
ఎస్‌ఎంఎస్ ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పిన్ నంబరు
పర్యావరణానికి మేలు చేసేలా, పేపర్ వినియోగాన్ని ఉద్దేశంతో బ్యాంకులు ఇప్పటికే ఎలక్ట్రానిక్ స్టేట్‌మెంట్స్‌ను మెయిల్ చేస్తున్నాయి. అయితే, డెబిట్ కార్డు పిన్ (పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబరు)ను మాత్రం డెబిట్ కార్డు హోల్డర్లకు పోస్ట్ ద్వారానే పంపుతున్నాయి. ఈ విషయంలో తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ మరో అడుగు ముందుకేసింది. పిన్ నంబరును వన్ టైమ్ పాస్‌వర్డ్ కింద కస్టమర్ మొబైల్ నంబరుకు నేరుగా పంపడాన్ని ఆవిష్కరించింది. దీన్ని గ్రీన్ పిన్‌గా వ్యవహరిస్తోంది. బ్యాంక్ ఏటీఎంలో కస్టమర్ దీన్ని మార్చుకోవచ్చు.