
వంకాయలను కోసిన వెంటనే ఒక స్పూను పాలు కలిపిన నీళ్లలో వేస్తే ముక్కలు నల్లబడవు.బంగాళాదుంపలను వారం పాటు నిలవ చేస్తే మొగ్గలు వస్తాయి. ఇలా రాకుండా ఉండాలంటే బంగాళాదుంపలతో పాటు ఒక ఆపిల్‌ను ఉంచాలి.బెండకాయల జిగురు పోవాలంటే వండేటప్పుడు రెండు చుక్కల నిమ్మరసం కాని ఒక స్పూను పెరుగు కాని కలపాలి.
కాఫీ కప్పులకు పట్టిన మరకలు పోవాలంటే సోడా నింపి మూడు గంటల తర్వాత కడగాలి. టొమాటోలను తొడిమ కింది వైపుకు వచ్చేటట్లుగా ఉంచితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment