డొల్లమెదడు
ఇక్ష్వాకుల కాలానికి ముందెప్పుడో భూమి బల్లపరుపుగా ఉండేదనే నమ్మకం ఉండేది గానీ, తర్వాత్తర్వాత భూమి గుండ్రంగా ఉన్నదనే సత్యం వ్యాప్తిలోకి వచ్చింది. అయితే, భూమి గుండ్రంగా మాత్రమే కాకుండా, డొల్లగా కూడా ఉందని బలంగా నమ్మాడు ఒక మేధావి. ఎవరి నమ్మకాలు వాళ్లవి. ఇందులో పేచీ లేదు. ఇంతటి మహత్తర నమ్మకం కలిగింది ఎవరికో కాదు, అప్పట్లో అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసిన జాన్ క్విన్సీ ఆడమ్స్‌కు (1825-29) ఎందుకో బలంగా అలా అనిపించింది.
అంతటితో సరిపెట్టుకోకుండా, తన నమ్మకాన్ని శాస్త్రీయంగా నిరూపించి, లోకానికి సత్యాన్ని చాటాలనుకున్నాడు. ఇకనేం! ప్రజాధనంతో భూమి డొల్లగా ఉందని నిరూపించేందుకు పరిశోధన జరిపించాడు. అందులో భూమి డొల్లతనం బయటపడలేదు గానీ, అతడిని డొల్లమెదడు మనిషిగా పరిగణించిన ప్రజలు తర్వాతి ఎన్నికల్లో పదవి నుంచి సాగనంపారు.