూచించారట. అమీకి హార్స్రైడింగ్లో బాల్యం నుంచే పరిచయం ఉంది. ఈ సినిమాలో హార్స్‌రైడింగ్ సీన్లు ఎక్కువగా ఉండడంతో అమీని ఎంచుకోవడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనుకున్నారు అయితే ఎందుకైనా మంచిదని ఒక ట్రైనర్‌ను కూడా మాట్లాడుకున్నారు. అయితే ట్రైనర్ అవసరం లేకుండానే... తన రైడింగ్ స్కిల్‌ను అద్భుతంగా చాటుకుంది అమీ. దీంతో దర్శక, హీరోలు అబ్బురపడిపోయి అమీని తెగ మెచ్చుకున్నారట. ‘‘ఈ అమ్మాయితో యాక్షన్ సినిమా చేయిస్తే...మెగా హిట్ ఖాయం’’ అన్నాడట అక్షయ్ కుమార్.ఆయన ఎందుకన్నాడో తెలియదుగానీ... అదే నిజమైతే అమీని డిష్యుం డిష్యుం సీన్లలో చూడవచ్చున్నమాట!