
ఇతడు గానీ గుడ్లు గానీ ఉరిమితేనా..?
తిక్క లెక్క
ఇతడు గానీ గుడ్లు గానీ ఉరిమితేనా..? రికార్డు బద్దలవ్వాల్సిందే! ఫొటోలోని ఈ బ్రెజిలియన్ పెద్దమనిషి పేరు క్లాడియో పాలో పింటో. మామూలుగా చూస్తే మర్యాదస్తుడైన పెద్దమనిషిలానే కనిపిస్తాడు. కానీ గుడ్లు ఉరిమి చూశాడో.. గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నపిల్లలు భయంతో బిక్కచచ్చి ఏడుపు ఆపేయాల్సిందే.
మనం ఎంత కోపంతో గుడ్లు ఉరిమినా కళ్లు కాస్తంత విశాలంగా మారి రౌద్రంగా కనిపిస్తాయంతే! ఇతగాడు గుడ్లు ఉరిమితేనా..? కనుగుడ్లు ఏకంగా ఏడు మిల్లీమీటర్ల వరకు ముందుకు పొడుచుకొస్తాయి. విచిత్రమైన ఈ ప్రతిభను గిన్నెస్‌బుక్ గుర్తించి, రికార్డును నమోదు చేసుకుంది.